కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాపం

పాపం

పాపం అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి చెడు ఫలితాలు వచ్చాయి?

చెడు కోరికలతో పోరాడగలమని బైబిలు మనకు ఎలా భరోసాను ఇస్తుంది?

రోమా 6:12-14

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2స 11:2-5, 14, 15, 26, 27; 12:1-13—రాజైన దావీదు ఘోరమైన పాపాలు చేసినప్పుడు క్రమశిక్షణ పొందాడు; తర్వాత ఆయన పశ్చాత్తాపం చూపించాడు

    • రోమా 7:15-24—పౌలుకు బలమైన విశ్వాసం, దైవభక్తి ఉన్నప్పటికీ తప్పుడు కోరికలతో, ఆలోచనలతో గట్టి పోరాటం చేశాడు

చాలామంది ఎందుకు పాపం చేస్తారు?

ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తూ ఉండడం ఎందుకు ఘోరమైన తప్పు?

పాపం చేసేలా సాతాను దేవుని సేవకుల్ని ఎలా ప్రలోభపెడతాడు?

సామె 1:10, 11, 15; మత్త 5:28; యాకో 1:14, 15

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 3:1-6—హవ్వ స్వార్థం, అత్యాశ చూపించేలా సాతాను ఒక సర్పాన్ని ఉపయోగించి ప్రలోభపెట్టాడు; దానివల్ల ఆమెకు యెహోవా మీద నమ్మకం తగ్గిపోయింది

    • సామె 7:6-10, 21-23—నైతికంగా దిగజారిన ఒక స్త్రీ పెట్టిన ప్రలోభానికి వివేచనలేని యువకుడు ఎలా లొంగిపోయాడో రాజైన సొలొమోను వివరించాడు

సాతాను పెట్టే ప్రలోభాల్ని మనం ఎలా తిప్పికొట్టవచ్చు?

ఎఫె 4:27; 6:10-18; యాకో 4:7, 8

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • సామె 5:1-14—లైంగిక పాపం అనే ప్రలోభానికి ఎందుకు, ఎలా దూరంగా ఉండాలో రాజైన సొలొమోను పవిత్రశక్తి సహాయంతో ఒక తండ్రిలా సలహా ఇచ్చాడు

    • మత్త 4:1-11—యేసు సాతాను ప్రలోభాల్ని దేవుని వాక్యంతో తిప్పికొట్టాడు

క్రైస్తవులు చేయకూడని కొన్ని ఘోరమైన పాపాలేంటి?

చెడ్డపనులు” చూడండి

పాపాల్ని ఒప్పుకోవడం

మనం చేసిన పాపాల్ని ఎందుకు దాచడానికి ప్రయత్నించకూడదు?

చేసిన పాపాలన్నిటినీ ఎవరిముందు ఒప్పుకోవాలి?

యెహోవా ముందు మన తరఫున వేడుకోవడానికి ‘సహాయకుడిగా’ ఎవరు ఉంటారు?

ఒక వ్యక్తి పశ్చాత్తాపపడుతున్నాడని ఎలా చూపిస్తాడు?

అపొ 26:20; యాకో 4:8-10

పశ్చాత్తాపం” కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • నిర్గ 22:1-12—మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి ఏదైన దొంగిలిస్తే అతను దానికి నష్టపరిహారం చెల్లించాలి

    • లూకా 19:8, 9—పన్ను వసూలు చేసే ముఖ్య అధికారియైన జక్కయ్య తన జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా, అలాగే అన్యాయంగా ఎవరి దగ్గరైతే డబ్బులు లాక్కున్నాడో వాళ్లకు తిరిగి ఇచ్చేయడం ద్వారా పశ్చాత్తాపపడుతున్నాడని చూపించాడు

యెహోవా మనల్ని క్షమిస్తాడని ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?

క్షమించడం” చూడండి

ఒక వ్యక్తి ఘోరమైన పాపం చేస్తే, అతనికి సహాయం చేయడానికి అలాగే సంఘాన్ని కాపాడడానికి యెహోవా ఎలాంటి ఏర్పాటు చేశాడు?

యాకో 5:14, 15

అపొ 20:28; గల 6:1 కూడా చూడండి

ఎవరైనా ఘోరమైన పాపం చేస్తే అది వాళ్ల కుటుంబంపై లేదా సంఘంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

హెబ్రీ 12:15, 16

ద్వితీ 29:18 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యెహో 7:1-13, 20-26—ఆకాను ఒక ఘోరమైన పాపం చేసి, దాన్ని దాచడానికి ప్రయత్నించడం వల్ల ఇశ్రాయేలు దేశంపై పెద్ద విపత్తును తీసుకొచ్చాడు

    • యోనా 1:1-16—యోనా ప్రవక్త యెహోవా మాట వినకపోవడం వల్ల, ఓడలో తనతోపాటు ఉన్నవాళ్లందరి ప్రాణాల్ని ప్రమాదంలో పడేశాడు

    • 1కొ 5:1-7—కొరింథు సంఘంపై చెడు ప్రభావం చూపించిన ఒక ఘోరమైన పాపాన్ని అపొస్తలుడైన పౌలు బయటపెట్టాడు

క్రమశిక్షణ ఇస్తారనే భయం వల్ల మనం పెద్దల సహాయం తీసుకోవడానికి ఎందుకు వెనకాడకూడదు?

గతంలో చేసిన పాపం విషయంలో మనం కుమిలిపోతూ ఉండే బదులు దేవుడు మనల్ని క్షమించాడని ఎందుకు నమ్మకంతో ఉండాలి?

క్షమించడం” చూడండి

ఒక వ్యక్తి ఘోరమైన పాపం చేశాడని మనకు తెలిస్తే, అతను దాన్ని సంఘపెద్దలకు చెప్పేలా చూసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

లేవీ 5:1

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • ద్వితీ 13:6-9; 21:18-20—మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా ఘోరమైన పాపం చేస్తే, అది మన కుటుంబ సభ్యులైనా, మనకెంతో ఇష్టమైనవాళైనా మనం దాన్ని దాచిపెట్టకుండా చెప్పాలి