కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇశ్రాయేలీయులు, వారి చుట్టుప్రక్కల జనాంగాలు

ఇశ్రాయేలీయులు, వారి చుట్టుప్రక్కల జనాంగాలు

ఇశ్రాయేలీయులు, వారి చుట్టుప్రక్కల జనాంగాలు

యెహోవా అబ్రాహాముకు, ‘మెసొపొతమియలోని ఊరునుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్లు’ అని చెప్పాడు. ఆ దేశంలో దాని పరిసర ప్రాంతాల్లో ఇతర జనాంగాలు నివసిస్తున్నాయి.​—⁠ఆది 12:1-3; 15:17-21.

దేవుని ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు, తమను ‘మోయాబు బలిష్ఠులవంటి’ శత్రువులు అడ్డగించవచ్చని వారికి తెలుసు. (నిర్గ 15:​14, 15) ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి వెళ్ళవలసిన మార్గంలో అమాలేకీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, అమోరీయులు ఉన్నారు. (సంఖ్యా 21:11-13; ద్వితీ 2:17-33; 23:​3, 4) అంతేకాక ఇశ్రాయేలీయులు దేవుడు తమకు వాగ్దానం చేసిన దేశంలో ఇతర శత్రు జనాంగాలను కూడా ఎదుర్కొంటారు.

ఇశ్రాయేలీయులు నాశనపాత్రమైన ఏడు “బహు జనములను” అంటే హిత్తీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, కనానీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను ‘వెళ్లగొట్టాలని’ దేవుడు చెప్పాడు. వారు నైతికంగా దిగజారిపోయిన, మతపరంగా భ్రష్టులైన ప్రజలు. వారి దేవతల్లో (లింగాకార శిలా స్తంభాలకు పేరుగాంచిన) బయలు, (పిల్లల బలులకు గుర్తుగా నిలిచిన) మోలెకు, ఫలసాఫల్య దేవత అష్తారోతు (అస్టార్టె) ఉన్నారు.​—⁠ద్వితీ 7:1-4; 12:31; నిర్గ 23:23; లేవీ 18:21-25; 20:2-5; న్యాయా 2:11-14; కీర్త 106:37, 38.

దేవుడు ఇశ్రాయేలీయులకు ఇవ్వబోయే ప్రాంతమంతా అంటే సీదోను ఉత్తరదిక్కునుండి ‘ఐగుప్తు నదివరకున్న’ ప్రాంతమంతా కొన్నిసార్లు “కనాను” అని పిలువబడింది. (సంఖ్యా 13:2, 21; 34:2-12; ఆది 10:​19) ఇతర సమయాల్లో బైబిలు ఆ దేశంలోని వివిధ జనాంగాలను, నగరప్రాంతాలను లేదా ప్రజలను పేర్కొంటుంది. ఆ దేశంలోని కొందరికి అంటే సముద్ర తీరంలోని ఫిలిష్తీయులు, యెరూషలేము సమీపానున్న పర్వత ప్రాంతాల్లోని యెబూసీయులువంటి వారికి నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయి. (సంఖ్యా 13:29; యెహో 13:⁠3) ఇతరులు కాలం గడుస్తున్న కొద్ది తమ స్థలాలను లేదా తమ నివాస ప్రాంతాలను మార్చుకున్నారు.​—⁠ఆది 34:1, 2; 49:30; యెహో 1:4; 11:3; న్యాయా 1:16, 23-26.

నిర్గమన సమయంలో, బహుశా అమోరీయులు అత్యంత బలమైన తెగగా ఉండివుండవచ్చు. * (ద్వితీ 1:19-21; యెహో 24:​15) యెరికోకు ఎదురుగావున్న ప్రాంతం ఇంకా “మోయాబు మైదానముల”ని పిలువబడుతున్నప్పటికి, అమోరీయులు దక్షిణాన అర్నోను ఏరు వరకు మోయాబీయుల దేశాన్ని జయించారు. అమోరీయుల రాజులు బాషానును, గిలాదును కూడా పరిపాలించారు.​—⁠సంఖ్యా 21:21-23, 33-35; 22:1; 33:46-51.

ఇశ్రాయేలీయులకు దేవుని మద్దతు ఉన్నప్పటికి వారు ఖండించబడిన ఆ జనాంగాలన్నింటిని తొలగించలేదు, అందువల్ల ఆ జనాంగాలు కాలప్రవాహంలో ఇశ్రాయేలీయులకు ప్రమాదంగా పరిణమించాయి. (సంఖ్యా 33:55; యెహో 23:13; న్యాయా 2:3; 3:5, 6; 2 రాజు 21:​11) అవును ఇశ్రాయేలీయులకు, “మీరు ఇతర దేవతలను, అనగా మీ చుట్టునున్న జనముల దేవతలను సేవింపకూడదు” అనే హెచ్చరిక ఇవ్వబడినప్పటికి వారు దారితప్పారు.​—⁠ద్వితీ 6:14; 13:⁠7.

[అధస్సూచి]

^ పేరా 6 ‘కనానీయులు’ అనే పదంలాగే ‘అమోరీయులు’ అనే పదం ఆ దేశ ప్రజలందరిని లేదా విడిగా ఆ తెగను సూచించవచ్చు.​—⁠ఆది 15:16; 48:22.

[11వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

వాగ్దాన దేశంనుండి తొలగించబడే జనాంగాలు

ఫిలిష్తియ (D8)

C8 అష్కెలోను

C9 గాజా

D8 అష్డోదు

D8 గాతు

D9 గెరారు

కనాను (D8)

B10 అమాలేకీయులు

C12 హసరద్దారు (అద్దారు?)

C12 కాదేషు (కాదేషు బర్నేయ)

D8 లాకీషు

D9 బెయేర్షెబా

D10 అమోరీయులు

D11 నెగెబు

E4 దోరు

E5 మెగిద్దో

E5 తానాకు

E6 ఆఫెకు

E6 హివ్వీయులు

E7 యెబూసీయులు

E8 బేత్షెమెషు

E8 హెబ్రోను (కిర్యతర్బా)

E9 హిత్తీయులు

E9 దెబీరు

E10 అరాదు (కనానీయుల)

E10 కేనీయులు

E11 అక్రబ్బీము

F4 గిర్గాషీయులు

F6 షెకెము

F7 పెరిజ్జీయులు

F7 గిల్గాలు

F7 యెరికో

F8 యెరూషలేము

G2 హివ్వీయులు

G2 దాను (లాయిషు)

G3 హాసోరు

ఫేనీకే (F2)

E2 తూరు

F1 సీదోను

ఎదోము (F12)

F11 శేయీరు

G11 బొస్రా

అమోరీయులు (సీహోను) (G8)

G6 గిలాదు

G7 షిత్తీము

G7 హెష్బోను

G9 అరోయేరు

సిరియా (H1)

G1 బయల్గాదు

G2 హివ్వీయులు

I1 దమస్కు

మోయాబు (H10)

అమోరీయులు (ఓగు) (I5)

G6 గిలాదు

H3 బాషాను

H4 అష్తారోతు

H4 ఎద్రెయీ

అమ్మోను (I7)

H7 రబ్బా

[ఎడారులు]

H12 అరేబియా ఎడారి

[పర్వతాలు]

E4 కర్మెలు పర్వతం

E11 హోరు కొండ

G1 హెర్మోను కొండ

G8 నెబో కొండ

[సముద్రాలు]

C6 మధ్యధరా సముద్రం (మహా సముద్రం)

F9 ఉప్పు సముద్రం

G4 గలిలయ సముద్రం

[నదులు, ఏరులు]

B11 ఐగుప్తు నది

F6 యొర్దాను నది

G6 యబ్బోకు ఏటిలోయ

G9 అర్నోను ఏరు

G11 జెరెదు లోయ

[10వ పేజీలోని చిత్రాలు]

కుడివైపు: ఎద్దులకు, గొర్రలకు పేరుగాంచిన బాషానును అమోరీయుల రాజైన ఓగు పరిపాలించాడు

క్రింద: మోయాబు, అవతల ఉప్పు సముద్రం, దాని అవతల యూదా అరణ్యము కనిపిస్తున్నాయి

[11వ పేజీలోని చిత్రం]

బయలు, మోలెకు, ఫలసాఫల్య దేవత అష్తారోతు (చూపించబడింది) వంటి అబద్ధ దైవాలను ఆరాధించే జనాంగాలను తొలగించమని యెహోవా ఇశ్రాయేలీయులను నిర్దేశించాడు