కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పితరుల ప్రపంచం

పితరుల ప్రపంచం

పితరుల ప్రపంచం

స్తెఫెను కొన్ని భౌగోళిక వాస్తవాలను పేర్కొంటూ ఒక ప్రసిద్ధ ప్రసంగం ప్రారంభించాడు: ‘మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు [యెహోవా] అతనికి ప్రత్యక్షమై, నీవు బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాడు.’ (అపొ 7:​1-4) ఈ ఆజ్ఞ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు సంబంధించి వాగ్దాన దేశములో గమనార్హమైన సంఘటనలు జరగడానికి, అంటే మానవజాతిని ఆశీర్వదించేందుకు దేవుడు సంకల్పించినదానితో ముడిపడిన సంఘటనలు జరగడానికి ఆధారమయ్యింది.​—⁠ఆది 12:1-3; యెహో 24:⁠3.

కల్దీయుల పట్టణమైన ఊరును విడిచి రమ్మని దేవుడు అబ్రాహాముకు (లేదా అబ్రాముకు) ఆజ్ఞాపించాడు, ఆ సంపన్న పట్టణం అప్పట్లో యూఫ్రటీసు నది తూర్పు తీరంవద్ద ఉండేది. అబ్రాహాము ఏ మార్గంలో ప్రయాణిస్తాడు? సుమేరు లేదా షీనారు అని కూడా పిలువబడే కల్దీయుల దేశంనుండి నేరుగా పశ్చిమానికి ప్రయాణించడం సులభమనిపించవచ్చు. ఉత్తరంవైపు ఎంతో దూరానవున్న హారాను వరకు వెళ్ళడం ఎందుకు?

అర్ధచంద్రాకారంలోవున్న సారవంతమైన నేలకు అంటే పాలస్తీనా నుండి టైగ్రీస్‌ యూఫ్రటీసు నదుల వరకూ విస్తరించివున్న నేలకు తూర్పువైపు చివరన ఊరు పట్టణం ఉండేది. ఈ ప్రాంతంలో పూర్వం సమశీతోష్ణ వాతావరణం ఉండివుండవచ్చు. ఆ అర్ధచంద్రాకారంలోవున్న నేల వంపుకు దక్షిణ భాగాన సైరో-అరేబియన్‌ ఎడారి ఉంది, ఆ ఎడారి సున్నపురాళ్ళ కొండలు, ఇసుక మైదానాలతో నిండివుంటుంది. అది మధ్యధరా తీరప్రాంతానికి, మెసొపొతమియకు మధ్య “దాదాపు అభేద్యమైన అడ్డంకు”గా ఉండేదని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది. కొంతమంది వర్తకులు యూఫ్రటీసు నుండి తద్మోరు వరకున్న అరణ్యాన్ని దాటి వెళ్ళి, అక్కడనుండి దమస్కుకు వెళ్ళేవారు, కాని అబ్రాహాము తన కుటుంబాన్ని పశువుల మందలను అలాంటి అరణ్యం గుండా తీసుకొని వెళ్ళలేదు.

దానికి బదులుగా అబ్రాహాము యూఫ్రటీసు నది లోయనుండి హారానుకు వెళ్ళాడు. అక్కడనుండి ఆయన ఒక వర్తక మార్గాన్ని అనుసరించి కర్కెమీషువద్ద ఉన్న పాటిరేవుకు చేరుకొని, దక్షిణ వైపుకు బయలుదేరి దమస్కు గుండా ప్రయాణించి, ఆ తర్వాత గలిలయ సముద్రం అని పిలువబడిన ప్రాంతానికి వెళ్ళాడు. వయా మారిస్‌ లేదా “సముద్రపు మార్గం” మెగిద్దో గుండా ఐగుప్తు వరకూ వెళ్ళేది. అయితే అబ్రాహాము షోమ్రోనులోని కొండల గుండా ప్రయాణించి చివరకు షెకెముకు చేరుకొని అక్కడ గుడారాల్లో నివసించడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఆయన ఆ కొండల ప్రాంతం నుండి దక్షిణంవైపుకు ప్రయాణించాడు. ఆదికాండము 12:8-13:4 వచనాలు చదువుతూ మీరు ఆయన ప్రయాణ మార్గాన్ని మ్యాప్‌లో అనుసరించండి. ఆయనకు ఎదురైన విభిన్న అనుభవాల్లో భాగమైన ఇతర ప్రాంతాలను కూడా గమనించండి: దాను, దమస్కు, హోబా, మమ్రే, సొదొమ, గెరారు, బెయేర్షెబా, మోరీయా (యెరూషలేము).​—⁠ఆది 14:14-16; 18:1-16; 20:1-18; 21:25-34; 22:1-19.

ఆ ప్రాంతాల నైసర్గిక స్వరూపమును అర్థం చేసుకోవడం, ఇస్సాకు యాకోబుల జీవితాల్లోని సంఘటనలకు సంబంధించిన అవగాహనను పెంచుతుంది. ఉదాహరణకు, అబ్రాహాము బెయేర్షెబాలో ఉన్నప్పుడు ఆయన ఇస్సాకు కోసం భార్యను ఎంపిక చేయడానికి తన సేవకుణ్ణి ఏ ప్రాంతానికి పంపించాడు? ఉత్తర దిశలో ఎంతో దూరానవున్న మెసొపొతమియలోని (“నదుల మధ్యవున్న దేశము” అని దాని భావం) పద్దనరాముకు పంపించాడు. ఆ తర్వాత ఇస్సాకును కలుసుకోవడానికి రిబ్కా బహుశా కాదేషు దగ్గరున్న నెగెబుకు ఒంటె మీద చేసిన అలసట కలిగించే ప్రయాణాన్ని ఊహించుకోండి.​—⁠ఆది 24:10, 62-64.

ఆ తర్వాత వారి కుమారుడైన యాకోబు (ఇశ్రాయేలు) యెహోవా ఆరాధకురాలిని వివాహం చేసుకోవడానికి అదే విధంగా ఎంతో దూరం ప్రయాణించి వెళ్ళాడు. అయితే యాకోబు తన దేశానికి తిరిగి రావడానికి కాస్త వేరే మార్గంలో ప్రయాణించాడు. యాకోబు పెనూయేలు వద్దవున్న యబ్బోకు ఏటిలోయ దాటిన తర్వాత ఒక దేవదూతతో పోరాడాడు. (ఆది 31:21-25; 32:2, 22-30) ఆ ప్రాంతంలోనే ఆయనకు ఏశావు కలిశాడు, తర్వాత వారిద్దరు వేర్వేరు ప్రాంతాల్లో నివసించేందుకు వెళ్ళిపోయారు.​—⁠ఆది 33:1, 15-20.

యాకోబు కుమార్తె దీనా షెకెము వద్ద బలత్కరించబడిన తర్వాత, యాకోబు బేతేలులో నివసించేందుకు వెళ్ళాడు. అయితే యాకోబు కుమారులు ఆయన మందను మేపడానికి ఎంత దూరం వెళ్ళారో, యోసేపు చివరికి వారిని ఎక్కడ కలుసుకున్నాడో మీరు ఊహించుకోగలరా? ఈ మ్యాప్‌ (మరియు 18-19 పేజీల్లోని మ్యాప్‌) బేతేలుకు, దోతానుకు మధ్యవున్న దూరాన్ని చూసేందుకు మీకు సహాయం చేయవచ్చు. (ఆది 35:1-8; 37:​12-17) యోసేపు సహోదరులు ఆయనను ఐగుప్తుకు వెళ్తున్న వర్తకులకు అమ్మివేశారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు వెళ్ళడానికి, ఆ తర్వాత అక్కడనుండి నిర్గమనం చేయడానికి దారితీసిన సంఘటనలో భాగంగా ఆ వర్తకులు ఏ మార్గంలో ప్రయాణించివుంటారని మీరనుకుంటున్నారు?​—⁠ఆది 37:25-28.

[7వ పేజీలోని మ్యాపులు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

అబ్రాహాము ప్రయాణాలు (ప్రచురణ చూడండి)

ఇస్సాకు ప్రయాణాలు (ప్రచురణ చూడండి)

యాకోబు ప్రయాణాలు (ప్రచురణ చూడండి)

ప్రధాన రహదారులు (ప్రచురణ చూడండి)

పితరులు సంచరించిన ప్రాంతాలు (క్లుప్తంగా)

A4 గోషెను

B4 ఐగుప్తు

B4 షూరు

B5 పారాను

C3 దమస్కు

C3 దాను (లాయిషు)

C4 షెకెము

C4 బేతేలు

C4 హెబ్రోను (కిర్యతర్బా)

C4 గెరారు

C4 బెయేర్షెబా

C4 శేయీరు

C4 కాదేషు

C5 ఎదోము

D1 కర్కెమీషు

D2 తద్మోరు

D3 హోబా

E1 పద్దనరాము

E1 హారాను

F2 మెసొపొతమియ

G1 నీనెవె

G2 అర్థచంద్రాకారంలోవున్న సారవంతమైన నేల

G3 బబులోను

H4 కల్దీయ

H4 ఊరు

[పర్వతాలు]

C4 మోరీయా

[సముద్రాలు]

B3 మధ్యధరా సముద్రం (మహా సముద్రం)

[నదులు]

E2 యూఫ్రటీసు

G2 టైగ్రీస్‌

పితరులు సంచరించిన ప్రాంతాలు (వాగ్దాన దేశంలో)

కనాను

మెగిద్దో

గిలాదు

దోతాను

షెకెము

సుక్కోతు

మహనయీము

పెనూయేలు

బేతేలు (లూజు)

హాయి

యెరూషలేము (షాలేము)

బేత్లెహేము (ఎఫ్రాతా)

మమ్రే

హెబ్రోను (మక్పేలా)

గెరారు

బెయేర్షెబా

సొదొమ?

నెగెబు

రహెబోతు?

బెయేర్‌ లహాయిరోయి

కాదేషు

ముఖ్య దారులు

వయా మారిస్‌

రాజమార్గము

[పర్వతాలు]

మోరీయా

[సముద్రాలు]

ఉప్పు సముద్రం

[నదులు, ఏరులు]

యబ్బోకు

యొర్దాను

[6వ పేజీలోని చిత్రం]

బబులోను దగ్గరున్న యూఫ్రటీసు నది

[6వ పేజీలోని చిత్రం]

అబ్రాహాము బెయేర్షెబాలో నివసించి తన మందలను అక్కడ దగ్గర్లో మేపేవాడు

[6వ పేజీలోని చిత్రం]

యబ్బోకు ఏటిలోయ