కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వయసు పైబడినవాళ్లు

వయసు పైబడినవాళ్లు

వయసు పైబడినప్పుడు ఏమౌతుంది?

కీర్త 71:9; 90:10

ఊరట—అనారోగ్యం వల్ల లేదా వయసు పైబడడం వల్ల చేయాలనుకున్నంత చేయలేనప్పుడు” కూడా చూడండి

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • ప్రస 12:1-8—రాజైన సొలొమోను వయసు పైబడడం వల్ల చూపు మందగిస్తుందని (“కిటికీల్లో నుండి చూసే స్త్రీలకు అంతా మసగ్గా కనిపిస్తుంది”), వినికిడి శక్తి తగ్గిపోతుందని (“గాయకురాళ్లందరి స్వరం తగ్గిపోతుంది”), ఇంకా ఇలాంటి వేరే సమస్యలు వస్తాయని పద్య రూపంలో చెప్పాడు

వయసు పైబడడం వల్ల కష్టాలు, ఇబ్బందులు ఉన్నా వృద్ధులు సంతోషంగా ఉండగలరా?

2కొ 4:16-18; యాకో 1:2-4

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1స 12:2, 23—యెహోవా ప్రజల కోసం ప్రార్థిస్తూ ఉండడం ఎంత ముఖ్యమో ముసలివాడైన సమూయేలు ప్రవక్తకు తెలుసు

    • 2స 19:31-39—ముసలివాడైన బర్జిల్లయి తన వెన్నంటే ఉన్నందుకు రాజైన దావీదు ఎంతో కృతజ్ఞత చూపించాడు, అయితే యెరూషలేములో తనకు సేవ చేయమని దావీదు బర్జిల్లయిని అడిగినప్పుడు ఆయన అణకువతో తన పరిమితుల్ని గుర్తించి దానికి ఒప్పుకోలేదు

    • కీర్త 71:9, 18—వయసు పైబడడం వల్ల తాను ఇక యెహోవాకు ఉపయోగపడనని దావీదు రాజు భయపడి, తనను త్రోసివేయద్దని యెహోవాను బ్రతిమాలుతూ తర్వాతి తరాలవాళ్లకు ఆయన గురించి చెప్పే బలాన్ని ఇవ్వమని అడిగాడు

    • లూకా 2:36-38—ప్రవక్త్రి, వృద్ధ విధవరాలు అయిన అన్న చూపించిన భక్తిని బట్టి, చేసిన నమ్మకమైన సేవను బట్టి దేవుడు ఆమెను దీవించాడు

వయసు పైబడినవాళ్లను విలువైనవాళ్లుగా ఎంచుతున్నానని యెహోవా ఎలా భరోసా ఇస్తున్నాడు?

కీర్త 92:12-14; సామె 16:31; 20:29; యెష 46:4; తీతు 2:2-5

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 12:1-4—అబ్రాహాముకు 75 ఏళ్లు ఉన్నప్పుడు యెహోవా అతని జీవితాన్ని మార్చేసే నియామకాన్ని ఇచ్చాడు

    • దాని 10:11, 19; 12:13—దానియేలు ప్రవక్తకు దాదాపు 90 ఏళ్లు ఉన్నప్పుడు ఒక దేవదూత అతని దగ్గరకు వచ్చి యెహోవా దృష్టిలో అతను అమూల్యమైనవాడని, అతని విశ్వాసాన్ని బట్టి ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడని భరోసా ఇచ్చాడు

    • లూకా 1:5-13—వృద్ధులైన జెకర్యా, ఎలీసబెతులకు అద్భుతరీతిలో ఒక బాబు పుట్టేలా చేసి యెహోవా వాళ్లను దీవించాడు

    • లూకా 2:25-35—మెస్సీయ అవ్వబోయే పసిపిల్లవాడిని చూసే గొప్ప అవకాశం యెహోవా వృద్ధుడైన సుమెయోనుకు ఇచ్చాడు; సుమెయోను మెస్సీయ గురించి ఒక ప్రవచనం కూడా చెప్పాడు

    • అపొ 7:23, 30-36—మోషే ప్రవక్తకు 80 ఏళ్లు ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల్ని నడిపించే బాధ్యత యెహోవా ఆయనకు ఇచ్చాడు

నమ్మకమైన వృద్ధులను మనం ఎలా చూడాలి?

లేవీ 19:32; 1తి 5:1

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 45:9-11; 47:12—యోసేపు వృద్ధుడైన తన తండ్రి యాకోబును తన దగ్గరకు పిలిపించుకొని, చనిపోయేంత వరకు ఆయన బాగోగుల్ని చూసుకున్నాడు

    • రూతు 1:14-17; 2:2, 17, 18, 23—వృద్ధురాలైన నయోమికి రూతు తన మాటల ద్వారా, పనుల ద్వారా సహాయం చేసింది

    • యోహా 19:26, 27—యేసు హింసాకొయ్య మీద చనిపోతున్నప్పుడు వాళ్ల అమ్మను చూసుకునే బాధ్యతను అపొస్తలుడైన యోహానుకు అప్పగించాడు

వయసు పైబడినవాళ్లకు సంఘంలో ఉన్న క్రైస్తవులు ఏయే విధాలుగా సహాయం చేయవచ్చు?