కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పెళ్లి

పెళ్లి

పెళ్లిని ఎవరు ఏర్పాటు చేశారు?

ఒక క్రైస్తవుడు ఎవర్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలి?

క్రైస్తవ తల్లిదండ్రులు బాప్తిస్మం తీసుకున్న తమ పిల్లల్ని సమర్పించుకొనని, బాప్తిస్మం పొందని వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేయడాన్ని ఎందుకు ఆమోదించరు?

1కొ 7:39; 2కొ 6:14, 15

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 24:1-4, 7—వృద్ధుడైన అబ్రాహాము తన కొడుకు ఇస్సాకుకు ఎలాగైనా యెహోవా సేవకురాలిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు, అంతేగానీ వేరే దేవతలను ఆరాధించే కనానీయులకు కాదు

    • ఆది 28:1-4—ఇస్సాకు తన కొడుకు యాకోబుకు యెహోవాను ఆరాధించే వ్యక్తిని పెళ్లి చేసుకోమని చెప్పాడు కానీ కనానీయులను కాదు

ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

ద్వితీ 7:3, 4

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1రా 11:1-6, 9-11—తాను ఇచ్చిన హెచ్చరికల్ని పట్టించుకోనందుకు రాజైన సొలొమోను మీద యెహోవాకు చాలా కోపం వచ్చింది ఎందుకంటే అతను విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు, వాళ్లు అతని హృదయాన్ని తప్పుదారి పట్టించారు

    • నెహె 13:23-27—యెహోవాలాగే నెహెమ్యా కూడా విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకున్న ఇశ్రాయేలీయుల మీద కోపంతో మండిపడ్డాడు, వాళ్లకు క్రమశిక్షణ ఇచ్చి సరిదిద్దాడు

యెహోవాను నమ్మకంగా సేవిస్తూ, మంచిపేరు సంపాదించుకున్న వ్యక్తినే పెళ్లి చేసుకోవడం ఎందుకు తెలివైన పని?

సామె 18:22; 31:10, 28

ఎఫె 5:28-31, 33 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1స 25:2, 3, 14-17—నాబాలు చాలా ధనవంతుడు కానీ కఠినుడు, చెడుగా ప్రవర్తించేవాడు కాబట్టి అబీగయీలుకు మంచి భర్త కాలేకపోయాడు

    • సామె 21:9—సరైన వ్యక్తిని పెళ్లి చేసుకోకపోతే మన జీవితంలో సంతోషం, ప్రశాంతత కరువైపోతాయి

    • రోమా 7:2—ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు ఒక అపరిపూర్ణ పురుషుడి అధికారం కిందకి వస్తుందని అపొస్తలుడైన పౌలు వివరించాడు, కాబట్టి ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే విషయంలో ఆమె జాగ్రత్తగా ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకోవాలి

పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడం

ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలని ఆలోచించే ముందు ఒక కుటుంబాన్ని చూసుకునే సామర్థ్యాన్ని సంపాదించుకోవడం ఎందుకు అవసరం?

1తి 5:8

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • సామె 24:27—ఒక అబ్బాయి కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని చూసుకునే సామర్థ్యాన్ని సంపాదించుకున్న తర్వాతే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం మంచిది

డేటింగ్‌ చేస్తున్నప్పుడు అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం గడుపుతున్నప్పుడు ఒక అబ్బాయి, అమ్మాయి తెలివైన సలహాలు తీసుకుంటూ, ఒకరి లక్షణాలను ఒకరు అర్థం చేసుకోవాలే గానీ పైరూపాన్ని బట్టి ఎందుకు వెళ్లకూడదు?

సామె 13:10; 1పే 3:3-6

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • రూతు 2:4-7, 10-12—బోయజు రూతు గురించి ఎలా తెలుసుకున్నాడంటే, అతను ఆమె పని అలవాట్లను గమనించాడు, ఆమె సంపాదించుకున్న మంచిపేరు గురించి నమ్మకస్థులు చెప్పిన విషయాల్ని ఆలోచించాడు, అలాగే ఆమె నయోమితో ఎలా ఉందో, యెహోవాను ఎంత ప్రేమిస్తుందో చూశాడు

    • రూతు 2:8, 9, 20—రూతు కూడా బోయజు గురించి ఎలా తెలుసుకుందంటే, అతను చూపించిన దయను, ఇచ్చే గుణాన్ని, అతనికి యెహోవా మీద ఉన్న ప్రేమను గమనించింది

ఒక అబ్బాయి, అమ్మాయి డేటింగ్‌ సమయంలో అలాగే పెళ్లి కుదిరిన తర్వాత నైతిక విషయాల్లో పవిత్రంగా ఉండాలని యెహోవా ఎందుకు కోరుతున్నాడు?

గల 5:19; కొలొ 3:5; 1థె 4:4

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • సామె 5:18, 19—ప్రత్యేకమైన రీతిలో ప్రేమానురాగాలను చూపించుకోవడం పెళ్లి అయిన వాళ్లకు మాత్రమే పరిమితం

    • పర 1:2; 2:6—ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం గడుపుతున్నప్పుడు ప్రేమికులైన గొర్రెల కాపరి అలాగే షూలమ్మీతీ హద్దులు దాటకుండా తమ ప్రేమానురాగాలను చూపించుకున్నారు, అంతేగానీ లైంగికంగా ఎలాంటి అపవిత్రమైన పనులు చేయలేదు

    • పర 4:12; 8:8-10—షూలమ్మీతీ ఆత్మనిగ్రహం చూపిస్తూ పవిత్రంగా ఉంది; ఆమె కంచె వేసిన తోటలా ఉంది

ఒక అబ్బాయి, అమ్మాయి చట్టబద్ధంగా ఎందుకు పెళ్లి చేసుకోవాలి?

భర్త బాధ్యతలు

భర్తకు ఎలాంటి బరువైన బాధ్యతల్ని యెహోవా అప్పగించాడు?

ఒక క్రైస్తవ భర్త ఎవర్ని ఆదర్శంగా తీసుకుని తన శిరస్సత్వాన్ని నిర్వహించాలి?

ఒక క్రైస్తవ భర్త తన భార్యను అర్థం చేసుకుంటూ ఆమెతో ప్రేమగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

కొలొ 3:19; 1పే 3:7

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 21:8-12—అబ్రాహాముకు శారా ఇచ్చిన సలహా నచ్చకపోయినా ఆమె మాట వినమని యెహోవా అతనికి చెప్పాడు

    • సామె 31:10, 11, 16, 28—ఒక తెలివైన భర్త ఎలా ఉంటాడో ఈ లేఖనాలు వివరిస్తున్నాయి, ఆయన తన భార్య మీద అజమాయిషీ చేయడం గానీ, ఆమెను తప్పుబట్టడం గానీ చేయడు, బదులుగా ఆమెను పూర్తిగా నమ్ముతాడు, ఆమెను మెచ్చుకుంటాడు

    • ఎఫె 5:33—భర్త తనను ప్రేమిస్తున్నాడని భార్యకు అనిపించేలా ప్రవర్తించాలని అపొస్తలుడైన పౌలు భర్తలకు రాసిన మాటలు చూపిస్తున్నాయి

భార్య బాధ్యతలు

ఒక క్రైస్తవ భార్యకు యెహోవా ఏ ప్రాముఖ్యమైన బాధ్యత అప్పగించాడు?

లేఖనాలు భార్య స్థానాన్ని చులకన చేసి మాట్లాడుతున్నాయా?

ఆది 1:26-28, 31; 2:18

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • సామె 1:8; 1కొ 7:4—ఒక స్త్రీకి పెళ్లి అయిన తర్వాత కుటుంబంలో ఆమె ఒక భార్యగా, తల్లిగా కొంత అధికారం చూపించే అవకాశాన్ని దేవుడు ఆమెకు ఇచ్చాడు

    • 1కొ 11:3—యెహోవా ఏర్పాటు చేసిన క్రమాన్ని బట్టి చూస్తే, సర్వశక్తిమంతుడైన దేవుడు తప్ప మిగతా వాళ్లంతా ఏదోక విధమైన శిరస్సత్వం కింద ఉన్నారని అపొస్తలుడైన పౌలు వివరించాడు

    • హెబ్రీ 13:7, 17—స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా సంఘంలో అందరూ నాయకత్వం వహించే సహోదరులకు సహకరిస్తూ, వాళ్లకు లోబడి ఉండాలి

తన భర్త సత్యంలో లేకపోయినా భార్య యెహోవాను ఎలా సంతోషపెట్టవచ్చు?

ఒక క్రైస్తవ భార్య ఎందుకు తన భర్తను గౌరవిస్తూ ఉండాలి?

ఎఫె 5:33

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • ఆది 18:12; 1పే 3:5, 6—శారా తన భర్త అబ్రాహామును ఎంతో గౌరవించింది, ఆమె తన ఆలోచనల్లో కూడా ఆయన్ని తన “ప్రభువు” అని, తన ఆధ్యాత్మిక శిరస్సు అని అనుకుంది

బైబిలు ఎలాంటి భార్యను పొగుడుతుంది?

సామె 19:14; 31:10, 13-31

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 24:62-67—ఇస్సాకు తల్లి చనిపోయిన తర్వాత రిబ్కా అతనికి ఊరటనిచ్చింది

    • 1స 25:14-24, 32-38—కనికరం చూపించమని వినయంగా దావీదును వేడుకోవడం ద్వారా అబీగయీలు మూర్ఖుడైన తన భర్తను అలాగే తన కుటుంబాన్ని కాపాడుకుంది

    • ఎస్తే 4:6-17; 5:1-8; 7:1-6; 8:3-6—రాజుగా ఉన్న తన భర్త పిలవకపోయినా ఎస్తేరు రాణి రెండుసార్లు రాజగృహంలో ప్రవేశించింది, అలా దేవుని ప్రజల్ని కాపాడడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టింది

సమస్యల్ని పరిష్కరించుకోవడం

పెళ్లయ్యాక వచ్చే సమస్యల్ని పరిష్కరించుకోవడానికి భార్యాభర్తలకు ఏ సూత్రాలు సహాయం చేస్తాయి?

డబ్బు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి భార్యాభర్తలకు ఏ సూత్రాలు సహాయం చేస్తాయి?

అత్తామామాలకు, బంధువులకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి భార్యాభర్తలకు ఏ సూత్రాలు సహాయం చేస్తాయి?

భార్యాభర్తలు లైంగిక సంబంధాల విషయంలో ఏ సూత్రాల్ని మనసులో ఉంచుకోవాలి?

ఒక వ్యక్తి తన భార్య లేదా భర్త బలహీనతలపై కాకుండా వాళ్ల మంచి లక్షణాలపై ఎందుకు దృష్టిపెట్టాలి?

కోపావేశాల్ని పెంచుకుంటూపోయే బదులు సమస్యల్ని వెంటనే ప్రేమగా పరిష్కరించుకోవడం ఎందుకు మంచిది?

అదుపులేని కోపం చూపించడం, అరవడం, తిట్టడం, కొట్టడం లాంటివి క్రైస్తవులు ఎందుకు అస్సలు చేయకూడదు?

అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు భార్యాభర్తల లక్ష్యం ఏమై ఉండాలి?

పెళ్లయ్యాక భార్యాభర్తలు యెహోవాకు మొదటిస్థానం ఇస్తే ఎలాంటి దీవెనలు వస్తాయి?

పెళ్లి విషయంలో యెహోవా పెట్టిన ప్రమాణాలు

లైంగిక సంబంధాల విషయంలో, పెళ్లి విషయంలో యెహోవా పెట్టిన ప్రమాణాలు ఏంటి?

ఒకరికన్నా ఎక్కువమందిని పెళ్లి చేసుకోవడం గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయి?

పెళ్లి అనేది పురుషునికి-స్త్రీకి మధ్య మాత్రమే జరగాలని మనకెలా తెలుసు?

భార్యాభర్తలు ఎందుకు కలిసే ఉండాలి?

క్రైస్తవులు విడాకులు తీసుకోవడానికి ఒకే ఒక్క లేఖనాధారిత కారణం ఏంటి?

సరైన కారణాలు లేకుండా విడాకులు తీసుకుంటే యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

ఒక వ్యక్తి భార్య లేదా భర్త చనిపోతే, ఆమెకు లేదా అతనికి మళ్లీ పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉందా?