కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యథార్థత

యథార్థత

యథార్థత అంటే ఏంటి?

కీర్త 18:23-25; 26:1, 2; 101:2-7; 119:1-3, 80

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • లేవీ 22:17-22—ఏ లోపంలేని జంతువుల్ని మాత్రమే బలిగా ఇవ్వాలని యెహోవా చెప్పాడు. “ఏ లోపంలేని” అనే మాటకు “యథార్థత” అని అనువదించబడిన హీబ్రూ పదానికి దగ్గరి సంబంధం ఉంది. దాన్నిబట్టి యథార్థంగా నడుచుకోవడం అంటే యెహోవాకు ఏ లోపంలేని భక్తిని లేదా సంపూర్ణ భక్తిని ఇవ్వడం అని చెప్పవచ్చు

    • యోబు 1:1, 4, 5, 8; 2:3—ఒక వ్యక్తి యథార్థంగా ఉండాలంటే యెహోవాను ఎంతో గౌరవించాలని, నిండు హృదయంతో ఆయన్ని సేవించాలని, ఆయనకు ఇష్టంలేని వాటికి దూరంగా ఉండాలని యోబు జీవితం నుండి తెలుసుకోవచ్చు

మనం యథార్థంగా ఎందుకు ఉండాలి?

యథార్థంగా ఉండడానికి మనల్ని ఏది కదిలిస్తుంది?

యథార్థతను ఎలా పెంచుకుంటూ, కాపాడుకుంటూ ఉండవచ్చు?

యెహో 24:14, 15; కీర్త 101:2-4

ద్వితీ 5:29; యెష 48:17, 18 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యోబు 31:1-11, 16-33—యోబు అనుక్షణం తన యథార్థతను కాపాడుకున్నాడు; ఎలాగంటే అతను అన్ని సందర్భాల్లో పవిత్రంగా ఉన్నాడు, ఇతరులతో దయగా ఉన్నాడు, అందర్నీ గౌరవించాడు, విగ్రహపూజ చేయలేదు, డబ్బును ప్రేమించలేదు

    • దాని 1:6-21—చుట్టూ యెహోవాను ఆరాధించని ప్రజలు ఉన్నప్పటికీ దానియేలు, అతని ముగ్గురు స్నేహితులు చిన్నచిన్న విషయాల్లో కూడా అంటే ఆహారం లాంటి విషయాల్లో కూడా యథార్థంగా ఉన్నారు

ఒక వ్యక్తి ఒకదాని తర్వాత ఒకటి పెద్దపెద్ద తప్పులు చేసినా అతను తిరిగి యథార్థంగా ఉండగలడా?

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1రా 9:2-5; కీర్త 78:70-72—రాజైన దావీదు తన పాపాల విషయంలో పశ్చాత్తాపం చూపించాడు కాబట్టి క్షమాపణ పొందాడు, యెహోవా అతన్ని జీవితాంతం యథార్థంగా ఉన్న వ్యక్తిగా గుర్తుపెట్టుకున్నాడు

    • యెష 1:11-18—తన ప్రజలు వేషధారుల్లా ప్రవర్తించి చాలా పాపాలు చేసినా, పశ్చాత్తాపం చూపించి తమ ప్రవర్తనను మార్చుకుంటే వాళ్ల పాపాల్ని పూర్తిగా క్షమిస్తానని యెహోవా మాటిచ్చాడు