‘యెహోవా న్యాయాధిపతులను పుట్టించిన కాలం’
‘యెహోవా న్యాయాధిపతులను పుట్టించిన కాలం’
యెజ్రెయేలు లోయలో, గలిలయ సముద్రానికి నైరృతిదిశలోవున్న తాబోరు కొండను (F4) మీరు మ్యాప్‌లో సులభంగా చూడవచ్చు. ఆ పర్వతంపై 10,000 మంది సైనికులు సమకూడడాన్ని దృశ్యీకరించుకోవడానికి ప్రయత్నించండి. దాదాపు 20 సంవత్సరాలపాటు ప్రజలను అణచివేసిన కనానీయుల రాజైన యాబీనుకు వ్యతిరేకంగా సైనిక దాడి చేసేందుకు ఇశ్రాయేలు ప్రజలను ఐక్యపరచడానికి యెహోవా, న్యాయాధిపతి బారాకును ప్రవక్త్రిని దెబోరాను ఉపయోగించాడు. సైన్యాధిపతి సీసెరా ఆధ్వర్యంలో, యాబీనుకు చెందిన 900 వినాశకరమైన ఇనుపరథాలు హరోషెతునుండి బయలుదేరి, మెగిద్దోకు తాబోరు కొండకు మధ్యవున్న ఎండిన కీషోను వాగు ప్రాంతానికి వచ్చాయి.
సీసెరా సైన్యాలతో పోరాడేందుకు న్యాయాధిపతి బారాకు ఇశ్రాయేలీయులను ఆ వాగు లోయకు నడిపించాడు. యెహోవా ఆ వాగులో హఠాత్తుగా వరద రప్పించి సీసెరా రథాలు కూరుకుపోయేలా చేయడం ద్వారా ఇశ్రాయేలీయులకు విజయాన్నిచ్చాడు, అది కనానీయులను భయాందోళనలకు గురిచేసింది. (న్యాయా 4:1-5:31) న్యాయాధిపతుల కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులకు అందించిన అనేక విజయాల్లో అది ఒకటి మాత్రమే.
కనానును జయించిన తర్వాత, ఆ దేశం ఇశ్రాయేలీయుల గోత్రాలకు భాగాలుగా పంచిపెట్టబడింది. లేవీయులు కాని వివిధ గోత్రాలవారు ఎక్కడ స్థిరపడ్డారో గమనించండి. చిన్న గోత్రమైన షిమ్యోనుకు యూదా ప్రాంతంలో నగరాలు ఇవ్వబడ్డాయి. యెహోషువ మరణం తర్వాత, ఆ జనాంగం ఆధ్యాత్మికంగా, నైతికంగా దిగజారిపోయింది. అప్పుడు ఇశ్రాయేలీయులు శత్రువుల చేత అణగద్రొక్కబడి “మిక్కిలి ఇబ్బంది” పడ్డారు. అప్పుడు యెహోవా కనికరంతో ప్రతిస్పందించి, నమ్మకస్థులైన, సాహసవంతులైన 12 మంది ‘న్యాయాధిపతులను వారికొరకు పుట్టించాడు,’ వారు మూడు శతాబ్దాలపాటు ఇశ్రాయేలీయులను కాపాడారు.—న్యాయా 2:15, 16, 19.
మిద్యానీయులైన 1,35,000 మంది యోధులను ఓడించేందుకు న్యాయాధిపతి గిద్యోను, ఆయుధాలు అంతగా ధరించని కేవలం 300 మంది చురుకైన మనుషులను ఉపయోగించాడు. ఆ యుద్ధభూమి గిల్బోవ పర్వతానికి మోరేకు మధ్యవుంది. తొలి విజయం తర్వాత, గిద్యోను శత్రువులను తూర్పుదిక్కున ఎడారివరకు తరిమాడు.—న్యాయా 6:1-8:32.
మనష్షే గోత్రానికి చెందిన గిలాదువాడైన యెఫ్తా, యొర్దాను తూర్పుప్రాంతంలోవున్న ఇశ్రాయేలీయుల నగరాలను క్రూరులైన అమోరీయులనుండి విడిపించాడు. ఈ విజయం సాధించేందుకు యెఫ్తా బహుశా, రామోత్గిలాదు అరోయేరులను కలిపిన రాజమార్గములో ప్రయాణించివుంటాడు.—న్యాయా 11:1-12:7.
సమ్సోను ముఖ్యంగా గాజా, అష్కెలోను చుట్టుప్రక్కల తీరప్రాంతాల్లో ఫిలిష్తీయులపై విజయం సాధించాడు. గాజా, వ్యవసాయానికి పేరుగాంచిన, బాగా నీరున్న ప్రాంతంలో ఉండేది. ఫిలిష్తీయుల పంటపొలాలను, ద్రాక్షతోటలను, ఒలీవ తోటలను తగులబెట్టడానికి సమ్సోను 300 నక్కలను ఉపయోగించాడు.—న్యాయా 15:4, 5.
బైబిలు వృత్తాంతంలో స్పష్టం చేయబడినట్లు లేదా వారి గోత్రం సూచించిన ప్రకారం, న్యాయాధిపతులు వాగ్దాన దేశమందంతటా చురుగ్గా పనిచేశారు. సంఘటనలు ఎక్కడ జరిగినప్పటికి, క్లిష్టమైన పరిస్థితుల్లోవున్న తన పశ్చాత్తప్త ప్రజలను యెహోవా ఆదుకున్నాడు.
[15వ పేజీలోని మ్యాపు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
గోత్రాలు, న్యాయాధిపతులు
న్యాయాధిపతులు
1. ఒత్నీయేలు (మనష్షే గోత్రం)
2. ఏహూదు (యూదా గోత్రం)
3. షమ్గరు (యూదా గోత్రం)
4. బారాకు (నఫ్తాలి గోత్రం)
5. గిద్యోను (ఇశ్శాఖారు గోత్రం)
6. తోలా (గాదు గోత్రం)
7. యాయీరు (మనష్షే గోత్రం)
8. యెఫ్తా (గాదు గోత్రం)
9. ఇబ్సాను (ఆషేరు గోత్రం)
10. ఏలోను (జెబూలూను గోత్రం)
11. అబ్దోను (ఎఫ్రాయిము గోత్రం)
12. సమ్సోను (యూదా గోత్రం)
గోత్రాలకు కేటాయించబడిన భూములు (ప్రచురణ చూడండి)
అక్కడక్కడ ఇవ్వబడిన మనష్షే నగరాలు
E4 దోరు
E5 మెగిద్దో
E5 తానాకు
F4 ఏన్దోరు
F5 బేత్షెయాను (బేత్షాను)
F5 ఇబ్లెయాము (గత్రిమ్మోను)
అక్కడక్కడ ఇవ్వబడిన షిమ్యోను నగరాలు
C9 షారూహెను (షరాయిము) (షిల్హిము)
C10 బేత్లెబాయోతు (బేత్బీరీ)
D8 ఎతెరు (తోకెను)
D9 సిక్లగు
D9 అయీను
D9 హజర్సూసా?
D9 ఆషాను
D9 బెయేర్షెబా
D10 హసర్షువలు
E9 ఏతాము
E9 బేత్మర్కాబోదు
E9 బెతూయేలు? (కెసీలు?)
E9 షెబ? (యేషూవ)
E10 బాలత్బెయేరు (బయలు)
E10 ఎజెము
లేవీయుల ఆశ్రయపురములు
E8 హెబ్రోను
F3 కెదెషు
F6 షెకెము
H4 గోలాను
H5 రామోత్గిలాదు
H8 బేసెరు
ప్రధాన రహదారులు
B10 వయా మారిస్
G10 రాజమార్గము
ఇశ్రాయేలు గోత్రాలు
దాను (D7)
D7 యొప్పే
E8 జొర్యా
యూదా (D9)
C8 అష్కెలోను
C9 గాజా
C9 షారూహెను (షరాయిము) (షిల్హిము)
C10 బేత్లెబాయోతు (బేత్బీరీ)
C12 అస్మోను
C12 కాదేషు
D7 యబ్నెయేలు
D8 ఎతెరు (తోకెను)
D9 సిక్లగు
D9 అయీను
D9 హజర్సూసా?
D9 ఆషాను
D9 బెయేర్షెబా
D10 హసర్షువలు
E8 లేహీ
E8 బేత్లెహేము
E8 హెబ్రోను
E9 ఏతాము
E9 బేత్మర్కాబోదు
E9 బెతూయేలు? (కెసీలు?)
E9 షెబ? (యేషూవ)
E10 బాలత్బెయేరు (బయలు)
E10 ఎజెము
F8 యెరూషలేము
ఆషేరు (E3)
E2 తూరు
E4 హరోషెతు
E4 దోరు
F1 సీదోను
మనష్షే (E5)
E6 షామీరు (షోమ్రోను)
E6 పిరాతోను
F6 షెకెము
G5 ఆబేల్మెహోలా
ఎఫ్రాయిము (E7)
E7 తిమ్నత్సెరహు
F6 తప్పూయ
F6 షిలోహు
F7 బేతేలు (లూజు)
నఫ్తాలి (F3)
F2 బేతనాతు
F3 కెదెషు
G3 హాసోరు
జెబూలూను (F4)
E4 బేత్లెహేము
ఇశ్శాఖారు (F5)
E5 మెగిద్దో
E5 కెదెషు (కిష్యోను)
E5 తానాకు
F4 ఏన్దోరు
F5 బేత్షిత్తా
F5 బేత్షెయాను (బేత్షాను)
F5 ఇబ్లెయాము (గత్రిమ్మోను)
బెన్యామీను (F7)
F7 గిల్గాలు
దాను (G2)
G2 దాను (లాయిషు)
మనష్షే (H3)
H4 గోలాను
గాదు (H6)
G6 సుక్కోతు
G6 పెనూయేలు
G6 మిస్పా (మిస్పే)
G7 యొగ్బెహ
H5 రామోత్గిలాదు
H7 రబ్బా
H7 ఆబేల్కెరామీము
రూబేను (H8)
G7 హెష్బోను
G9 అరోయేరు
H7 మిన్నీతు
H8 బేసెరు
[ఇతర ప్రదేశాలు]
I1 దమస్కు
[పర్వతాలు]
F4 తాబోరు కొండ
F4 మోరే
F5 గిల్బోవ పర్వతం
F6 ఏబాలు కొండ
F6 గెరిజీము కొండ
[సముద్రాలు]
C5 మధ్యధరా సముద్రం (మహా సముద్రం)
F9 ఉప్పు సముద్రం
G4 గలిలయ సముద్రం
[నదులు, ఏరులు]
B11 ఐగుప్తు నది
F6 యొర్దాను నది
G6 యబ్బోకు ఏటిలోయ
G9 అర్నోను ఏరు
G11 జెరెదు లోయ
[14వ పేజీలోని చిత్రం]
ఇశ్శాఖారు ప్రాంతంలోని తాబోరు కొండ యెజ్రెయేలు లోయకు పైగా కనిపిస్తుంది
[14వ పేజీలోని చిత్రం]
కీషోను వాగులో వచ్చిన వరద సీసెరా రథాలు కూరుకుపోయేలా చేసింది