కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విధేయత

విధేయత

విధేయత ఎందుకంత ప్రాముఖ్యం?

నిర్గ 19:5; ద్వితీ 10:12, 13; ప్రస 12:13; యాకో 1:22

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1స 15:17-23—రాజైన సౌలు యెహోవాకు లోబడనందుకు సమూయేలు ప్రవక్త అతన్ని గద్దించాడు, తర్వాత లోబడడం ఎంత ప్రాముఖ్యమో వివరించాడు

    • హెబ్రీ 5:7-10—దేవుని పరిపూర్ణ కుమారుడే అయినా యేసు భూమ్మీద బాధలు పడుతున్నప్పుడు విధేయత చూపించడం నేర్చుకున్నాడు

దేవునికి లోబడకూడదని మానవ అధికారులు చెప్తే క్రైస్తవులు ఏం చేయాలి?

అపొ 5:29

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • దాని 3:13-18—ప్రాణాలు పోతాయని తెలిసినా నమ్మకమైన ముగ్గురు హెబ్రీ యువకులు నెబుకద్నెజరు నిలబెట్టించిన విగ్రహాన్ని పూజించడానికి ఒప్పుకోలేదు

    • మత్త 22:15-22—యెహోవాకు లోబడకూడదని చెప్తే తప్ప, మిగతా అన్ని విషయాల్లో ప్రభుత్వ అధికారులకు లోబడాలని యేసు వివరించాడు

    • అపొ 4:18-31—ప్రకటించొద్దని అధికారులు ఆజ్ఞాపించినా అపొస్తలులు ధైర్యంగా ప్రకటనా పని చేస్తూనే ఉన్నారు

మనం యెహోవా ఆజ్ఞలకు ఎల్లప్పుడూ లోబడి ఉండాలంటే ఏం చేయాలి?

ద్వితీ 6:1-5; కీర్త 112:1; 1యో 5:2, 3

కీర్త 119:11, 112; రోమా 6:17 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఎజ్రా 7:7-10—యాజకుడైన ఎజ్రా దేవుని నియమాలకు లోబడే విషయంలో, దాన్ని ఇతరులకు బోధించే విషయంలో ముందుండడానికి తన హృదయాన్ని సిద్ధం చేసుకున్నాడు

    • యోహా 14:31—యేసు తన తండ్రి ఆజ్ఞాపించినట్టే ఎందుకు చేస్తాడో చెప్పాడు

మనం యెహోవాకు, యేసుకు ఎందుకు లోబడతాం?

విధేయతకు, విశ్వాసానికి సంబంధం ఏంటి?

రోమా 1:5; 10:16, 17; యాకో 2:20-23

ద్వితీ 9:23 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 6:9-22; హెబ్రీ 11:7—నోవహు ఓడ కట్టే విషయంలో యెహోవా ‘చెప్పినట్టే చేయడం’ ద్వారా తనకున్న విశ్వాసాన్ని చూపించాడు

    • హెబ్రీ 11:8, 9, 17—అబ్రాహాము ఊరును వదిలి వెళ్లే విషయంలో, తన కుమారున్ని బలిగా అర్పించే విషయంలో యెహోవా చెప్పినట్టే చేయడం ద్వారా విశ్వాసాన్ని చూపించాడు

తనకు లోబడే వాళ్లకు ఏం ఇస్తానని యెహోవా మాటిచ్చాడు?

యిర్మీ 7:23; మత్త 7:21; 1యో 3:22

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • లేవీ 26:3-6—తనకు లోబడే వాళ్లను చూసుకుంటానని, దీవిస్తానని యెహోవా మాటిచ్చాడు

    • సం 13:30, 31; 14:22-24—కాలేబు విధేయత చూపించాడు, దానివల్ల యెహోవా అతన్ని దీవించాడు

మనం విధేయత చూపించకపోతే ఏం జరుగుతుంది?

రోమా 5:19; 2థె 1:8, 9

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 2:16, 17; 3:17-19—ఆదాముహవ్వలు యెహోవా దేవునికి లోబడకపోవడం వల్ల పరదైసు జీవితాన్ని, పరిపూర్ణతను, శాశ్వత జీవితాన్ని కోల్పోయారు

    • ద్వితీ 18:18, 19; అపొ 3:12, 18, 22, 23—మోషే కంటే గొప్ప ప్రవక్త వస్తాడని, ఎవరైతే ఆయన మాట వినరో వాళ్లు నాశనం చేయబడతారని యెహోవా ముందే చెప్పాడు

    • యూదా 6, 7—తిరుగుబాటు చేసిన దూతలు, సొదొమ గొమొర్రా ప్రజలు యెహోవా మాట వినకపోవడం వల్ల ఆయనకు కోపం వచ్చింది

మనం యేసుక్రీస్తుకు ఎందుకు లోబడాలి?

ఆది 49:10; మత్త 28:18

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • యోహా 12:46-48; 14:24—ఎవరైతే తను చెప్పింది వినరో వాళ్లు దానికి తగిన తీర్పు పొందుతారని యేసు చెప్పాడు

సంఘంలో నాయకత్వం వహిస్తున్నవాళ్లకు క్రైస్తవులు ఎందుకు లోబడతారు?

ఒక క్రైస్తవ భార్య తన భర్తకు ఎందుకు లోబడాలి?

పిల్లలు తమ తలిదండ్రులకు ఎందుకు లోబడాలి?

సామె 23:22; ఎఫె 6:1; కొలొ 3:20

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 37:3, 4, 8, 11-13, 18—తన అన్నలు తనని ద్వేషిస్తున్నా, యువకుడైన యోసేపు తన నాన్న మాటకు లోబడి వాళ్లను చూడ్డానికి వెళ్లాడు

    • లూకా 2:51—యేసు పరిపూర్ణుడు అయినప్పటికీ తన అపరిపూర్ణ తల్లిదండ్రులైన యోసేపు, మరియలకు లోబడ్డాడు

పనిచేసే చోట ఇతరులు మనల్ని గమనించకపోయినా మనం యజమానికి లోబడడం ఎందుకు తెలివైన పని?

క్రైస్తవులు ప్రభుత్వాలకు ఎందుకు లోబడతారు?