కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రభుత్వాలు

ప్రభుత్వాలు

నిజ క్రైస్తవులు ఏ ప్రభుత్వానికి పూర్తిగా లోబడి మద్దతిస్తారు?

మత్త 6:9, 10, 33; 10:7; 24:14

దాని 7:13, 14 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • కీర్త 89:18-29—ఈ లేఖనాలు మెస్సీయ రాజు ఎలా ఉంటాడో వివరిస్తున్నాయి అలాగే యెహోవా ఆయనకు మిగతా పరిపాలకులందరి మీద అధికారం ఇస్తాడని చెప్తున్నాయి

    • ప్రక 12:7-12—చివరి రోజులు ఆరంభమైనప్పుడు మెస్సీయ రాజు తన పరిపాలన మొదలుపెట్టి సాతాన్ని పరలోకం నుండి పడేశాడు

భూమ్మీద ఉన్న క్రీస్తు అభిషిక్త అనుచరులు దేవుని రాజ్యానికి ప్రతినిధులుగా ఎలా పని చేస్తున్నారు?

క్రైస్తవులు ప్రభుత్వ అధికారుల్ని గౌరవిస్తారు

మనం దేశ చట్టాలకు ఎందుకు లోబడుతూ పన్నులు కడతాం?

రోమా 13:1-7; తీతు 3:1; 1పే 2:13, 14

అపొ 25:8 కూడా చూడండి

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • మత్త 22:15-22—తన శిష్యులు పన్నులు కట్టాలా వద్దా అనే ప్రశ్నకు యేసు తెలివిగా జవాబిచ్చాడు

మనల్ని హింసించేవాళ్లతో ఎందుకు చెడుగా ప్రవర్తించం?

యోహా 18:36; 1పే 2:21-23

హింస” కూడా చూడండి

క్రైస్తవులు ఎవరి వైపూ ఉండరు

ప్రభుత్వ అధికారుల్ని మనం గౌరవిస్తున్నా, యెహోవా దేవునికి లోబడవద్దని వాళ్లు కోరినప్పుడు క్రైస్తవులుగా మనం దానికి ఎందుకు ఒప్పుకోం?

అపొ 4:18-20; 5:27-29

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • దాని 3:1, 4-18—ముగ్గురు హెబ్రీ యువకులు బబులోనులో ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉన్న చట్టానికి లోబడలేదు

    • దాని 6:6-10—ప్రార్థించవద్దని ప్రభుత్వం చెప్పినప్పుడు వృద్ధుడైన దానియేలు ప్రవక్త దానికి లోబడలేదు

క్రైస్తవులు రాజకీయాలకు దూరంగా ఉండాలని యేసు తన ఆదర్శం ద్వారా ఎలా చూపించాడు?

విగ్రహపూజ విషయంలో దేవుడు పెట్టిన నియమాల్ని గుర్తుంచుకుంటే, క్రైస్తవులు రాజకీయ విషయాల్లో ఎలా తటస్థంగా ఉండగలుగుతారు?

నిర్గ 20:4, 5; 1కొ 10:14; 1యో 5:21

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • దాని 3:1, 4-18—రాజైన నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని తయారు చేయించి, దాన్ని బహుశా అబద్ధ దేవుడైన మార్దుకుకు సమర్పించి, ప్రజలందరూ దాన్ని ఆరాధించాలని ఆజ్ఞాపించాడు

యుద్ధంలో పాల్గొనమని ప్రభుత్వం ఆదేశించినప్పుడు మంచి నిర్ణయం తీసుకోవడానికి క్రైస్తవులకు ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి?

యెష 2:4; యోహా 18:36

కీర్త 11:5 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మత్త 26:50-52—తన శిష్యులు యుద్ధంలో పాల్గొనరని యేసు స్పష్టంగా చెప్పాడు

    • యోహా 13:34, 35—ఒక క్రైస్తవుడు ఇలా ప్రశ్నించుకోవచ్చు, ‘క్రైస్తవులు యుద్ధాల్లో పాల్గొని ఒకరినొకరు చంపుకుంటే వాళ్లు ఈ లేఖనంలో క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞకు లోబడినట్టు అవుతుందా?’

లోక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేసే ధర్నాల్లో, పోరాటాల్లో క్రైస్తవులు ఎందుకు పాల్గొనరు?

తిరుగుబాటుదారులమని, గొడవలు రేపే ప్రజలమని ప్రభుత్వాలు మనమీద నిందలు వేస్తే మనం ఎందుకు ఆశ్చర్యపోం?

లూకా 23:1, 2; యోహా 15:18-21

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • అపొ 16:19-23—అపొస్తలుడైన పౌలు, సీల ప్రకటనా పని వల్ల ఎన్నో హింసలు ఎదుర్కొన్నారు