కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సామాజిక హోదాలు

సామాజిక హోదాలు

ఒక వ్యక్తి జాతి, వంశం, ఆర్థిక స్థితిని బట్టి దేవుడు అతన్ని ఇతరుల కంటే గొప్పగా చూస్తాడా?

అపొ 17:26, 27; రోమా 3:23-27; గల 2:6; 3:28

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • యోహా 8:31-40—కొంతమంది యూదులు, వాళ్లు అబ్రాహాము పిల్లలని గర్వంగా చెప్పుకునేవాళ్లు కానీ వాళ్లు అతనిలా అస్సలు ప్రవర్తించట్లేదని యేసు వాళ్లను సరిదిద్దాడు

వేరే దేశంవాళ్లను, జాతివాళ్లను మనం తక్కువగా చూడవచ్చా?

యోహా 3:16; రోమా 2:11

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యోనా 4:1-11—వేరే దేశానికి చెందిన నీనెవె ప్రజల మీద కరుణ చూపించాలని యెహోవా యోనా ప్రవక్తకు ఓపిగ్గా నేర్పించాడు

    • అపొ 10:1-8, 24-29, 34, 35—అన్యులను అపవిత్రమైన వాళ్లలా చూడకూడదని అపొస్తలుడైన పేతురు తెలుసుకుని కొర్నేలికి, అతని కుటుంబానికి సహాయం చేశాడు; సున్నతి పొందని అన్యుల్లో వాళ్లే మొట్టమొదటి క్రైస్తవులు

ధనవంతులైన క్రైస్తవులు ఇతరుల కంటే గొప్పవాళ్లని లేదా ఇతరులు వాళ్లను ప్రత్యేకంగా చూడాలని అనుకోవచ్చా?

ఒక వ్యక్తి పర్యవేక్షకుడిగా ఉన్నంత మాత్రాన అతను ఇతరుల కంటే గొప్పవాడని, ఇతరుల మీద పెత్తనం చెలాయించవచ్చని దాని అర్థమా?

2కొ 1:24; 1పే 5:2, 3

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ద్వితీ 17:18-20—ఇశ్రాయేలు రాజుల్లో ఎవ్వరూ తాము ప్రజలకంటే గొప్పవాళ్లం అని అనుకోకూడదని యెహోవా హెచ్చరించాడు, ఎందుకంటే యెహోవా దృష్టిలో ప్రజలంతా రాజుకు సహోదరులే

    • మార్కు 10:35-45—అపొస్తలులు గొప్ప స్థానాల్ని కోరుకోవడం చూసి యేసు వాళ్లను సరిదిద్దాడు (ఇంగ్లీష్‌ కొత్త లోక అనువాదంలో మార్కు 10:42 స్టడీ నోట్స్‌లో “ప్రజల మీద అధికారం చెలాయిస్తారనీ” కూడా చూడండి)

దేవుని అనుగ్రహం ఎలాంటి వ్యక్తి మీద ఉంటుంది?

సమాజంలో మార్పు తీసుకురావడానికి చేసే ఉద్యమాల్లో క్రైస్తవులు పాల్గొనవచ్చా?

ఎఫె 6:5-9; 1తి 6:1, 2

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • యోహా 6:14, 15—యేసు రాజై సమాజంలో మార్పులు తీసుకురావాలని చాలామంది కోరుకున్నారు కానీ ఆయన ఈ భూమ్మీద రాజు అవ్వడానికి ఒప్పుకోలేదు