కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

డబ్బు మీద, వస్తువుల మీద మోజు

డబ్బు మీద, వస్తువుల మీద మోజు

డబ్బు, వస్తువులు ఉండడం తప్పని బైబిలు చెప్తుందా?

ప్రస 7:12

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1రా 3:11-14—రాజైన సొలొమోను వినయం చూపించడం వల్ల యెహోవా అతన్ని విస్తారమైన సిరిసంపదలతో దీవించాడు

    • యోబు 1:1-3, 8-10—యోబు చాలా ధనవంతుడే అయినా, యెహోవాతో తనకున్న సంబంధాన్నే అన్నిటికన్నా ముఖ్యంగా ఎంచాడు

డబ్బు, వస్తువులు మనకు మనశ్శాంతిని సంతృప్తిని ఇవ్వలేవని ఎందుకు చెప్పవచ్చు?

ఏ సందర్భాల్లో డబ్బు అస్సలు ఉపయోగపడదు?

డబ్బు, వస్తువులతో ఉన్న అతిపెద్ద ప్రమాదం ఏంటి?

సిరిసంపదలు మనల్ని ఎలా మోసం చేయగలవు?

సామె 11:4, 18, 28; 18:11; మత్త 13:22

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • అపొ 8:18-24—సీమోను క్రైస్తవ సంఘంలో సేవా అవకాశాల్ని డబ్బుతో కొనుక్కోవచ్చని మూర్ఖంగా ఆలోచించాడు

మనం డబ్బును ప్రేమిస్తే ఏం కోల్పోయే ప్రమాదం ఉంది?

మత్త 6:19-21; లూకా 17:31, 32

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మార్కు 10:17-23—ఒక యువ ధనవంతుడు ఆస్తిపాస్తుల్ని ప్రేమించడం వల్ల క్రీస్తు శిష్యుడయ్యే అవకాశాన్ని కోల్పోయాడు

    • 1తి 6:17-19—పౌలు ధనవంతులైన క్రైస్తవులకు గర్విష్ఠులుగా ఉండొద్దని, అలా ఉంటే దేవుని అనుగ్రహాన్ని కోల్పోతారని చెప్పాడు

డబ్బు మీద, వస్తువుల మీద మోజు మన విశ్వాసాన్ని బలహీనపర్చి దేవుని ఆమోదాన్ని కోల్పోయేలా చేయగలదని ఎలా చెప్పవచ్చు?

ద్వితీ 8:10-14; సామె 28:20; 1యో 2:15-17

కీర్త 52:6, 7; ఆమో 3:12, 15; 6:4-8 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యోబు 31:24, 25, 28—ఆస్తిపాస్తుల మీద నమ్మకం పెట్టుకోవడం తప్పని, అలా చేస్తే దేవున్ని నమ్మినట్టు అవ్వదని యోబుకు తెలుసు

    • లూకా 12:15-21—యేసు డబ్బును, వస్తువులను ప్రేమించడం తప్పని హెచ్చరిస్తూ, చాలా డబ్బు ఉన్నాసరే దేవుని దృష్టిలో ధనవంతుడుకాని ఒక వ్యక్తి గురించి చెప్పాడు

మనకున్న వాటితో తృప్తిగా ఎలా ఉండవచ్చు?

డబ్బు, వస్తువుల కన్నా విలువైన సంపద ఏంటి, ఎందుకు?

సామె 3:11, 13-18; 10:22; మత్త 6:19-21

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • హగ్గ 1:3-11—ప్రజలు సత్యారాధనకు మద్దతు ఇవ్వకుండా ఇళ్లు, సౌకర్యాల కోసం కష్టపడుతున్నందుకు తన దీవెనలు కోల్పోయారని యెహోవా హగ్గయి ప్రవక్త ద్వారా చెప్పాడు

    • ప్రక 3:14-19—దేవుని సేవ కంటే వస్తుసంపదలకు మొదటిస్థానం ఇస్తున్నందుకు యేసు లవొదికయ సంఘం వాళ్లను గద్దించాడు

బ్రతకడానికి అవసరమైన వాటిని యెహోవా ఇస్తాడని ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?