“యూదుల దేశమందు” యేసు
“యూదుల దేశమందు” యేసు
కొర్నేలీకి సాక్ష్యమిస్తున్నప్పుడు అపొస్తలుడైన పేతురు “యూదుల దేశమందును యెరూషలేమునందును” యేసు చేసిన పనులను ప్రస్తావించాడు. (అపొ 10:39) చరిత్రాత్మకమైన యేసు పరిచర్యలో ఏయే ప్రాంతాలు ఉండవచ్చని మీరనుకుంటున్నారు?
“యూదుల దేశమందు” యూదయ ఉంది, అక్కడ యేసు కొంత దేవుని పని చేశాడు. (లూకా 4:44) యేసు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, 40 రోజులు యూదా (లేదా యూదయ) అరణ్యంలో గడిపాడు, ఈ ప్రాంతం బంజరు భూమిగా నిర్జనంగావుండి తరచూ తిరుగుబాటుదారులకు, బందిపోటు దొంగలకు నెలవుగా ఉండేది. (లూకా 10:30) ఆ తర్వాత, యేసు యూదయ నుండి ఉత్తరదిక్కుకు ప్రయాణించినప్పుడు సుఖారు దగ్గర ఒక సమరయ స్త్రీకి సాక్ష్యమిచ్చాడు.—యోహా 4:3-7.
సువార్తల సమీక్ష, యేసు ఎక్కువగా గలిలయలోనే ప్రకటించాడని చూపిస్తోంది. వార్షిక పండుగల కోసం దక్షిణదిశగా యెరూషలేముకు వెళ్ళినప్పటికి, ఆయన తన పరిచర్యలోని మొదటి రెండు సంవత్సరాల్లో అధికశాతం వాగ్దాన దేశపు ఉత్తరభాగంలోనే గడిపాడు. (యోహా 7:2-10; 10:22, 23) ఉదాహరణకు, ఆయన గలిలయ సముద్రం మీద లేదా దాని పరిసరాల్లో ఉన్నప్పుడు ప్రాముఖ్యమైన బోధలు బోధించాడు, చెరగని ముద్రవేసిన అద్భుతకార్యాలు చేశాడు. ఆయన గలిలయ సముద్రంలోని తుఫానును నిమ్మళింపజేసి నీటిపై నడవడాన్ని గుర్తుచేసుకోండి. ఆ సముద్రపు గులకరాళ్ల తీరంపై కూర్చొనివున్న జనసమూహాలకు ఆయన పడవల్లోనుండి ప్రకటించాడు. ఆయన తొలి, సన్నిహిత అనుచరులు ఆ దగ్గరి ప్రాంతాల్లోని జాలరుల, వ్యవసాయదారుల సమాజాల నుండి వచ్చినవారు.—మార్కు 3:7-12; 4:35-41; లూకా 5:1-11; యోహా 6:16-21; 21:1-19.
యేసు గలిలయ ప్రాంతంలో చేసిన పరిచర్యకు, తీరప్రాంతంలోవున్న ‘తన సొంత పట్టణమైన’ కపెర్నహూము కేంద్రస్థానంగా ఉండేది. (మత్త 9:1, NW) ఆయన తన ప్రఖ్యాత కొండమీది ప్రసంగం ఇచ్చినప్పుడు ఆయన ఆ పట్టణానికి దగ్గర్లోనేవున్న కొండచరియపై ఉన్నాడు. ఆయా సందర్భాల్లో ఆయన కపెర్నహూము ప్రాంతం నుండి మగదానుకు, బేత్సయిదాకు లేదా దగ్గర్లోని ప్రాంతాలకు పడవలో వెళ్లాడు.
యేసు ‘సొంత పట్టణం,’ ఆయన పెరిగిన నజరేతుకు, నీటిని ద్రాక్షారసంగా మార్చిన కానాకు, విధవరాలి కుమారుణ్ణి పునరుత్థానం చేసిన నాయీనుకు, 5,000 మంది పురుషులకు అద్భుతరీతిలో ఆహారం అందించిన, ఒక గుడ్డివాడికి చూపునిచ్చిన బేత్సయిదాకు ఎంతో దూరంలో లేదని గమనించండి.
సా.శ. 32లో పస్కా పండుగ తర్వాత, యేసు ఉత్తర దిక్కుగా ఫేనీకే ఓడరేవులైన తూరు సీదోనులవైపు వెళ్లాడు. ఆ తర్వాత ఆయన దెకపొలి అని పిలువబడిన గ్రీకు సంస్కృతిగల పది పట్టణాలలో కొన్నింటికి తన పరిచర్యను విస్తరింపజేశాడు. పేతురు యేసును మెస్సీయగా గుర్తించినప్పుడు ఆయన ఫిలిప్పుదైన కైసరయకు (F2) దగ్గరలో ఉన్నాడు, ఆ తర్వాత వెంటనే బహుశ హెర్మోను కొండమీద ఆయన రూపాంతరం పొందాడు. ఆ తర్వాత, యేసు యొర్దానుకు అవతలివైపు తూర్పుదిశలోవున్న పెరయలో ప్రకటించాడు.—మార్కు 7:24-37; 8:27-9:2; 10:1; లూకా 13:22, 33.
యేసు భూమిపై ఉన్న చివరివారం, తన శిష్యులతో ‘మహారాజు పట్టణమైన’ యెరూషలేములో దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో గడిపాడు. (మత్త 5:35) మీరు సువార్తల్లో చదివిన ఎమ్మాయు, బేతనియ, బేత్పగే, బేత్లెహేము వంటి చుట్టుప్రక్కల ప్రాంతాలను ఈ మ్యాప్‌లో చూడవచ్చు.—లూకా 2:4; 19:29; 24:13; 18 వ పేజీలోని చిన్న చిత్రంలో “యెరూషలేము ప్రాంతము” చూడండి.
[29వ పేజీలోని మ్యాపు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
వాగ్దాన దేశం (యేసు కాలంలో)
యేసు కాలంలో ఆ దేశము
దెకపొలి పట్టణాలు
E5 హిప్పో
E6 పెల్లా
E6 సిథోపోలిస్
F5 గదర
F7 గెరాసా
G5 దీయోను
G9 ఫిలదెల్ఫియా
H1 దమస్కు
H4 రఫానా
I5 కనాతా
ప్రధాన రహదారులు (ప్రచురణ చూడండి)
గలిలయకు యెరూషలేముకు మధ్య సామాన్య మార్గం (ప్రచురణ చూడండి)
గలిలయకు యెరూషలేముకు మధ్య ప్రత్యామ్నాయ మార్గం, పెరయ గుండా (ప్రచురణ చూడండి)
A11 గాజా
B6 కైసరయ
B8 యొప్పే
B9 లుద్ద
B12 బెయేర్షెబా
C4 తొలెమాయి
C8 సమరయ
C8 అంతిపత్రి
C8 అరిమతయియ
C9 ఎమ్మాయు
C10 యూదయ
C11 హెబ్రోను
C12 ఇదూమయ
D1 సీదోను
D2 తూరు
D3 ఫేనీకే
D4 గలిలయ
D4 కానా (Cana)
D5 సెప్పోరిస్
D5 నజరేతు
D5 నయీను
D7 సమరయ
D7 సుఖారు
D9 ఎఫ్రాయిము
D9 బేత్పగే
D9 యెరూషలేము
D9 బేతనియ
D10 బేత్లెహేము
D10 హెరోడియమ్
D10 యూదా అరణ్యము
D12 మసాదా
E4 కొరాజీను
E4 బేత్సయిదా
E4 కపెర్నహూము
E4 మగదాను
E5 తిబెరియ
E5 హిప్పో
E6 బేతనియ? (యొర్దాను నది అవతలివైపు)
E6 సిథోపోలిస్
E6 పెల్లా
E6 సలీము
E6 ఐనోను
E9 యెరికో
F1 అబిలేనే
F2 ఫిలిప్పుదైన కైసరయ
F4 గమాలా
F5 అబిలా?
F5 గదర
F7 పెరయ
F7 గెరాసా
G3 ఇతూరయ
G5 దీయోను
G6 దెకపొలి
G9 ఫిలదెల్ఫియా
H1 దమస్కు
H3 త్రకోనీతి
H4 రఫానా
H12 అరేబియా
I5 కనాతా
[పర్వతాలు]
D7 ఏబాలు కొండ
D7 గెరిజీము కొండ
F2 హెర్మోను కొండ
[సముద్రాలు]
B6 మధ్యధరా సముద్రం (మహా సముద్రం)
E4 గలిలయ సముద్రం
E10 ఉప్పు సముద్రం (మృత సముద్రం)
[నదులు]
E7 యొర్దాను నది
[నీటి ఊటలు లేదా బావులు]
D7 యాకోబు బావి
[28వ పేజీలోని చిత్రం]
గలిలయ సముద్రం. కపెర్నహూము ఎడమవైపు ముందుభాగంలో ఉంది. నైరృతిదిశలో గెన్నేసరెతు మైదానం కనిపిస్తుంది
[28వ పేజీలోని చిత్రం]
సమరయులు గెరిజీము కొండమీద ఆరాధించేవారు. వెనుకభాగంలో ఏబాలు కొండ ఉంది