పండుగలు, వేడుకలు
క్రైస్తవులు చేసుకునేవి
క్రైస్తవులు జరుపుకునే ఒకేఒక్క ఆచరణ ఏంటి?
ఒక చోట కలుసుకుని ఆరాధించడాన్ని దేవుని ప్రజలు ఆనందిస్తారు
క్రైస్తవులు చేసుకోనివి
అబద్ధ మతం వల్ల కలుషితమైన పండుగల్లో పాల్గొనడం ఎందుకు తప్పు?
1కొ 10:21; 2కొ 6:14-18; ఎఫె 5:10, 11
“సత్యారాధనలో వేరే మతాచారాలను కలపడం” కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
నిర్గ 32:1-10—ఇశ్రాయేలీయులు సత్యారాధనను అబద్ధ మతాచారాలతో కలుషితం చేయడానికి ప్రయత్నించినప్పుడు యెహోవాకు చాలా కోపం వచ్చింది
-
సం 25:1-9—లైంగిక పాపాలు చేసినందుకు, అన్యమత పండుగల్లో పాల్గొన్నందుకు యెహోవా తన ప్రజల్ని శిక్షించాడు
-
క్రిస్మస్ నిజంగా క్రైస్తవుల పండుగేనా?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
లూకా 2:1-5—ప్రజలు తమ పేర్లు నమోదు చేయించుకోవాలని రోమన్లు ఆజ్ఞ ఇచ్చిన సమయంలో యేసు పుట్టాడు; అప్పటికే తిరుగుబాటు స్ఫూర్తి చూపిస్తున్న యూదుల్ని బాగా చలిగా ఉండి, వర్షాలు పడుతున్న సమయంలో సొంత ఊళ్లకు ప్రయాణమై పేర్లు నమోదు చేసుకోమని రోమన్లు ఆజ్ఞ ఇచ్చి ఉండరు
-
లూకా 2:8, 12—యేసు పుట్టినప్పుడు గొర్రెల కాపరులు రాత్రి పూట తమ గొర్రెల్ని బయట కాస్తూ ఉన్నారు; ఎంతో చలిగా ఉండే డిసెంబరు నెలలో వాళ్లు అలా చేసే అవకాశం ఉండదు
-
క్రైస్తవులు పుట్టిన రోజుల్ని జరుపుకోవచ్చా?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
ఆది 40:20-22—అబద్ధ దేవుళ్లను ఆరాధించే ఫరో తన పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నాడు, ఆ వేడుకలో భాగంగా ఒకతను చంపబడ్డాడు
-
మత్త 14:6-11—క్రీస్తు శిష్యుల్ని వ్యతిరేకించే దుష్ట రాజైన హేరోదు తన పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నాడు, ఆ వేడుకలో బాప్తిస్మం ఇచ్చే యోహాను చంపబడ్డాడు
-
మోషే ధర్మశాస్త్రానికి సంబంధించినవి
మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఆచారాల్ని, వేడుకల్ని నేడు క్రైస్తవులు కూడా చేయాలా?
గల 4:4, 5, 9-11; హెబ్రీ 8:7-13; 9:1-3, 9, 10, 24 కూడా చూడండి
నేడు క్రైస్తవులు విశ్రాంతి రోజును ఆచరించాలా?
నిర్గ 31:16, 17 కూడా చూడండి
జాతీయ వేడుకలు
దేశ చరిత్రకు సంబంధించిన వేడుకల్లో క్రైస్తవులు పాల్గొనవచ్చా?
“ప్రభుత్వాలు—క్రైస్తవులు ఎవరి వైపూ ఉండరు” కూడా చూడండి
యుద్ధాల్ని అలాగే సైనికుల్ని గుర్తుచేసుకుంటూ చేసే వేడుకల్లో క్రైస్తవులు పాల్గొనవచ్చా?
“ప్రభుత్వాలు—క్రైస్తవులు ఎవరి వైపూ ఉండరు” అలాగే “యుద్ధం” కూడా చూడండి
యెహోవాకు చెందాల్సిన ఘనతను మనుషులకు ఇచ్చి, వాళ్లను అతిగా గౌరవిస్తూ చేసే వేడుకల్లో క్రైస్తవులు పాల్గొనవచ్చా?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
అపొ 12:21-23—ప్రజలు పూజ్యభావంతో ఇచ్చిన ఘనతను స్వీకరించినందుకు రాజైన హేరోదు అగ్రిప్పను దేవుడు శిక్షించాడు
-
అపొ 14:11-15—ప్రజలు అపొస్తలులైన పౌలు, బర్నబాలను అతిగా గౌరవిస్తూ పూజించడానికి ప్రయత్నించినప్పుడు దానికి వాళ్లిద్దరు అస్సలు ఒప్పుకోలేదు
-
ప్రక 22:8, 9—తనను ఆరాధించడాన్ని దేవదూత అంగీకరించలేదు
-