కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సహనం

సహనం

యెహోవా సేవకులకు సహనం అవసరమా?

ప్రకటించేటప్పుడు కొంతమంది మనం చెప్పేది పట్టించుకోరని లేదా మనల్ని వ్యతిరేకిస్తారని ఎలా చెప్పవచ్చు?

మత్త 10:22; యోహా 15:18, 19; 2కొ 6:4, 5

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2పే 2:5; ఆది 7:23; మత్త 24:37-39—నోవహు నీతిని ప్రకటించినా ప్రజలు ఆయన్ని పట్టించుకోలేదు; జలప్రళయం వచ్చినప్పుడు కేవలం ఆయన, ఆయన కుటుంబం మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు

    • 2తి 3:10-14—పౌలు ఎంతో కాలంగా బాధల్ని, కష్టాల్ని సహించాడని తిమోతికి చెప్పి సహనం చూపించమని ప్రోత్సహించాడు

కుటుంబ సభ్యులు కూడా మనల్ని వ్యతిరేకిస్తారని ఎలా చెప్పవచ్చు?

మత్త 10:22, 36-38; లూకా 21:16-19

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 4:3-11; 1యో 3:11, 12—చెడ్డవాడైన కయీను నీతిమంతుడైన తన తమ్ముడు హేబేలును చంపేశాడు

    • ఆది 37:5-8, 18-28—యెహోవా చూపించిన కల గురించి యోసేపు తన అన్నలకు చెప్పాడు, దాంతో వాళ్లు అతన్ని ఒక గుంటలో పడేసి, దాసునిగా అమ్మేశారు

మనల్ని హింసించినప్పుడు మనం చావుకు ఎందుకు భయపడం?

మత్త 10:28; 2తి 4:6, 7

ప్రక 2:10 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • దాని 3:1-6, 13-18—షద్రకు, మేషాకు, అబేద్నెగో విగ్రహపూజ చేయడం కన్నా చనిపోవడమే మేలు అనుకున్నారు

    • అపొ 5:27-29, 33, 40-42—కొంతమంది చంపేస్తామని బెదిరించినా అపొస్తలులు మాత్రం సహనం చూపిస్తూ ప్రకటనా పనిని కొనసాగించారు

మనం క్రమశిక్షణను పొందినా సరే యెహోవాకు నమ్మకంగా ఉండడానికి ఏది సహాయం చేస్తుంది?

సామె 3:11, 12; హెబ్రీ 12:5-7

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • సం 20:9-12; ద్వితీ 3:23-28; 31:7, 8—యెహోవా ఇచ్చిన క్రమశిక్షణ వల్ల మోషే ప్రవక్త నిరుత్సాహపడినా చివరివరకు నమ్మకంగా కొనసాగాడు

    • 2రా 20:12-18; 2ది 32:24-26—రాజైన హిజ్కియా పాపం చేసినప్పుడు గద్దించబడ్డాడు కానీ తర్వాత తనను తాను తగ్గించుకుని చివరివరకు నమ్మకంగా కొనసాగాడు

ఇతరులు యెహోవాను విడిచిపెట్టడం, మన సహనానికి ఎలా ఒక పరీక్షలా మారవచ్చు?

యిర్మీ 1:16-19; హబ 1:2-4

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • కీర్త 73:2-24—చెడ్డవాళ్లు శాంతిని, సమృద్ధిని అనుభవించడం చూసి కీర్తనకర్త యెహోవా సేవలో సహించడం అవసరమా అనుకున్నాడు

    • యోహా 6:60-62, 66-68—చాలామంది యేసును అనుసరించడం మానేసినప్పటికీ అపొస్తలుడైన పేతురు మాత్రం సహనం చూపిస్తూ విశ్వాసంలో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు

సహించడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

యెహోవాను అంటిపెట్టుకుని ఉండడం

బైబిల్ని చదివి, ధ్యానిస్తూ జ్ఞానం సంపాదించడం

యెహోవాకు క్రమంగా, మనసు విప్పి ప్రార్థించడం

రోమా 12:12; కొలొ 4:2; 1పే 4:7

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • దాని 6:4-11—దానియేలు ప్రవక్తను చంపడానికి శత్రువులు కుట్ర పన్నినా, అతను మాత్రం ఎప్పటిలానే బహిరంగంగా, క్రమంగా ప్రార్థించాడు

    • మత్త 26:36-46; హెబ్రీ 5:7—యేసు చనిపోయే ముందు రోజు రాత్రి పట్టుదలగా ప్రార్థించాడు, తన శిష్యుల్ని కూడా అలానే చేయమని ప్రోత్సహించాడు

సహోదర సహోదరీలతో కలిసి క్రమంగా ఆరాధించడం

యెహోవా చేసిన వాగ్దానాల మీద మనసుపెట్టడం

యెహోవా మీద, సహోదర సహోదరీల మీద ప్రేమను పెంచుకోవడం

మన విశ్వాసాన్ని బలపర్చుకోవడం

కష్టాలు వచ్చినప్పుడు సరిగ్గా ఆలోచించడం

నమ్మకంగా సహిస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి?

యెహోవా దేవునికి ఘనతను తీసుకొస్తాం

సామె 27:11; యోహా 15:7, 8; 1పే 1:6, 7

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యోబు 1:6-12; 2:3-5—ప్రజలు ఆయన్ని సేవించాలన్న ఉద్దేశంతోనే యెహోవా వాళ్లను కాపాడుతున్నాడని సాతాను నింద వేశాడు, కానీ యోబు సహించడం ద్వారా సాతాను తప్పు అని నిరూపించాడు

    • రోమా 5:19; 1పే 1:20, 21—యేసు ఆదాములా కాకుండా చనిపోయే వరకు నమ్మకంగా సహించాడు; అలా ఆయన, ‘ఎంత కష్టమైన పరీక్షలు ఎదురైనా ఒక పరిపూర్ణ మనిషి యెహోవాకు నమ్మకంగా ఉండగలడా?’ అనే ప్రాముఖ్యమైన ప్రశ్నకు జవాబిచ్చాడు

సహించేలా మనం ఇతరుల్ని ప్రోత్సహిస్తాం

సహనం చూపిస్తే పరిచర్యలో మంచి ఫలితాలు సాధిస్తాం

యెహోవా ఆమోదాన్ని, దీవెనల్ని పొందుతాం