కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు ప్రాంతాలు

బైబిలు ప్రాంతాలు

బైబిలు ప్రాంతాలు

ఇశ్రాయేలు జనాంగము వాగ్దాన దేశంలోకి ప్రవేశించేందుకు సిద్ధపడినప్పుడు, మోషే దేవునికి తన గాఢమైన కోరికను ఇలా వ్యక్తం చేశాడు: “నేను అద్దరికి వెళ్లి యొర్దాను అవతలనున్న యీ మంచి దేశమును మంచి మన్నెమును . . . చూచునట్లు దయచేయుము.”​—⁠ద్వితీ 3:25.

అలా చేసేందుకు మోషేకు అనుమతి లభించలేదు, కాని ఆయన యెరికో ఎదుటవున్న ఒక కొండపైకి ఎక్కి ఆ దేశాన్ని అంటే ‘దానువరకు గిలాదు దేశమంతయు, పశ్చిమసముద్రమువరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును యెరికో లోయను’ చూశాడు. (ద్వితీ 3:27; 34:​1-4) మీరు ఆ పేర్లు విన్నారా? ఆ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా?

నేడు యెహోవా ప్రజల్లోని చాలామంది బైబిల్లో తాము చదివిన అనేక ప్రాంతాలను సందర్శించలేకపోవచ్చు. దేవుడు అబ్రాహాముకు చేయమని చెప్పినదానిని వారు చేయలేకపోతున్నారు అదేమిటంటే, వాగ్దాన దేశపు నలుమూలలు ప్రయాణించడం. (ఆది 13:​14-17) అయినప్పటికీ నిజ క్రైస్తవులు బైబిలు ప్రాంతాల గురించి తెలుసుకోవాలని, అవి ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగివున్నాయో చూడాలని ఎంతో కోరుకుంటారు.

‘మంచి దేశమును చూడండి’ అనే ఈ బ్రోషుర్‌, లేఖనాలపై మీ అవగాహనను విస్తృతపరచుకోవడానికి మీరు ఉపయోగించుకోగల సాధనం. దీనిలో ప్రస్తుతం ఉనికిలోవున్న బైబిలు ప్రాంతాల చిత్రాలు అంటే ముఖపత్రంపై చూపించబడిన గిలియడ్‌ (గిలాదు) చిత్రం వంటివి ఉన్నాయి. దీనిలోని మ్యాప్‌లు ఎంతో సమాచారాన్ని అందజేస్తాయి, అవి బైబిలు ప్రాంతాల గురించి మీ పరిజ్ఞానాన్ని ఎంతో అధికం చేయగలవు.

రెండు, మూడు పేజీల్లోని మ్యాప్‌లో ముఖ్యమైన దేశాలు లేదా ప్రాంతాలు మాత్రమే చూపించబడ్డాయి. ఉదాహరణకు వాగ్దాన దేశానికి సంబంధించి అష్షూరు ఐగుప్తు దేశాలు ఎక్కడ ఉన్నాయో మీరు గమనించినప్పుడు, ఆ దేశాలను ప్రస్తావించే ప్రవచనాలను మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. (యెష 7:18; 27:13; హోషే 11:11; మీకా 7:​12) వాగ్దాన దేశము అని పిలువబడే సన్నని భూభాగం అనేక ప్రాచీన రహదారులు కలిసే స్థలంలో ఉండేది, దాని సారవంతమైన పంట పొలాలను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను స్వంతం చేసుకోవాలని ఇతర రాజ్యాలు ప్రయత్నించేవి.​—⁠ద్వితీ 8:8; న్యాయా 15:⁠5.

కొన్నిసార్లు మీరు మ్యాప్‌లను పోల్చి చూడాలనుకోవచ్చు. ఉదాహరణకు యోనా అష్షూరు దేశపు రాజధానిలో ప్రకటించడానికి నియమించబడ్డాడు, కాని ఆయన తర్షీషుకు వెళ్ళడానికి బయలుదేరాడు. (యోనా 1:​1-3) మీకు ఆ ప్రాంతాలు మొదటి మ్యాప్‌లో కనిపించాయా? అయితే తర్షీషు, అపొస్తలుడైన పౌలు జన్మించిన తార్సు ఒకటే అని పొరబడకూడదు. మీరు తార్సును, ఇతర ముఖ్య నగరాలను ఈ మ్యాప్‌లో చూడవచ్చు.

ఊరు, హారాను, యెరూషలేము ప్రాంతాలను వెతికి పట్టుకొని అబ్రాహాము ఏ మార్గాన, ఎంత దూరం ప్రయాణించాడో చూడండి. యెహోవా ఆయనను ఊరు నుండి పిలిచిన తర్వాత ఆయన హారానులో నివసించి ఆ తర్వాత వాగ్దాన దేశానికి వెళ్ళాడు. (ఆది 11:28-12:1; అపొ 7:​2-5) ఆరు, ఏడు పేజీల్లోని “పితరుల ప్రపంచం”ను అధ్యయనం చేస్తుండగా మీకు అబ్రాహాము ప్రయాణం మరింత వాస్తవికంగా కనిపిస్తుంది.

మొదటి మ్యాప్‌, ఇక్కడ ఇవ్వబడిన మ్యాప్‌ ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినవి కావు. ఈ రెండు మ్యాప్‌ల తర్వాత మిగతా మ్యాప్‌లు సాధారణ చారిత్రక క్రమములో ఇవ్వబడ్డాయి. ఒక మ్యాప్‌లోని నగరాలు లేదా వివరాలు ఒక నిర్దిష్ట కాలంలోని సంఘటనలకు సంబంధించినవి. మ్యాప్‌లలో పేర్కొనబడిన ప్రతి ప్రాంతం అనుక్రమణికలో (34-5 పేజీలు) సూచించబడలేదు కాని, మీరు పరిశోధన చేస్తున్న అంశానికి సంబంధించిన మ్యాప్‌లను కనుక్కోవడానికి అది మీకు సహాయపడగలదు.

మధ్య పేజీల్లోని (18-19 పేజీలు) మ్యాప్‌లో వాగ్దాన దేశంలోని అత్యధిక పట్టణాలు, నగరాలు పేర్కొనబడ్డాయి. లేవీయుల నగరాలను, ఆరు ఆశ్రయపురములను కనుక్కోడానికి, అంతేకాక ఫలాని ప్రాంతం గురించి హీబ్రూ లేఖనాల్లో ప్రస్తావించబడిందో గ్రీకు లేఖనాల్లో ప్రస్తావించబడిందో రెండింటిలో ప్రస్తావించబడిందో తెలుసుకోవడానికి మీకు మ్యాప్‌ వివరాల పట్టిక సహాయం చేస్తుంది.

కొన్ని బైబిలు ప్రాంతాలు మునుపు ఎక్కడ ఉండేవో ప్రస్తుతం మనకు తెలియదు కాబట్టి ఆ ప్రాంతాల పేర్లలో చాలామట్టుకు మధ్య పేజీల్లోని మ్యాప్‌లో లేవు. అంతేకాక ప్రతి నగరాన్ని, ప్రతి పట్టణాన్ని అంటే గోత్రాలకు కేటాయించబడిన భూభాగపు సరిహద్దు నగరాలన్నింటిని మ్యాప్‌లో చేర్చడం సాధ్యపడలేదు. (యెహో 15-19 అధ్యాయాలు) ఆ మ్యాప్‌లో ఏదైనా ఒక స్థలం ఎక్కడుందో చూపించబడకపోయినా దాని పరిసర నగరాలు ఇవ్వబడ్డాయి కాబట్టి ఆ స్థలం ఉజ్జాయింపుగా ఎక్కడుందో అంచనా వేసుకోవడం వీలవుతుంది. కొన్ని భౌగోళిక వివరాలు (పర్వతాలు, నదులు, వాగులు, లోయలు) చూపించబడ్డాయి, ఎత్తు పల్లాలు రంగుల ద్వారా సూచించబడ్డాయి. ఇలాంటి వివరాలు, మీరు బైబిలు సంఘటనలకు సంబంధించిన విషయాలను మనస్సులో ఊహించుకోవడానికి సహాయం చేస్తాయి.

బైబిలు ప్రాంతాలకు సంబంధించి మరింత సమాచారం, అనేక భాషల్లో లభ్యమవుతున్న లేఖనాలపై అంతర్దృష్టి (తెలుగులో లేదు) అనే ఎన్‌సైక్లోపీడియాలో లభిస్తుంది. a దానిని, ఇతర బైబిలు అధ్యయన సాధనాలను మీరు ఉపయోగిస్తున్నప్పుడు ‘మంచి దేశమును చూడండి’ అనే ఈ బ్రోషుర్‌ను కూడా దగ్గర ఉంచుకోండి. మీ జీవితానికి ఎంతో ప్రయోజనకరమైన లేఖనాలన్నింటిని అధ్యయనం చేసేటప్పుడు దీన్ని ఉపయోగించండి.​—⁠2 తిమో 3:16, 17.

[అధస్సూచి]

a యెహోవాసాక్షులు ప్రచురించినది.

[5వ పేజీలోని బాక్సు]

బైబిలు పుస్తకాలు వ్రాయబడిన ప్రాంతాలు

బబులోను

కైసరయ

కొరింథు

ఐగుప్తు

ఎఫెసు

యెరూషలేము

మాసిదోనియ

మోయాబు

పత్మాసు

వాగ్దాన దేశము

రోమా

షూషను

[4, 5వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

బైబిల్లో పేర్కొన్న దేశాలు, ముఖ్య పట్టణాలు

A1 ఇటలీ

A2 రోమా

A3 సిసిలి

A3 మెలితే

C2 మాసిదోనియ

C2 ఫిలిప్పీ

C2 గ్రీసు

C3 ఏథెన్సు

C3 కొరింథు

C3 క్రేతు

C4 లిబియ

D3 అంతియొకయ (పిసిదియ)

D3 ఎఫెసు

D3 పత్మాసు

D3 రొదు

D4 మెంఫెసు

D5 ఐగుప్తు

E2 ఆసియా మైనరు

E3 తార్సు

E3 అంతియొకయ (సిరియా)

E3 కుప్ర

E4 సీదోను

E4 దమస్కు

E4 తూరు

E4 కైసరయ

E4 వాగ్దాన దేశము

E4 యెరూషలేము

E4 మోయాబు

E4 కాదేషు

E4 ఎదోము

F3 ఏదెను తోట?

F3 అష్షూరు (ASSYRIA)

F3 హారాను

F3 సిరియా

F5 అరేబియా

G3 నీనెవె

G4 బబులోను

G4 కల్దీయ

G4 షూషను

G4 ఊరు

H3 మాద్య

[పర్వతాలు]

E5 సీనాయి పర్వతం

G2 అరారాతు కొండలు

[సముద్రాలు]

C3 మధ్యధరా సముద్రం (మహా సముద్రం)

E1 నల్ల సముద్రం

E5 ఎర్ర సముద్రం

H2 కాస్పియన్‌ సముద్రం

H5 పర్షియా సింధుశాఖ

[నదులు]

D5 నైలు నది

F3 యూఫ్రటీసు నది

G3 టైగ్రీస్‌ నది