ప్రార్థన
యెహోవా మన ప్రార్థనలు విని, వాటికి జవాబు ఇస్తాడని ఎలా చెప్పవచ్చు?
కీర్త 66:19; అపొ 10:31; హెబ్రీ 5:7 కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
1రా 18:36-38—కర్మెలు పర్వతం మీద బయలు ప్రవక్తలతో తలపడిన ఏలీయా ప్రవక్త చేసిన ప్రార్థనకు యెహోవా చిటికెలో జవాబు ఇచ్చాడు
-
మత్త 7:7-11—పట్టుదలగా ప్రార్థించమని ప్రోత్సహిస్తూ, ప్రేమగల యెహోవా తండ్రీ మనం చేసే ప్రార్థనలకు జవాబు ఇస్తాడని కూడా యేసు భరోసా ఇచ్చాడు
-
క్రైస్తవులు ఎవరికి మాత్రమే ప్రార్థించాలి?
మనం ఎవరి పేరున ప్రార్థించాలి?
యెహోవా ఎవరి ప్రార్థనలు వింటాడు?
యెహోవా ఎవరి ప్రార్థనలు వినడు?
సామె 15:29; 28:9; యెష 1:15; మీకా 3:4; యాకో 4:3; 1పే 3:7
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
యెహో 24:9, 10—తన ఇష్టానికి వ్యతిరేకంగా బిలాము ప్రార్థించాడు కాబట్టి యెహోవా అతని ప్రార్థన వినలేదు
-
యెష 1:15-17—తన ప్రజలు వేషధారుల్లా ప్రవర్తిస్తున్నందుకు, వాళ్ల చేతులు రక్తంతో నిండిపోయినందుకు యెహోవా వాళ్ల ప్రార్థనల్ని వినడానికి ఇష్టపడలేదు
-
ప్రార్థన చివర్లో ఏం అనాలి, ఎందుకు?
మనం ఫలానా భంగిమలోనే ప్రార్థించాలని బైబిలు చెప్తుందా?
1రా 8:54; మార్కు 11:25; లూకా 22:39, 41; యోహా 11:41
యోనా 2:1 కూడా చూడండి
ఆరాధించడానికి కలుసుకున్నప్పుడు యెహోవా సేవకులు ఏ విషయాల గురించి ప్రార్థించవచ్చు?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
1ది 29:10-19—ఆలయం కోసం ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చినప్పుడు రాజైన దావీదు ఇశ్రాయేలీయులందరి తరఫున ప్రార్థించాడు
-
అపొ 1:12-14—అపొస్తలులు, యేసు తమ్ముళ్లు, యేసు తల్లి మరియ, ఇంకొంతమంది నమ్మకమైన స్త్రీలు యెరూషలేములోని ఒక మేడ గదిలో కలుసుకుని ప్రార్థించారు
-
ప్రార్థన చేసేటప్పుడు గొప్పలు చెప్పుకోవడం గానీ, ఇతరుల్ని మెప్పించడం గానీ ఎందుకు చేయకూడదు?
భోజనం చేసేముందు ప్రార్థన చేయడం సరైనదేనా?
మన పరలోక తండ్రికి ప్రార్థన చేసే అవకాశాన్ని మనం ఎందుకు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు?
రోమా 12:12; ఎఫె 6:18; 1థె 5:17; 1పే 4:7
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
దాని 6:6-10—తనను చంపేస్తారని తెలిసినా దానియేలు ప్రవక్త బహిరంగంగా ప్రార్థన చేసే అలవాటును మాత్రం మానేయలేదు
-
లూకా 18:1-8—ఒక స్త్రీ న్యాయం చేయమని పదేపదే అడిగినప్పుడు సహాయం చేసిన ఒక అన్యాయస్థుడైన న్యాయమూర్తి ఉదాహరణ యేసు చెప్పాడు; ఒక అన్యాయస్థుడే అలా చేస్తే న్యాయవంతుడైన మన తండ్రి తన సేవకులు పట్టుదలగా చేసే ప్రార్థనలకు ఇంకెంత త్వరగా జవాబు ఇస్తాడో ఆలోచించమని చెప్పాడు
-
క్షమించమని చేసే ప్రార్థనల్ని దేవుడు వినాలంటే మనకు ఎలాంటి వైఖరి ఉండాలి?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
2రా 22:11-13, 18-20—రాజైన యోషీయా తనను తాను తగ్గించుకుని, యెహోవాను సంతోషపెట్టడానికి ప్రయత్నించాడు కాబట్టి దేవుడు అతని మీద గొప్ప కరుణ, దయ చూపించాడు
-
2ది 33:10-13—రాజైన మనష్షే తనను తాను తగ్గించుకుని ప్రార్థించాడు, దానివల్ల యెహోవా అతన్ని క్షమించి, రాజరికాన్ని తిరిగి ఇచ్చేశాడు
-
యెహోవా మనల్ని క్షమించాలంటే మనం ఏం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు?
దేవుని ఇష్టం జరగాలని మనం కోరుకుంటున్నట్టు ప్రార్థనలో చెప్పడం ఎందుకు మంచిది?
మన పరలోక తండ్రి మీద మనకు విశ్వాసం ఉందని మన ప్రార్థనలు ఎందుకు చూపించాలి?
మనం వేటిగురించి ప్రార్థించాలి?
దేవుని పేరు పవిత్రపర్చబడాలని ప్రార్థించాలి
భూమంతటిని పరిపాలించే దేవుని రాజ్యం రావాలని ప్రార్థించాలి
యెహోవా ఇష్టం జరగాలని ప్రార్థించాలి
మన అవసరాల్ని తీర్చమని ప్రార్థించాలి
మన పాపాల్ని క్షమించమని ప్రార్థించాలి
ప్రలోభాల నుండి కాపాడమని ప్రార్థించాలి
కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించాలి
దేవుని ఇష్టం గురించిన జ్ఞానం కోసం, తెలివి-అవగాహన కోసం ప్రార్థించాలి
సామె 2:3-6; ఫిలి 1:9; యాకో 1:5
కీర్త 119:34 కూడా చూడండి
-
ఒక బైబిలు ఉదాహరణ:
-
1రా 3:11, 12—రాజైన సొలొమోను తెలివి కోసం ప్రార్థించినప్పుడు, యెహోవా ఎంతో సంతోషించి అతనికి చాలా తెలివిని ఇచ్చాడు
-
పవిత్రశక్తి కోసం ప్రార్థించాలి
హింసలు ఎదుర్కొంటున్న వాళ్లతో సహా, తోటి ఆరాధకులందరి కోసం ప్రార్థించాలి
అపొ 12:5; రోమా 15:30, 31; యాకో 5:16
కొలొ 4:12; 2తి 1:3 కూడా చూడండి
యెహోవాను స్తుతిస్తూ ప్రార్థించాలి
కీర్త 86:12; యెష 25:1; దాని 2:23
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
లూకా 10:21—పిల్లల్లా వినయంగా ఉన్నవాళ్లకు మాత్రమే ఆధ్యాత్మిక సత్యాలను వెల్లడి చేసినందుకు తన తండ్రిని యేసు అందరిముందు స్తుతించాడు
-
ప్రక 4:9-11—పరలోక ప్రాణులంతా యెహోవాకు చెందాల్సిన ఘనత, మహిమ ఇస్తున్నారు
-
మనం యెహోవాను ప్రశాంతంగా ఆరాధిస్తూ, ప్రజలకు ప్రకటించేలా అధికారుల హృదయాల్ని కదిలించమని ప్రార్థించాలి
యిర్మీ 29:7 కూడా చూడండి
బాప్తిస్మం తీసుకునేటప్పుడు ప్రార్థన చేయడం సరైనదేనా?
ఆధ్యాత్మిక అనారోగ్యంతో ఉన్నవాళ్ల తరఫున ప్రార్థించడం సరైనదేనా?
మామూలుగా పురుషులు ముసుగు వేసుకోకుండా ఎందుకు ప్రార్థిస్తారు, స్త్రీలు కొన్నిసార్లు ముసుగు వేసుకుని ఎందుకు ప్రార్థిస్తారు?
ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం లేదా ఎంత తీవ్రంగా ప్రార్థన చేస్తున్నాం అనే వాటికన్నా ముఖ్యమైనది ఏంటి?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
1రా 18:25-29, 36-39—ఏలీయా ప్రవక్త సవాలు చేసినప్పుడు, బయలు ప్రవక్తలు తమ దేవునికి గంటల తరబడి కేకలు వేస్తూ వేడుకున్నా ఎలాంటి జవాబు రాలేదు
-
అపొ 19:32-41—ఎఫెసులో విగ్రహాల్ని పూజించేవాళ్లు అర్తెమి దేవికి రెండు గంటలపాటు కేకలు వేస్తూ వేడుకున్నా ఏమీ సాధించలేకపోయారు. చివరికి అక్కడున్న ముఖ్య అధికారి వాళ్లను నిశ్శబ్దంగా ఉండమని గద్దించాడు
-