కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గ్రీసు, రోమా యూదులపై ప్రభావం చూపడం

గ్రీసు, రోమా యూదులపై ప్రభావం చూపడం

గ్రీసు, రోమా యూదులపై ప్రభావం చూపడం

గ్రీకు సామ్రాజ్యంగా మారిన సామ్రాజ్య విస్తరణ మాసిదోనియ కొండల్లో ఆరంభమైంది. అలెగ్జాండర్‌ తన 20వ యేట అక్కడనుండి తూర్పుదిక్కున దండయాత్ర చేయడం గురించి ఆలోచించాడు. సా.శ.పూ. 334లో ఆయన ఐరోపాను, ఆసియాను వేరుపరచే హెల్లెస్‌పొంట్‌ (డార్డనెల్లిస్‌) గుండా తన సైన్యాన్ని నడిపించాడు. అలెగ్జాండర్‌ ఆధ్వర్యంలోని గ్రీకులు ఉత్సాహంతో ఉరకలువేస్తున్న ‘చిరుతపులిలా’ ఒకదాని తర్వాత ఒకటిగా వెంటవెంటనే విజయాలు సాధించడం ప్రారంభించారు. (దాని 7:⁠6) అలెగ్జాండర్‌ ట్రాయి దగ్గర అంటే గ్రానికస్‌ నదివద్దవున్న మైదానాల్లో పారసీకులపై ఆధిపత్యం సాధించి, ఇస్సస్‌వద్ద జరిగిన యుద్ధంలో వారిని పూర్తిగా ఓడించాడు.

గ్రీకులు సిరియాపై, ఫేనీకేపై దాడిచేసి ఏడునెలల ముట్టడి తర్వాత తూరును చేజిక్కించుకున్నారు. (యెహె 26:​4, 12) అలెగ్జాండర్‌ యెరూషలేమును విడిచిపెట్టి గాజాను జయించాడు. (జెక 9:⁠5) ఆయన ఐగుప్తులోనికి ప్రవేశించిన తర్వాత అలెక్సంద్రియను స్థాపించాడు, అది వాణిజ్యానికి, విద్యకు కేంద్రంగా తయారయ్యింది. ఆయన మరోసారి వాగ్దాన దేశాన్ని దాటివెళ్ళి నీనెవె శిథిలాలకు సమీపానవున్న గాగమెలావద్ద మళ్ళీ పారసీకులను ఓడించాడు.

పారసీకుల పరిపాలనా కేంద్రాలైన బబులోనును, షూషనును, పెర్సిపోలిస్‌ను జయించడానికి అలెగ్జాండర్‌ దక్షిణదిక్కుకు తిరిగాడు. తర్వాత ఆయన పారసీకుల సంస్థానం గుండా వేగంగా ముందుకుసాగి, ఇప్పుడు పాకిస్తాన్‌లోవున్న సింధునదికి చేరుకున్నాడు. కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే, అలెగ్జాండర్‌ అప్పటికి తెలిసిన ప్రపంచంలోని అధికశాతాన్ని జయించాడు. అయితే సా.శ.పూ. 323లో ఆయన 32 సంవత్సరాల వయసులో మలేరియాతో బబులోనులో మరణించాడు.​—⁠దాని 8:⁠8.

వాగ్దాన దేశంలో గ్రీకుల ప్రభావం బలంగా ఉండేది. అలెగ్జాండర్‌ సైన్యంలోని మాజీ సైనికులు కొందరు ఆ ప్రాంతంలో స్థిరపడ్డారు. మొదటి శతాబ్దానికల్లా, గ్రీకు మాట్లాడే పట్టణాల సమాఖ్య (దెకపొలి) ఏర్పడింది. (మత్త 4:25; మార్కు 7:​31) హీబ్రూ లేఖనాలు గ్రీకులో లభ్యమవడం ఆరంభమయింది. క్రైస్తవ బోధలు వ్యాపించడానికి కొయిని (సామాన్య గ్రీకు) అంతర్జాతీయ భాషగా పనిచేసింది.

రోమా సామ్రాజ్యం

పశ్చిమాన ఏమి జరుగుతోంది? గతంలో టైబర్‌ నదీతీరాన గ్రామాల సమూహంగావున్న రోమా ప్రాముఖ్యతను సంతరించుకుంది. చివరకు రోమా సామ్రాజ్యపు సమర్థవంతమైన యుద్ధ వ్యవస్థ, దాని కేంద్రీకృత రాజకీయ బలం అలెగ్జాండర్‌ నలుగురు సైనికాధికారుల ఆధీనంలోని ప్రాంతాలను అది ఆక్రమించుకునేలా చేశాయి. సా.శ.పూ. 30 నాటికి, రోమా సామ్రాజ్యం స్పష్టంగా ప్రబలమై, దానియేలు దర్శనంలో చూసిన ‘భయంకరమైన జంతువు’ తొలి ఛాయలు కనబడడం ఆరంభమైంది.​—⁠దాని 7:⁠7.

రోమా సామ్రాజ్యం బ్రిటన్‌ నుండి ఉత్తర ఆఫ్రికా వరకు, అట్లాంటిక్‌ మహాసముద్రం నుండి పర్షియా సింధుశాఖ వరకు విస్తరించింది. ఆ సామ్రాజ్యం మధ్యధరా ప్రాంతమంతటిని చుట్టివున్నందున, రోమన్లు దానిని మెరె నాస్ట్రమ్‌ (మా సముద్రం) అని పిలిచారు.

రోమా సామ్రాజ్యం కూడా యూదులపై ప్రభావం చూపింది ఎందుకంటే వారి దేశం రోమా సామ్రాజ్యంలోనే ఉండేది. (మత్త 8:5-13; అపొ 10:​1, 2) తిబెరి చక్రవర్తి పరిపాలనలో యేసు బాప్తిస్మం పొందాడు, మరణించాడు. కొంతమంది రోమా పరిపాలకులు క్రైస్తవులను తీవ్రంగా హింసించారు కాని సత్యారాధనను పడగొట్టలేకపోయారు. 13 శతాబ్దాల తర్వాత ఉత్తరదిక్కునుండి జర్మనీ తెగలు, తూర్పుదిక్కునుండి సంచార జాతులు చేసిన దాడుల మూలంగా ఆ సామ్రాజ్యం పతనమైంది.

[26వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

గ్రీకు సామ్రాజ్యం

అలెగ్జాండర్‌ తర్వాత, ఆ విశాల సామ్రాజ్యాన్ని అతని నలుగురు సైనికాధికారులు పరిపాలించారు

కాస్సెండర్‌

లిసిమాకస్‌

టాలిమీ I

సెల్యూకస్‌ I

A2 ▪ గ్రీసు

A2 ▪ ఏథెన్సు

A2 ▪ అకయ

A3 ○ కురేనే

A3 ○ లిబియ

B2 ▫ బైజాంటియమ్‌

B3 ○ కుప్ర

B4 ○ నోఅమోను (థీబ్స్‌)

C3 పామైరా (తద్మోరు)

C3 ○ గెరాసా

C3 ○ ఫిలదెల్ఫియ

C3 ○ యెరూషలేము

C5 ○ సెవేనే

G2 • అలెక్సంద్రియ మార్జానా

అలెగ్జాండర్‌ మార్గం

A2 ▪ మాసిదోనియ

A2 ▪ పెల్లా

A2 ▫ థ్రేస్‌

B2 ▫ ట్రాయి

B2 ▫ సార్దీస్‌

B2 ▫ ఎఫెసు

B2 ▫ గొర్డీయమ్‌

C2 ▫ అంకారా

C3 • తార్సు

C3 • ఇస్సస్‌

C3 • అంతియొకయ (సిరియా)

C3 ○ తూరు

C4 ○ గాజా

B4 ○ ఐగుప్తు

B4 ○ మెంఫెసు

B4 ○ అలెక్సంద్రియ

A4 ○ సీవా నీటిచెలమ

B4 ○ మెంఫెసు

C4 ○ గాజా

C3 ○ తూరు

C3 ○ దమస్కు

C3 • అలెప్పో

D3 • నీసీబీస్‌

D3 • గాగమెలా

D3 • బబులోను

E3 • షూషను

E4 • పారసీక దేశము

E4 • పెర్సిపోలిస్‌

E4 • పసార్‌గడీ

E3 • మాద్య

E3 • ఎగ్బతానా

E3 • రేజీ

E3 • హెకటోమ్‌పలొస్‌

F3 • పార్తీయ

G3 • ఏర్యా

G3 • అలెక్సంద్రియ ఆరియోను

G3 • అలెక్సంద్రియ ప్రాఫ్తాసియా

F4 • డ్రాంజియేనా

G4 • అరకోజ

G4 • అలెక్సంద్రియ అరకోస్యోరము

H3 • కాబుల్‌

G3 • డ్రాప్సాక

H3 • అలెక్సంద్రియ ఆక్సియానా

G3 • డ్రాప్సాక

G3 • బాక్ట్రియా

G3 • బాక్ట్రా

G2 • డిర్బ్యెంట్‌

G2 • సాగ్డీనా

G2 • మరకంద

G2 • బుఖారా

G2 • మరకంద

H2 • అలెక్సంద్రియ ఎస్కాటీ

G2 • మరకంద

G2 • డిర్బ్యెంట్‌

G3 • బాక్ట్రా

G3 • బాక్ట్రియా

G3 • డ్రాప్సాక

H3 • కాబుల్‌

H3 • టాక్సీల

H5 • హిందూ దేశము

H4 • అలెక్సంద్రియ

G4 • జెడ్రోజ

F4 • ప్యూర

E4 • పారసీక దేశము

F4 • అలెక్సంద్రియ

F4 • కార్మానీయ

E4 • పసార్‌గడీ

E4 • పెర్సిపోలిస్‌

E3 • షూషను

D3 • బబులోను

[ఇతర ప్రదేశాలు]

A3 క్రేతు

D4 అరేబియా

[సముద్రాలు]

B3 మధ్యధరా సముద్రం

C5 ఎర్ర సముద్రం

E4 పర్షియా సింధుశాఖ

G5 అరేబియా సముద్రం

[నదులు]

B4 నైలు

D3 యూఫ్రటీసు

D3 టైగ్రీస్‌

G4 సింధు

[27వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

రోమా సామ్రాజ్యం

A1 బ్రిటన్‌

A3 స్పెయిను

B1 జర్మేనియా

B2 గాల్‌

B2 ఇటలీ

B2 రోమా

B3 కార్థేజ్‌

C2 ఇల్లూరికు

C3 గ్రీసు

C3 అక్షీము

C3 కురేనే

D2 బైజాంటియమ్‌ (కాన్‌స్టాంటినోపుల్‌)

D3 ఆసియా మైనరు

D3 ఎఫెసు

D3 అలెప్పో

D3 అంతియొకయ (సిరియా)

D3 దమస్కు

D3 గెరాసా (జారషు)

D3 యెరూషలేము

D3 అలెక్సంద్రియ

D4 ఐగుప్తు

[సముద్రాలు]

A2 అట్లాంటిక్‌ మహాసముద్రం

C3 మధ్యధరా సముద్రం

D2 నల్ల సముద్రం

D4 ఎర్ర సముద్రం

[26వ పేజీలోని చిత్రం]

రబ్బాను పునర్నిర్మించిన తర్వాత టాలిమీ II దానికి ఫిలదెల్ఫియ అని పేరుపెట్టాడు. ఒక పెద్ద రోమా థియేటర్‌ శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి

[27వ పేజీలోని చిత్రం]

దెకపొలి పట్టణమైన గెరాసా (జారషు)

[27వ పేజీలోని చిత్రం]

అలెప్పో దగ్గరున్న ఇలాంటి రోమా రహదారులు ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం గుండా విస్తరించాయి. బైబిలు సత్యాన్ని వ్యాపింపజేయడానికి క్రైస్తవులు ఈ రహదారుల్లో ప్రయాణించారు