కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసుక్రీస్తు

యేసుక్రీస్తు

యెహోవా ఇష్టాన్ని నెరవేర్చడంలో యేసుకు ఎలాంటి ముఖ్యమైన పాత్ర ఉంది?

అపొ 4:12; 10:43; 2కొ 1:20; ఫిలి 2:9, 10

సామె 8:22, 23, 30, 31; యోహా 1:10; ప్రక 3:14 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మత్త 16:13-17—యేసే క్రీస్తని, దేవుని కుమారుడని అపొస్తలుడైన పేతురు గుర్తించాడు

    • మత్త 17:1-9—ఒక సందర్భంలో తన ముగ్గురు అపొస్తలుల ముందు యేసు రూపం మారిపోయింది, అప్పుడు యెహోవా పరలోకం నుండి యేసు తన కుమారుడని చెప్పాడు

మనుషులందరిలో యేసు ఎందుకు ప్రత్యేకమైనవాడు?

యోహా 8:58; 14:9, 10; కొలొ 1:15-17; 1పే 2:22

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మత్త 21:1-9—యేసు ఊరేగింపుతో యెరూషలేముకు రావడం ద్వారా యెహోవా ఎంచుకున్న మెస్సీయ రాజు గురించిన ఒక ప్రవచనాన్ని నెరవేర్చాడు

    • హెబ్రీ 7:26-28—మిగతా ప్రధానయాజకులతో పోలిస్తే యేసే ఎందుకు గొప్ప ప్రధానయాజకుడో అపొస్తలుడైన పౌలు వివరించాడు

యేసు చేసిన అద్భుతాలు ఆయన గురించి, ఆయన తండ్రి గురించి ఏం తెలియజేస్తున్నాయి?

యోహా 3:1, 2; 5:36

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మత్త 4:23, 24—యేసుకు చెడ్డదూతల కన్నా ఎక్కువ శక్తి ఉందని అలాగే ప్రతీ జబ్బును, అనారోగ్యాన్ని నయం చేసే శక్తి ఉందని చూపించాడు

    • మత్త 14:15-21—ఐదు రొట్టెలు, రెండు చేపలతో యేసు అద్భుతం చేసి ఆకలితో ఉన్న ఎన్నో వేలమందికి ఆహారం పెట్టాడు

    • మత్త 17:24-27—ఆలయ పన్ను కట్టడం కోసం యేసు ఒక అద్భుతం చేశాడు; అలా పన్ను కట్టి ఎవ్వరూ అభ్యంతర పడకుండా చూశాడు

    • మార్కు 1:40, 41—ఒక కుష్ఠురోగి పరిస్థితిని చూసి యేసు జాలిపడి అతన్ని బాగుచేశాడు, దీన్నిబట్టి యేసు రోగుల్ని బాగుచేయాలని నిజంగా కోరుకుంటున్నాడని అర్థమౌతుంది

    • మార్కు 4:36-41—యేసు ఒక పెద్ద తుఫానును ఆపడం ద్వారా యెహోవా తనకు ప్రకృతి మీద కూడా అధికారం ఇచ్చాడని చూపించాడు

    • యోహా 11:11-15, 31-45—తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు యేసు కన్నీళ్లు పెట్టుకున్నాడు; తర్వాత ఆయనకు మరణమన్నా, అది మనుషులకు కలిగించే బాధన్నా అస్సలు ఇష్టంలేదని చూపిస్తూ లాజరును పునరుత్థానం చేశాడు

యేసు ముఖ్యంగా దేనిగురించి బోధించాడు?

భూమ్మీద ఉన్నప్పుడు యేసు చూపించిన కొన్ని మంచి లక్షణాలు ఏంటి?

అందర్నీ అక్కున చేర్చుకునే మనస్తత్వం—మత్త 13:2; మార్కు 10:13-16; లూకా 7:36-50

కనికరం; కరుణ—మార్కు 5:25-34; లూకా 7:11-15

తెలివి—మత్త 12:42; 13:54; కొలొ 2:3

ధైర్యం—మత్త 4:2-11; యోహా 2:13-17; 18:1-6

ప్రేమ—యోహా 13:1; 14:31; 15:13; 1యో 3:16

విధేయత—లూకా 2:40, 51, 52; హెబ్రీ 5:8

వినయం—మత్త 11:29; 20:28; యోహా 13:1-5; ఫిలి 2:7, 8

యేసు ఎందుకు చనిపోయాడు, దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

యేసుక్రీస్తు పరలోకంలో రాజుగా పరిపాలిస్తున్నందుకు మనం ఎందుకు సంతోషించాలి?

కీర్త 72:12-14; దాని 2:44; 7:13, 14; ప్రక 12:9, 10

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • కీర్త 45:2-7, 16, 17—దేవుడు ఎంచుకున్న రాజు తన శత్రువులందర్నీ నాశనం చేసి సత్యంతో, వినయంతో, నీతితో పరిపాలిస్తాడని ఈ కీర్తన చెప్తుంది

    • యెష 11:1-10—యేసు రాజుగా పరిపాలించినప్పుడు ఈ భూమి ప్రశాంతంగా ఉండే పరదైసులా మారుతుంది

యేసు త్వరలో ఏం చేస్తాడు?