కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పశ్చాత్తాపం

పశ్చాత్తాపం

మనుషులందరూ తమ పాపాల విషయంలో పశ్చాత్తాపపడి క్షమాపణ కోసం యెహోవాను ఎందుకు అడగాలి?

రోమా 3:23; 5:12; 1యో 1:8

అపొ 26:20 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • లూకా 18:9-14—మన పాపాల్ని ఒప్పుకుని దేవుని సహాయం కోసం ప్రార్థించాలని నేర్పిస్తూ యేసు ఒక ఉదాహరణ చెప్పాడు

    • రోమా 7:15-25—పౌలు ఒక అపొస్తలుడు, బలమైన విశ్వాసం ఉన్న వ్యక్తి; అయినాసరే అతను పాపం చేయాలనే కోరికతో ఇంకా పోరాడుతున్నందుకు బాధపడ్డాడు

పశ్చాత్తాపపడే వాళ్లను చూసినప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

యెహె 33:11; రోమా 2:4; 2పే 3:9

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • లూకా 15:1-10—ఒక పాపి పశ్చాత్తాపపడినప్పుడు యెహోవా, దేవదూతలు ఎంతో సంతోషిస్తారని తెలియజేయడానికి యేసు కొన్ని ఉదాహరణలు చెప్పాడు

    • లూకా 19:1-10—పన్ను వసూలు చేసే ముఖ్య అధికారియైన జక్కయ్య ఇతరుల దగ్గర అన్యాయంగా డబ్బులు లాక్కునేవాడు; అతను పశ్చాత్తాపం చూపించి తన పనుల్ని మార్చుకున్నప్పుడు క్షమాపణ, రక్షణ పొందాడు

మనం నిజంగా పశ్చాత్తాపపడుతున్నామని ఎలా చూపించవచ్చు?

సరైన జ్ఞానం నిజమైన పశ్చాత్తాపం చూపించే వ్యక్తికి ఎలా సహాయం చేస్తుంది?

రోమా 12:2; కొలొ 3:9, 10; 2తి 2:25

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • అపొ 17:29-31—అపొస్తలుడైన పౌలు విగ్రహపూజ సరైన జ్ఞానం మీద ఆధారపడి లేదని ఏథెన్సు ప్రజలకు వివరిస్తూ వాళ్లను పశ్చాత్తాపపడమని ప్రోత్సహించాడు

    • 1తి 1:12-15—యేసుక్రీస్తు గురించిన సరైన జ్ఞానం నేర్చుకోకముందు పౌలు తెలియక ఎన్నో ఘోరమైన పాపాలు చేశాడు

పశ్చాత్తాపపడడం ఎందుకంత ప్రాముఖ్యం?

మనం చాలాసార్లు పాపం చేసినా పశ్చాత్తాపపడితే యెహోవా మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాడని ఎందుకు నమ్మవచ్చు?

పాపాల్ని ఒప్పుకుని చెడ్డ పనుల్ని విడిచిపెట్టిన వాళ్లతో యెహోవా ఎలా ఉంటాడు?

పశ్చాత్తాపపడడం అంటే కేవలం క్షమించమని అడగడం, జరిగిన దానిగురించి బాధపడడం మాత్రమే కాదని ఎలా చెప్పవచ్చు?

2ది 7:14; సామె 28:13; యెహె 18:30, 31; 33:14-16; మత్త 3:8; అపొ 3:19; 26:20

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2ది 33:1-6, 10-16—రాజైన మనష్షే చాలాకాలం పాటు చెడ్డగా ప్రవర్తించినా అతను వినయం చూపిస్తూ, ప్రార్థన చేస్తూ, తన చెడ్డ ప్రవర్తనను మార్చుకున్నప్పుడు నిజంగా పశ్చాత్తాపపడుతున్నట్టు చూపించాడు

    • కీర్త 32:1-6; 51:1-4, 17—రాజైన దావీదు తన పాపాల్ని ఒప్పుకుని, ప్రార్థించి, యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశానని తీవ్రంగా బాధపడడం ద్వారా పశ్చాత్తాపాన్ని చూపించాడు

ఎవరైనా మనకు వ్యతిరేకంగా పాపం చేశాక పశ్చాత్తాపపడితే మనం ఎందుకు క్షమించాలి?