దేవుని ప్రజలు తమ దేశానికి తిరిగి రావడం
దేవుని ప్రజలు తమ దేశానికి తిరిగి రావడం
ఆధునిక ఇరాన్ పీఠభూమి చుట్టూ రెండు ప్రాముఖ్యమైన పర్వత శ్రేణులు ఉన్నాయి—(కాస్పియన్ సముద్రానికి దక్షిణానవున్న) ఎల్‌బుర్జ్ పర్వతాలు, (పర్షియా సింధుశాఖవైపు ఆగ్నేయ దిశనవున్న) జాగ్రోస్ పర్వతాలు. ఆ పర్వత శ్రేణుల మధ్య పొడవైన సారవంతమైన లోయలు చెట్లతో నిండివున్నాయి. ఆ లోయల్లో సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది కాని ఎత్తులోవుండి, నీరులేకుండా, బలమైన గాలులు వీచే మైదానాలు శీతాకాలంలో చాలా చల్లగా ఉంటాయి. దగ్గర్లోనే చాలా తక్కువ జనాభాతో పీఠభూమి ఎడారి ఉంది. మెసొపొతమియకు తూర్పువైపు ఉన్న ఈ సాధారణమైన ప్రాంతంలో మాదీయ-పారసీక సామ్రాజ్యం ఉనికిలోకి వచ్చింది.
మాదీయులు ఆ తర్వాత అర్మేనియా కిలికియలకు విస్తరించినప్పటికీ వారు మొదట్లో పీఠభూమికి ఉత్తరభాగంలోనే ఎక్కువగా ఉండేవారు. అయితే పారసీకులు పీఠభూమికి నైరృతి భాగాన టైగ్రీస్ లోయకు తూర్పువైపున ఉండేవారు. సా.శ.పూ. ఆరవ శతాబ్దం మధ్యకాలంలో కోరెషు రాజు పాలనలో ఈ రెండు రాజ్యాలు ఐక్యమై మాదీయ-పారసీక ప్రపంచ శక్తిగా రూపొందాయి.
కోరెషు సా.శ.పూ. 539లో బబులోనును జయించాడు. ఆయన సామ్రాజ్యం తూర్పువైపున హిందూ దేశానికి (ఇండియాకు) విస్తరించింది. పడమటివైపు ఐగుప్తు, ఇప్పుడు టర్కీగా ఉన్న ప్రాంతం కూడా దానిలో భాగమయ్యాయి. దానియేలు మాదీయ-పారసీక సామ్రాజ్యాన్ని ‘విస్తారముగా మాంసము భక్షించిన’ క్రూరమైన “ఎలుగుబంటి” అని సరిగ్గానే వర్ణించాడు. (దాని 7:5) కోరెషు దయతో, సహనంతో పరిపాలించాడు. ఆయన తన సామ్రాజ్యాన్ని మండలాలుగా విభజించాడు. ప్రతి మండలాన్ని సాధారణంగా ఒక పారసీకుడైన మండలాధిపతి పరిపాలించేవాడు, ఆయన క్రిందవుండే స్థానిక పరిపాలకునికి కొంత అధికారం ఉండేది. ఆ సామ్రాజ్యంలోని ప్రజలు తమ స్వంత ఆచారాలను, మతాలను అనుసరించమని ప్రోత్సహించబడేవారు.
ఈ పథకాన్నే అనుసరిస్తూ కోరెషు, ఎజ్రా నెహెమ్యాలు వర్ణించినట్లు, యూదులు సత్యారాధనను పునరుద్ధరించి యెరూషలేమును పునర్నిర్మించడానికి తిరిగి వెళ్ళేందుకు అనుమతించాడు. ఈ గొప్ప జనసమూహము అబ్రాహాము ప్రయాణించిన మార్గంలోనే అంటే యూఫ్రటీసు నది నుండి కర్కెమీషు వైపుకు ప్రయాణించివుంటారా లేక బహుశా వారు తద్మోరు దమస్కుల గుండా దగ్గరి మార్గంలో ప్రయాణించివుంటారా? దాని గురించి బైబిలు చెప్పడం లేదు. (6-7 పేజీలు చూడండి.) కొంతకాలానికి యూదులు ఆ సామ్రాజ్యంలోని ఇతర భాగాల్లో కూడా అంటే నైలు పీఠభూమిపై, దక్షిణాన ఎంతో దూరానవున్న ప్రాంతాల్లో కూడా నివసించడం ప్రారంభించారు. బబులోనులో ఎంతోమంది యూదులు ఉండేవారు, బహుశా అందుకే మూడు శతాబ్దాల తర్వాత అపొస్తలుడైన పేతురు ఆ ప్రాంతాన్ని సందర్శించాడు. (1 పేతు 5:13) అవును, ఆ తర్వాత వచ్చిన గ్రీకు సామ్రాజ్యంలోని, రోమా సామ్రాజ్యంలోని చాలా ప్రాంతాల్లో యూదులు ఉండడానికి మాదీయ-పారసీక సామ్రాజ్యం కారణమయ్యింది.
మాదీయ-పారసీక సామ్రాజ్యం బబులోనును జయించిన తర్వాత, వేసవివేడి అధికంగావుండే ఆ నగరాన్ని కార్యనిర్వహణ కేంద్రంగా ఉపయోగించుకున్నారు. మునుపు ఏలామీయుల రాజధానిగా ఉండిన షూషను వారి రాచరిక నగరాల్లో ఒకటిగా ఉండేది. ఆ తర్వాత ఆ నగరంలోనే, పారసీక రాజైన అహష్వేరోషు (క్సెరెక్సెస్ I అని తెలుస్తోంది) ఎస్తేరును తన రాణిగా చేసుకుని ఆ విశాల సామ్రాజ్యంలో దేవుని ప్రజలను లేకుండా చేయాలనే పన్నాగాన్ని అడ్డుకున్నాడు. మాదీయ-పారసీకుల ఇతర రెండు ముఖ్య పట్టణాల్లో ఒకటి ఎగ్బతానా (ఇది 1,900 మీటర్ల ఎత్తున ఉండడంవల్ల అక్కడ వేసవికాలం ఆహ్లాదకరంగా ఉండేది) రెండవది పసార్‌గడీ (ఇది కూడా అంతే ఎత్తున, ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలో ఉండేది).
ఈ ప్రపంచాధిపత్యం ఎలా ముగిసింది? మాదీయ-పారసీక సామ్రాజ్యం అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు, వాయవ్య సరిహద్దులో గ్రీకుల తిరుగుబాటు ప్రయత్నాలకు అది ప్రతిస్పందించింది. ఆ కాలంలో గ్రీసు, పోరాటాలు సాగించే స్వతంత్ర ప్రతిపత్తిగల రాష్ట్రాలుగా విభజించబడివుంది, అయితే మర్‌థాన్ సలమీలలో జరిగిన నిర్ణయాత్మక యుద్ధాల్లో పారసీక బలగాలను ఓడించడంలో ఆ రాష్ట్రాలన్నీ సహకరించాయి. ఇది మాదీయ-పారసీక సామ్రాజ్యంపై సమైఖ్య గ్రీసు ఆధిపత్యానికి పునాదివేసింది.
[25వ పేజీలోని బాక్సు]
యెరుబ్బాబెలు నాయకత్వంలో, దాదాపు 50,000 మంది ఇశ్రాయేలీయులు (ఎన్నుకున్న రహదారిపై ఆధారపడి) 800 నుండి 1,600 కిలోమీటర్ల దూరంలోవున్న యెరూషలేముకు తిరుగు ప్రయాణమయ్యారు. వారు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. వారి దేశం ఏడు దశాబ్దాలపాటు నిర్మానుష్యంగా పడివుంది. తమ దేశానికి తిరిగి వచ్చినవారు బలిపీఠంకట్టి యెహోవాకు బలులు అర్పించడం ద్వారా సత్యారాధనను పునఃస్థాపించారు. సా.శ.పూ. 537 శరదృతువులో వారు పర్ణశాలల పండుగను జరుపుకున్నారు. (యిర్మీ 25:11; 29:10) ఆ తర్వాత, తిరిగివచ్చినవారు యెహోవా గృహం నిర్మించడానికి పునాదివేశారు.
[25వ పేజీలోని బాక్సు]
ఈ కాలంలో వ్రాయబడిన బైబిలు పుస్తకాలు:
దానియేలు
హగ్గయి
జెకర్యా
ఎస్తేరు
కీర్తనలు (కొంత భాగం)
1 దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
మలాకీ
[24వ పేజీలోని మ్యాపు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
మాదీయ-పారసీక సామ్రాజ్యం
A2 మాసిదోనియ
A2 థ్రేస్
A4 కురేనే
A4 లిబియ
B2 బైజాంటియమ్
B2 లూదియ
B3 సార్దీస్
B4 మెంఫెసు (నోపు)
B4 ఐగుప్తు
B5 నోఅమోను (థీబ్స్)
B5 సెవేనే
C3 కిలికియ
C3 తార్సు
C3 ఇస్సస్
C3 కర్కెమీషు
C3 తద్మోరు
C3 సిరియా
C3 సీదోను
C3 దమస్కు
C3 తూరు
C4 యెరూషలేము
D2 ఫేసిస్
D2 అర్మేనియా
D3 అష్షూరు (ASSYRIA)
D3 నీనెవె
D4 బబులోను
E3 మాద్య
E3 ఎగ్బతానా (అక్మెతా)
E3 హర్కేనీ
E4 షూషను (షూష)
E4 ఏలాము
E4 పసార్‌గడీ
E4 పెర్సిపోలిస్
E4 పారసీక దేశము
F3 పార్తీయ
F4 డ్రాంజియేనా
G2 మరకంద (సమర్కంద)
G3 సాగ్డీనా
G3 బాక్ట్రియా
G3 ఏర్యా
G4 అరకోజ
G4 జెడ్రోజ
H5 హిందూ దేశము
[ఇతర ప్రదేశాలు]
A2 గ్రీసు
A3 మర్‌థాన్
A3 ఏథెన్సు
A3 సలమీ
C1 సిథియా
C4 ఏలతు (ఎలతు)
C4 తేమా
D4 అరేబియా
[పర్వతాలు]
E3 ఎల్‌బుర్జ్ పర్వతాలు
E4 జాగ్రోస్ పర్వతాలు
[సముద్రాలు]
B3 మధ్యధరా సముద్రం (మహా సముద్రం)
C2 నల్ల సముద్రం
C5 ఎర్ర సముద్రం
E2 కాస్పియన్ సముద్రం
E4 పర్షియా సింధుశాఖ
[నదులు]
B4 నైలు
C3 యూఫ్రటీసు
D3 టైగ్రీస్
H4 సింధు
[24వ పేజీలోని చిత్రం]
బబులోను చేరుకోవడానికి కోరెషు దళాలు జాగ్రోస్ పర్వతాలను దాటవలసి వచ్చింది
[25వ పేజీలోని చిత్రం]
పైన: పెర్సిపోలిస్‌వద్ద అన్ని జనాంగాల ద్వారము
[25వ పేజీలోని చిత్రం]
లోపలి చిన్న చిత్రం: పసార్‌గడీవద్ద కోరెషు సమాధి