తండ్రులు
తండ్రి బాధ్యతలేంటి?
ద్వితీ 6:6, 7; ఎఫె 6:4; 1తి 5:8; హెబ్రీ 12:9, 10
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
ఆది 22:2; 24:1-4—అబ్రాహాము ఇస్సాకును ఎంతో ప్రేమించాడు, తన కుమారుడు యెహోవాను ఆరాధించే స్త్రీనే పెళ్లి చేసుకునేలా చేయగలిగినదంతా చేశాడు
-
మత్త 13:55; మార్కు 6:3—యేసును ప్రజలు “వడ్రంగి కుమారుడు” అని, “వడ్రంగి” అని పిలిచేవాళ్లు; దాన్నిబట్టి యోసేపు తన కుమారుడికి పనికొచ్చే ఆ వృత్తిని నేర్పించాడని అర్థమౌతుంది
-
తండ్రి మీద ప్రేమ, గౌరవం ఎందుకు చూపించాలి?
మత్త 6:9 కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
హోషే 11:1, 4—యెహోవా ఒక తండ్రిగా ఉంచిన ఆదర్శాన్ని బట్టి మానవ తండ్రుల్ని గౌరవిస్తున్నాడని, వాళ్లను విలువైనవాళ్లలా చూస్తున్నాడని అర్థమౌతుంది. ఒక మానవ తండ్రి తన పిల్లల్ని ప్రేమగా చూసుకున్నట్టే యెహోవా కూడా తన ప్రజల్ని శ్రద్ధగా చూసుకుంటూ వాళ్లకు బోధిస్తున్నాడు
-
లూకా 15:11-32—యేసు మానవ తండ్రుల్ని విలువైనవాళ్లుగా ఎంచుతున్నాడని, వాళ్లను గౌరవిస్తున్నాడని ఆయన ఉపయోగించిన ఉదాహరణలో కనిపిస్తుంది. అందులో ఆయన యెహోవాను ప్రేమగల తండ్రితో పోలుస్తూ పశ్చాత్తాపపడే పాపుల మీద మన పరలోక తండ్రి కరుణ చూపిస్తాడని అన్నాడు
-