కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెరూషలేము, సొలొమోను ఆలయము

యెరూషలేము, సొలొమోను ఆలయము

యెరూషలేము, సొలొమోను ఆలయము

ఆపట్టణం ‘పరిపూర్ణ సౌందర్యముగలది,’ ‘మహారాజు పట్టణం’ అని పిలువబడింది. (కీర్త 48:2; 50:2; విలా 2:​15) యెరూషలేము దేవుని జనాంగానికి రాజధానిగా ఉండేది. (కీర్త 76:⁠2) దావీదు ఆ నగరాన్ని యెబూసీయుల నుండి స్వాధీనం చేసుకొని తన రాజధానిగా చేసుకున్న తర్వాత అది ‘దావీదు పురము’ లేదా కేవలం “సీయోను” అని పిలువబడేది.​—⁠2 సమూ 5:⁠6.

యెరూషలేము రణతంత్ర స్థానంలో లేకపోయినప్పటికీ, ఆ ప్రాంతంలో దేవుడు తన నామమును ఏర్పరచుకోవడంవల్ల అది కీర్తికెక్కింది. (ద్వితీ 26:⁠2) అది ఆ జనాంగానికి మత, పరిపాలనా కేంద్రంగా ఉండేది.

యెరూషలేము సముద్ర మట్టానికి 750 మీటర్ల ఎత్తున, యూదయ మధ్యగల పర్వతప్రాంతాల్లో ఉంది. అది “యెత్తుగల చోట” ఉందని, ఆరాధకులు అక్కడకు ‘ఎక్కివెళ్తున్నారని’ బైబిలు చెబుతోంది. (కీర్త 48:2; 122:​3, 4) ఆ ప్రాచీన నగరం చుట్టూ లోయలు, వాగులు ఉండేవి: పశ్చిమవైపున, దక్షిణవైపున హిన్నోము లోయ, తూర్పున కిద్రోను వాగు ఉండేవి. (2 రాజు 23:10; యిర్మీ 31:​40) కిద్రోను వాగు దగ్గరున్న గిహోను ఊట, a దక్షిణదిక్కునున్న ఏన్‌రోగేలు ప్రత్యేకించి శత్రువులు ముట్టడివేసిన కాలంలో ఎంతో అవసరమయ్యే స్వచ్ఛమైన నీటిని అందించేవి.​—⁠2 సమూ 17:17.

ఇరవై ఒకటవ పేజీలోని చిత్రంలో దావీదు పురము ఎరుపురంగులో చూపించబడింది. దావీదు సొలొమోనుల పరిపాలనా కాలంలో ఓపెలు (ఆకుపచ్చ) మోరీయా పర్వతం (నీలం) ఆ పట్టణంలో ఒక భాగమయ్యేలా అది ఉత్తరదిక్కుకు విస్తరించింది. (2 సమూ 5:7-9; 24:​16-25) ఆ పర్వత ఉపరితలంపై సొలొమోను యెహోవాకు మహిమాన్విత దేవాలయం నిర్మించాడు. వార్షిక పండుగలకు ‘యెహోవా పర్వతమునకు’ ఆరాధకులు గుంపులు గుంపులుగా రావడం ఊహించుకోండి! (జెక 8:⁠3) 17వ పేజీలో చూపించబడిన రహదారుల వ్యవస్థ అలాంటి ప్రయాణాలకు అనువుగా ఉండేది.

బంగారంతో, అమూల్యమైన రాళ్ళతో అలంకరించబడిన సొలొమోను దేవాలయం ఇంతవరకూ నిర్మించబడిన అత్యంత ఖరీదైన భవనాల్లో ఒకటి. గమనార్హమైన విషయమేమిటంటే, యెహోవాయే దాని నిర్మాణశైలి నమూనా అందించాడు. ఇవ్వబడిన చిత్రంలో మీరు చూస్తున్నట్లుగా, ఆ దేవాలయ సమీపంలో విశాలమైన ఆవరణలు, పరిపాలనా భవనాలు ఉండేవి. దాని వివరాలు మీరు అధ్యయనం చేయడానికి తగినవి.​—⁠1 రాజు 6:1-7:51; 1 దిన 28:11-19; హెబ్రీ 9:23, 24.

[అధస్సూచి]

a హిజ్కియా రాజు ఈ ఊటను కట్టివేసి పశ్చిమ దిక్కున కోనేటికి ఒక సొరంగం నిర్మించాడు.​—⁠2 దిన 32:4, 30.

[21వ పేజీలోని బాక్సు]

కాలగమనంలో, యెరూషలేము పడమటివైపు ఉత్తరంవైపు విస్తరించింది. సొలొమోను తర్వాత వచ్చిన యూదా రాజులు ఆ నగరం చుట్టూ మరిన్ని గోడలు ద్వారాలు నిర్మించారు. ఇప్పటికీ జరుగుతున్న పురావస్తు శాస్త్ర పరిశోధన, ఆ గోడల్లోని కొన్ని భాగాలు ఖచ్చితంగా ఎక్కడ ఉండేవి, ఎంత పొడవుగా ఉండేవి అనే విషయాలను వెల్లడిచేయవచ్చు. ఆ నగరం సా.శ.పూ. 607లో నాశనం చేయబడింది, అది 70 సంవత్సరాల వరకూ అలాగే నిర్మానుష్యంగా ఉండింది. యూదులు తిరిగి వచ్చిన తర్వాత దాదాపు 80 సంవత్సరాలకు నెహెమ్యా యెరూషలేము గోడలను పునర్నిర్మించే విస్తృతమైన పనిని ప్రారంభించాడు.

[21వ పేజీలోని డయాగ్రామ్‌/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

యెరూషలేము/సొలొమోను కట్టించిన ఆలయం

సొలొమోను కాలంలో ఆలయ ప్రాంతం

ఆలయ భాగాలు

 1. అతిపరిశుద్ధ స్థలము

 2. పరిశుద్ధ స్థలము

 3. ముఖమంటపము

 4. బోయజు

 5. యాకీను

 6. ఇత్తడి బలిపీఠము

 7. పోతపనితో చేయబడిన సముద్రము

 8. ఇత్తడి స్తంభములు

 9. గదులు

10. భోజనశాలలు

11. లోపలి ఆవరణ

ఆలయ ప్రాంతం

మోరీయా పర్వతం

భోజనశాలలు

ఇత్తడి స్తంభములు

 

గదులు

అతిపరిశుద్ధ బోయజు

స్థలము పరిశుద్ధ స్థలము ముఖమంటపము ఇత్తడి లోపలి

యాకీను బలిపీఠము ఆవరణ

 

ఇత్తడి స్తంభములు పోతపనితో చేయబడిన

సముద్రము

 

ఓపెలు

వీధి?

నీటి గుమ్మము?

దావీదు పురము

సీయోను పర్వతం

దావీదు రాజభవనం

బుగ్గ గుమ్మము

మనష్షే గోడ?

హనన్యేలు గోపురము

హమ్మేయా గోపురము

గొఱ్ఱెల గుమ్మము

బందీగృహపు గుమ్మము

మిస్కాదు ద్వారము

గుఱ్ఱపు గుమ్మము

కిద్రోను వాగు

క్రింది గోడ?

గిహోను

తర్వాతి నీటి కాలువ

టైరోపియన్‌ లోయ

పెంట ద్వారము (హర్సీతు గుమ్మము)

ఏన్‌రోగేలు

పల్లపుస్థలముల గుమ్మము

హిన్నోము లోయ

మూల గుమ్మము

అగ్నిగుండముల గోపురము

వెడల్పు గోడ

ఎఫ్రాయిము గుమ్మము

వీధి

పాత గుమ్మము

తొలుత నిర్మింపబడిన ఉత్తరపు గోడ

రెండవ భాగం

మత్స్యపు గుమ్మము

[చిత్రం]

ఓపెలు

ఫరో కుమార్తె నగరు

సొలొమోను రాజభవనం

లెబానోను అరణ్యపు నగరు

స్తంభములుగల మంటపము

అధికార మంటపము

మోరీయా పర్వతం

గొప్ప ఆవరణం

ఆలయం

[20వ పేజీలోని చిత్రం]

ముందుభాగంలో కనిపించే ప్రాంతంలో “దావీదు పురము” ఉండేది. (ఆ వెనుక కనబడే) సమతల ప్రదేశంలో దేవాలయం ఉండేది

[20వ పేజీలోని చిత్రం]

ప్రాచీనకాల “దావీదు పురము,” సొలొమోను దేవాలయం యొక్క కంప్యూటర్‌ చిత్రం