కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తల్లిదండ్రులు

తల్లిదండ్రులు

యెహోవా పెళ్లిని ఏర్పాటు చేయడానికి కొన్ని కారణాలు ఏంటి?

తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూడాలి?

కీర్త 127:3-5; 128:3

పిల్లలు; యౌవనులు” కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 33:4, 5—యాకోబు తన పిల్లల్ని యెహోవా ఇచ్చిన బహుమతిలా చూశాడు

    • నిర్గ 1:15, 16, 22; 2:1-4; 6:20—అమ్రాము, యోకెబెదు తమ కుమారుడైన మోషేను కాపాడడానికి వాళ్ల ప్రాణాల్ని పణంగా పెట్టారు

పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఏ బాధ్యత ఉంది?

ద్వితీ 6:6, 7; 11:18, 19; సామె 22:6; 2కొ 12:14; 1తి 5:8

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1స 1:1-4—ఎల్కానా తన కుటుంబాన్ని షిలోహులో జరిగే పండుగలకు తీసుకెళ్లేవాడు; తన పిల్లల్లో ప్రతీ ఒక్కరు యెహోవాను ఆరాధించేలా చూసుకునేవాడు

    • లూకా 2:39, 41—ప్రతీ సంవత్సరం యోసేపు, మరియలు తమ పిల్లల్ని తీసుకుని పస్కా పండుగను ఆచరించడానికి నజరేతు నుండి యెరూషలేముకు వెళ్లేవాళ్లు

పిల్లలు యెహోవాకు లోబడేలా శిక్షణ ఇవ్వడం ఎందుకు ప్రయోజనకరం?

సామె 1:8, 9; 22:6

2తి 3:14, 15 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1స 2:18-21, 26; 3:19—ఎల్కానా, హన్నా సమూయేలును గుడారంలో సేవ చేయడానికి పంపించినా, వాళ్లు అతన్ని క్రమంగా కలుస్తూ అతని అవసరాల్ని తీర్చారు; పెద్దయ్యాక సమూయేలు యెహోవా నమ్మకమైన సేవకుడిగా తయారయ్యాడు

    • లూకా 2:51, 52—తన తల్లిదండ్రులు అపరిపూర్ణులే అయినా యేసు వాళ్లకు లోబడి ఉన్నాడు

పిల్లల్ని పెంచడానికి మంచి సలహాల కోసం తల్లిదండ్రులు ఎక్కడ చూడవచ్చు?

ద్వితీ 6:4-9; ఎఫె 6:4; 2తి 3:14-17

కీర్త 127:1; సామె 16:3 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • న్యా 13:2-8—అద్భుతరీతిలో తన భార్య గర్భవతి అవుతుందని మానోహ తెలుసుకున్న తర్వాత ఆ బిడ్డను ఎలా పెంచాలో చెప్పమని యెహోవాను అడిగాడు

    • కీర్త 78:3-8—తల్లిదండ్రులు బైబిల్లో నేర్చుకున్నవాటిని పిల్లలకు చెప్పాలని యెహోవా కోరుకుంటున్నాడు

ఒక పిల్లవాడు దేవున్ని ప్రేమించే కుటుంబంలోనే పెరిగినా ఎందుకు యెహోవా సేవను ఆపేయవచ్చు?

యెహె 18:1-13, 20

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 6:1-5; యూదా 6—దూతలు పరలోకంలో యెహోవాతో పాటు లెక్కలేనన్ని సంవత్సరాలు ఉన్నా, వాళ్లలో చాలామంది ఆయన మీద తిరుగుబాటు చేశారు

    • 1స 8:1-3—సమూయేలు ప్రవక్త నమ్మకంగా, న్యాయంగా ఉన్నా అతని కుమారులు మాత్రం అన్యాయంగా, అక్రమంగా నడుచుకున్నారు

తల్లిదండ్రులు పిల్లలకు ఎప్పటినుండి దేవుని గురించి నేర్పించడం మొదలుపెట్టాలి?

2తి 3:15

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ద్వితీ 29:10-12, 29; 31:12; ఎజ్రా 10:1—యెహోవా గురించి నేర్చుకోవడానికి సమావేశమైనప్పుడు ఇశ్రాయేలీయులు తమ పిల్లల్ని కూడా తీసుకెళ్లేవాళ్లు

    • లూకా 2:41-52—ప్రతీ సంవత్సరం పస్కా పండుగ కోసం యోసేపు, మరియలు యేసుతో సహా పిల్లలందర్నీ యెరూషలేము ఆలయానికి తీసుకెళ్లేవాళ్లు

హానిచేసే వాళ్లనుండి పిల్లల్ని కాపాడడానికి తల్లిదండ్రులు ఎవరి ఉదాహరణలు పాటించాలి?

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • నిర్గ 19:4; ద్వితీ 32:11, 12—తన పిల్లల్ని మోస్తూ, కాపాడుతూ, శ్రద్ధగా చూసుకునే గద్దతో యెహోవా తనను తాను పోల్చుకున్నాడు

    • యెష 49:15—పాలు తాగే చంటిబిడ్డ మీద ఒక తల్లి ఎంత కనికరం చూపిస్తుందో, అంతకంటే ఎక్కువగా యెహోవా తన సేవకుల మీద కనికరం చూపిస్తాడని, వాళ్లను కాపాడి సంరక్షిస్తాడని మాటిచ్చాడు

    • మత్త 2:1-16—సాతాను జ్యోతిష్యుల్ని దుష్ట రాజైన హేరోదు వైపుకు నడిపించి, పసివాడైన యేసును చంపడానికి ప్రయత్నించాడు; కానీ కుటుంబాన్ని తీసుకుని ఐగుప్తుకు వెళ్లిపోమని యోసేపుకు చెప్పడం ద్వారా యెహోవా తన కుమారుడిని కాపాడాడు

    • మత్త 23:37—కోడి తన పిల్లల్ని రెక్కల చాటున చేర్చుకొని సంరక్షించినట్టే, యేసు కూడా తన ప్రజలకు సహాయం చేయాలనుకున్నాడని చెప్పాడు

తల్లిదండ్రులు పిల్లలకు సెక్స్‌ గురించి చెప్పడానికి ఎందుకు వెనకాడకూడదు?

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • లేవీ 15:2, 3, 16, 18, 19; ద్వితీ 31:10-13—మోషే ధర్మశాస్త్రంలో యెహోవా లైంగిక విషయాల గురించి చాలా సూటిగా చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని బిగ్గరగా చదివేటప్పుడు పిల్లలు కూడా అక్కడ ఉండాలని ఆయన చెప్పాడు

    • కీర్త 139:13-16—పిల్లల్ని కనే శక్తితో పాటు ఎన్నో సామర్థ్యాలతో అద్భుతంగా తయారు చేయబడిన మానవ శరీరాన్ని బట్టి కీర్తనకర్త అయిన దావీదు యెహోవాను స్తుతించాడు

    • సామె 2:10-15—చెడ్డ పనులు చేసే వాళ్లనుండి, మోసం చేసే వాళ్లనుండి యెహోవా ఇచ్చే తెలివి, జ్ఞానం మనల్ని కాపాడగలవు

తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు ప్రేమగా సరిదిద్దాలి?

సామె 13:24; 29:17; యిర్మీ 30:11; ఎఫె 6:4

కీర్త 25:8; 145:9; కొలొ 3:21 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • కీర్త 32:1-5—యెహోవా ఇచ్చిన క్రమశిక్షణ రాజైన దావీదుకు కష్టంగా అనిపించినా, నిజంగా పశ్చాత్తాపపడే వాళ్లను యెహోవా క్షమిస్తాడని తెలుసుకుని అతను ఊరట పొందాడు

    • యోనా 4:1-11—యోనా ప్రవక్త యెహోవాతో కోపంగా, అమర్యాదగా మాట్లాడినా యెహోవా మాత్రం ఓపిగ్గా అతనికి కరుణ గురించిన పాఠాన్ని నేర్పించాడు

క్రమశిక్షణ ఇవ్వడం ద్వారా తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ చూపిస్తున్నారని ఎందుకు చెప్పవచ్చు?