కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రోత్సహించడం

ప్రోత్సహించడం

దేవుని సేవకులు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ఎందుకు ముఖ్యం?

యెష 35:3, 4; కొలొ 3:16; 1థె 5:11; హెబ్రీ 3:13

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2ది 32:2-8—అష్షూరీయులు దాడి చేయడానికి వచ్చినప్పుడు రాజైన హిజ్కియా ప్రజల్ని ప్రోత్సహించాడు

    • దాని 10:2, 8-11, 18, 19—వృద్ధుడైన దానియేలు ప్రవక్త బాగా బలహీనంగా, అలసిపోయి ఉన్నప్పుడు ఒక దేవదూత అతన్ని ప్రోత్సహించి, బలపర్చాడు

ఇతరుల్ని ప్రోత్సహించే విషయంలో పెద్దలకు ఎలాంటి బాధ్యత ఉంది?

యెష 32:1, 2; 1పే 5:1-3

మత్త 11:28-30 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ద్వితీ 3:28; 31:7, 8—యెహోవా చెప్పినట్టే మోషే ప్రవక్త ఇశ్రాయేలీయుల్ని నడిపించబోయే యెహోషువను ప్రోత్సహించి, బలపర్చాడు

    • అపొ 11:22-26; 14:22—హింసలు చెలరేగుతున్నప్పుడు అపొస్తలులైన పౌలు, బర్నబాలు అంతియొకయలో ఉన్న క్రైస్తవుల్ని ప్రోత్సహించారు

ఎవరినైనా ప్రోత్సహించేటప్పుడు వాళ్లను మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం కూడా ఎందుకు ముఖ్యం?

సామె 31:28, 29; 1కొ 11:2

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • న్యా 11:37-40—ప్రతీ సంవత్సరం ఇశ్రాయేలులో ఉన్న కొంతమంది స్త్రీలు యెఫ్తా కూతురి దగ్గరికెళ్లి ఆమె చేసిన త్యాగాలను బట్టి ఆమెను మెచ్చుకునేవాళ్లు

    • ప్రక 2:1-4—ఎఫెసులో ఉన్న క్రైస్తవుల్ని యేసు సరిదిద్దాల్సి వచ్చినా వాళ్లు చేస్తున్న మంచి పనులను కూడా ఆయన మెచ్చుకున్నాడు

నమ్మకమైన యెహోవా సేవకులు ఒకరినొకరు ఎలా ప్రోత్సహించుకోవచ్చు?

సామె 15:23; ఎఫె 4:29; ఫిలి 1:13, 14; కొలొ 4:6; 1థె 5:14

2కొ 7:13, 15, 16 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1స 23:16-18—దావీదు కష్టంలో ఉన్నప్పుడు యోనాతాను అతన్ని వెతికి మరీ ప్రోత్సహించాడు

    • యోహా 16:33—తన శిష్యులు కూడా లోకాన్ని జయించగలరని యేసు తన ఆదర్శం ద్వారా అభయాన్ని ఇచ్చి ప్రోత్సహించాడు

    • అపొ 28:14-16—అపొస్తలుడైన పౌలు విచారణ కోసం రోముకు వెళ్తుండగా, తనను కలిసి ప్రోత్సహించడానికి ప్రయాణమై వచ్చిన నమ్మకమైన సహోదరులను చూసి ధైర్యం తెచ్చుకున్నాడు

అగౌరవంగా ప్రవర్తిస్తూ, సణుగుతూ ఉండే వాళ్లలా మనం ఎందుకు ఉండకూడదు?

ఫిలి 2:14-16; యూదా 16-19

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • సం 11:10-15—ప్రజలు సణుగుతూ తిరుగుబాటు స్ఫూర్తి చూపించినప్పుడు మోషే ప్రవక్త బాగా నిరుత్సాహపడ్డాడు

    • సం 13:31, 32; 14:2-6—విశ్వాసం లేని పదిమంది వేగులవాళ్లు తెచ్చిన చెడ్డ నివేదిక వల్ల ప్రజలు నిరుత్సాహపడి తిరుగుబాటు చేశారు

తోటి విశ్వాసులతో కలిసి ఆరాధించడం, సమయం గడపడం మనల్ని ఎందుకు బలపరుస్తాయి?

సామె 27:17; రోమా 1:11, 12; హెబ్రీ 10:24, 25; 12:12

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2ది 20:1-19—ఒక పెద్ద సైన్యం దండెత్తి వచ్చినప్పుడు రాజైన యెహోషాపాతు ప్రజలందర్నీ సమావేశపర్చి ప్రార్థించాడు

    • అపొ 12:1-5, 12-17—శత్రువులు అపొస్తలుడైన యాకోబును చంపేసి, అపొస్తలుడైన పేతురుని జైల్లో వేసినప్పుడు యెరూషలేములో ఉన్న సంఘం ప్రార్థించడానికి కలుసుకుంది

కష్టాలు వచ్చినప్పుడు మంచి విషయాల గురించి, మన నిరీక్షణ గురించి ఆలోచించడం ఎలా బలాన్నిస్తుంది?

అపొ 5:40, 41; రోమా 8:35-39; 1కొ 4:11-13; 2కొ 4:16-18; 1పే 1:6, 7

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 39:19-23; 40:1-8—తనమీద నిందలు వేసినా, అన్యాయంగా జైల్లో వేసినా యోసేపు మాత్రం యెహోవా మీద ఆధారపడుతూ ఇతరులకు సహాయం చేయడానికే ముందుండేవాడు

    • 2రా 6:15-17—ఒక సైన్యం తన మీదకు వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త అస్సలు భయపడలేదు, తన సేవకుడు కూడా భయపడకుండా ఉండాలని ప్రార్థించాడు

ప్రోత్సాహం కోసం యెహోవా వాక్యాన్ని చూడడం

యెహోవా ప్రేమతో మనకు ఏ అభయాన్ని ఇస్తున్నాడు?

యెహోవా చూపించే ఓర్పు, కరుణ గురించి ఆలోచిస్తే ఎలాంటి ప్రోత్సాహాన్ని పొందుతాం?

బలహీనంగా ఉన్నవాళ్లకు యెహోవా ఎలా సహాయం చేస్తాడు?

కీర్త 46:1; యెష 12:2; 40:29-31; ఫిలి 4:13

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1స 1:10, 11, 17, 18—యెహోవా హన్నా చేసిన ప్రార్థన విని ఆమె దుఃఖంలో, బాధలో ఉన్నప్పుడు ఊరటనిచ్చాడు

    • 1రా 19:1-19—ఏలీయా ప్రవక్త నిరుత్సాహపడినప్పుడు యెహోవా అతనికి అవసరమైన మద్దతు ఇచ్చాడు. మంచి విషయాల మీద దృష్టి పెట్టేలా సహాయం చేసి అతన్ని ప్రోత్సహించి, ఓదార్చాడు

భవిష్యత్తు విషయంలో మనకున్న ఆశ ఎందుకు ధైర్యాన్ని ఇస్తుంది?

2ది 15:7; కీర్త 27:13, 14; హెబ్రీ 6:17-19; 12:2

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యోబు 14:1, 2, 7-9, 13-15—యోబు నిరుత్సాహంలో కూరుకుపోయినా పునరుత్థాన నిరీక్షణ వల్ల ఓదార్పు పొందాడు

    • దాని 12:13—దాదాపు 100 ఏళ్లు ఉన్న దానియేలు ప్రవక్త దగ్గరకు ఒక దేవదూత వచ్చి, అతను భవిష్యత్తులో పొందబోయే ప్రతిఫలం గురించి చెప్పి ప్రోత్సహించాడు

యెహోవాకు ప్రార్థించడం వల్ల, ఆయన గురించి ధ్యానించడం వల్ల మనం ఎలా ప్రోత్సాహాన్ని పొందుతాం?

కీర్త 18:6; 56:4, 11; హెబ్రీ 13:6

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1స 30:1-9—కష్టకాలంలో రాజైన దావీదు యెహోవాకు ప్రార్థించడం వల్ల బలాన్ని పొందాడు

    • లూకా 22:39-43—అన్నిటికన్నా కష్టమైన పరీక్ష వచ్చినప్పుడు యేసు పట్టుదలగా ప్రార్థించాడు, యెహోవా ఆయన్ని బలపర్చడానికి ఒక దేవదూతను పంపించాడు

మనం ఏదైనా మంచి కబురు గానీ శుభవార్త గానీ విని దాన్ని ఇతరులకు చెప్పినప్పుడు ఎలాంటి ప్రోత్సాహం పొందుతాం?

సామె 15:30; 25:25; యెష 52:7

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • అపొ 15:2-4—అపొస్తలులైన పౌలు, బర్నబాలు సంఘాల్ని కలిసి అక్కడున్న సహోదర సహోదరీలను ఎంతో ప్రోత్సహించారు

    • 3యో 1-4—తాను సత్యం నేర్పించినవాళ్లు నమ్మకంగా కొనసాగుతున్నారని వృద్ధ అపొస్తలుడైన యోహాను విన్నప్పుడు ఎంతో ప్రోత్సాహం పొందాడు