కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సామ్రాజ్యాలు వాగ్దాన దేశంపై దాడి చేయడం

సామ్రాజ్యాలు వాగ్దాన దేశంపై దాడి చేయడం

సామ్రాజ్యాలు వాగ్దాన దేశంపై దాడి చేయడం

ఇశ్రాయేలు ఉత్తర రాజ్యానికి రాజధానియైన షోమ్రోనును సా.శ.పూ. 740లో అష్షూరీయులు ఆక్రమించుకున్నారు. అలా ఇశ్రాయేలీయులు ఒక క్రూరమైన సామ్రాజ్యం చేతుల్లో చిక్కుకున్నారు. అష్షూరు సామ్రాజ్యం, మెసొపొతమియ మైదానాల ఉత్తరభాగం చివరన, అర్ధచంద్రాకారంలోవున్న సారవంతమైన నేలలో ప్రవహించే పెద్ద నదుల్లో ఒకటైన టైగ్రీస్‌ నది వద్ద ఉండేది. అష్షూరులోని ముఖ్య నగరాలైన నీనెవెను, కాలహును నిమ్రోదు స్థాపించాడు. (ఆది 10:​8-12) షల్మనేసెరు III కాలంలో అష్షూరు సామ్రాజ్యం పశ్చిమ దిశకు అంటే సిరియాలోని ఉత్తర ఇశ్రాయేలులోని నీరు సమృద్ధిగావున్న ఫలవంతమైన ప్రాంతాలకు విస్తరించింది.

బైబిలులో పేర్కొనబడిన తిగ్లత్పిలేసెరు III (పూలు) రాజు పాలనలో అష్షూరు సామ్రాజ్యం ఇశ్రాయేలీయులను అణచివేయడం ప్రారంభించింది. ఆయన సైనిక చర్యలు దక్షిణవైపున ఉన్న యూదాపై కూడా ప్రభావం చూపించాయి. (2 రాజు 15:19; 16:​5-18) కొంతకాలానికి అష్షూరు సామ్రాజ్యపు ‘జలముల’ వరద యూదావరకు విస్తరించి చివరకు దాని రాజధానియైన యెరూషలేమును చేరుకుంది.​—⁠యెష 8:5-8.

అష్షూరు రాజైన సన్హెరీబు సా.శ.పూ. 732లో యూదాను ఆక్రమించుకున్నాడు. (2 రాజు 18:​13, 14) ఆయన షెఫేలాలో యుద్ధతంత్ర ప్రయుక్త ప్రాంతంలో స్థాపించబడిన లాకీషుతోపాటు 46 యూదా పట్టణాలను స్వాధీనం చేసుకొని, వాటిని దోచుకున్నాడు. మ్యాప్‌ చూపిస్తున్నట్లుగా అలా ఆయన సైన్యాలు యెరూషలేము వెనుకభాగానికి చేరుకుని యూదా రాజధానిని చుట్టుముట్టాయి. సన్హెరీబు తాను హిజ్కియాను “పంజరములో పక్షిలా” ఉంచాను అని చారిత్రక నివేదికల్లో గొప్పలు చెప్పుకున్నాడు కాని అష్షూరీయుల నివేదికలు సన్హెరీబు సైనికులను దేవదూత నాశనం చేసిందనే విషయాన్ని ప్రస్తావించవు.​—⁠2 రాజు 18:17-36; 19:35-37.

అష్షూరు సామ్రాజ్యం అంతమయ్యే కాలం దగ్గరపడింది. ఇప్పుడు ఇరాన్‌గా ఉన్న పర్వత పీఠభూమిపై నివసించిన మాదీయులు అష్షూరు సైన్యంలో మిగిలినవారిని శ్రమపెట్టడం ప్రారంభించారు. దానివల్ల అష్షూరు అవధానం పడమటి మండలాలనుండి పక్కకు మళ్ళింది, అయితే అప్పటికి అవి కూడా తిరుగుబాటు చేయడం ప్రారంభించాయి. అదే సమయంలో బబులోనీయులు మరింత బలంగా తయారయ్యి, అష్షూరు నగరాన్ని కూడా ఆక్రమించుకున్నారు. సా.శ.పూ. 632లో ‘నరహత్య పట్టణమైన’ నీనెవె, బబులోనీయులు, మాదీయులు, నల్ల సముద్రపు ఉత్తర దిక్కునున్న యుద్ధపిపాస ప్రజలైన సిథియనులు కలిసి చేసిన దాడిలో కూలిపోయింది. ఇది నహూము జెఫన్యాల ప్రవచనాలను నెరవేర్చింది.​—⁠నహూ 3:1; జెఫ 2:13.

అష్షూరు సామ్రాజ్యం హారానువద్ద తుది శ్వాస తీసుకుంది. నాశనం చేయడానికి సిద్ధపడిన బబులోనీయులు దాడి చేసినప్పుడు, అష్షూరీయులు ఐగుప్తునుండి సహాయం అందేంతవరకు ఆ దాడిని నిరోధించడానికి ప్రయత్నించారు. కాని ఫరోనెకో ఉత్తరం నుండి వస్తున్నప్పుడు మార్గంలో మెగిద్దో దగ్గర యూదా రాజైన యోషీయా అతనిని అడ్డుకున్నాడు. (2 దిన 35:​20) చివరకు నెకో హారానుకు వచ్చేసరికి చాలా ఆలస్యమైపోయింది, అప్పటికే అష్షూరు సామ్రాజ్యం కూలిపోయింది.

బబులోను సామ్రాజ్యం

“వ్రేలాడే ఉద్యానవనాలు” అనే పదబంధం వినగానే ఏ పట్టణం మదిలోకి వస్తుంది? బబులోను, అది అదే పేరున్న ప్రపంచ ఆధిపత్యానికి రాజధాని, ప్రవచనార్థకంగా రెక్కలుగల సింహంగా అది వర్ణించబడింది. (దాని 7:⁠4) ఆ పట్టణం దాని సంపదకు, వాణిజ్యానికి, మతం, జ్యోతిష్యం వృద్ధికావడానికి పేరుగాంచింది. టైగ్రీస్‌ యూఫ్రటీసు నదుల మధ్య, దక్షిణ మెసొపొతమియ చిత్తడి మైదానాల నడుమ ఆ సామ్రాజ్యం వెలసింది. ఆ పట్టణం యూఫ్రటీసుకు ఇరువైపులా వ్యాపించివుండేది, దాని ప్రాకారాలవల్ల అది దుర్భేద్యమైన పట్టణంలా కనిపించేది.

బబులోనీయులు ఉత్తర అరేబియా రాళ్ల ఎడారిగుండా వాణిజ్య రహదారులను వృద్ధిచేశారు. ఒక దశలో, నెబోనిడస్‌ రాజు బబులోను పరిపాలనను బెల్షస్సరుకు వదిలి తేమాలో నివసించాడు.

బబులోను కనానుమీద మూడుసార్లు దాడిచేసింది. సా.శ.పూ. 625లో నెబుకద్నెజరు కర్కెమీషువద్ద ఐగుప్తీయులను ఓడించిన తర్వాత, బబులోనీయులు దక్షిణదిశగా హమాతువైపు ప్రయాణించి అక్కడ నిష్క్రమిస్తున్న ఐగుప్తీయులను మళ్ళీ ఓడించారు. ఆ తర్వాత బబులోనీయులు ఐగుప్తు నది తీరం వెంబడి ప్రయాణిస్తూ మార్గంలో అష్కెలోనును నాశనం చేశారు. (2 రాజు 24:7; యిర్మీ 47:​5-7) ఈ దండయాత్రలో, యూదా బబులోను సామంత రాజ్యమయ్యింది.​—⁠2 రాజు 24:⁠1.

యూదా రాజైన యెహోయాకీము సా.శ.పూ. 618లో తిరుగుబాటు చేశాడు. అప్పుడు బబులోను, సమీప జనాంగాల సైన్యాలను యూదా మీదికి పంపించింది, బబులోను స్వంత సైన్యం యెరూషలేమును ముట్టడించి లోబరచుకుంది. ఆ తర్వాత ఎంతోకాలం గడవకముందే, సిద్కియా రాజు ఐగుప్తుతో చేతులు కలిపి బబులోను కోపం యూదాపై రగులుకునేలా చేశాడు. వారు మళ్ళీ దాడిచేసి యూదా పట్టణాలను నాశనం చేయడం ప్రారంభించారు. (యిర్మీ 34:⁠6) చివరకు నెబుకద్నెజరు తన సైన్యం దృష్టిని యెరూషలేముపైకి మళ్లించి సా.శ.పూ. 607లో దానిని నాశనం చేశాడు.​—⁠2 దిన 36:17-21; యిర్మీ 39:10.

[23వ పేజీలోని బాక్సు]

ఈ కాలంలో వ్రాయబడిన బైబిలు పుస్తకాలు:

హోషేయా

యెషయా

మీకా

సామెతలు (కొంత భాగం)

జెఫన్యా

నహూము

హబక్కూకు

విలాపవాక్యములు

ఒబద్యా

యెహెజ్కేలు

1 రాజులు, 2 రాజులు

యిర్మీయా

[23వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

బబులోనీయుల/అష్షూరీయుల సామ్రాజ్యాలు

అష్షూరు సామ్రాజ్యం

B4 మెంఫెసు (నోపు)

B4 సోయను

B5 ఐగుప్తు

C2 కుప్ర (కిత్తీము)

C3 సీదోను

C3 తూరు

C3 మెగిద్దో

C3 షోమ్రోను

C4 యెరూషలేము

C4 అష్కెలోను

C4 లాకీషు

D2 హారాను

D2 కర్కెమీషు

D2 అర్పాదు

D2 హమాతు

D3 రిబ్లా

D3 సిరియా

D3 దమస్కు

E2 గోజాను

E2 మెసొపొతమియ

F2 మిన్నీ

F2 అష్షూరు (ASSYRIA)

F2 కోర్సాబాద్‌

F2 నీనెవె

F2 కాలహు

F2 అష్షూరు (Asshur)

F3 బాబిలోనియ

F3 బబులోను

F4 కల్దీయ

F4 ఎరెకు

F4 ఊరు

G3 షూషను

G4 ఏలాము

బబులోను సామ్రాజ్యం

C3 సీదోను

C3 తూరు

C3 మెగిద్దో

C3 షోమ్రోను

C4 యెరూషలేము

C4 అష్కెలోను

C4 లాకీషు

D2 హారాను

D2 కర్కెమీషు

D2 అర్పాదు

D2 హమాతు

D3 రిబ్లా

D3 సిరియా

D3 దమస్కు

D5 తేమా

E2 గోజాను

E2 మెసొపొతమియ

E4 అరేబియా

F2 మిన్నీ

F2 అష్షూరు (ASSYRIA)

F2 కోర్సాబాద్‌

F2 నీనెవె

F2 కాలహు

F2 అష్షూరు (Asshur)

F3 బాబిలోనియ

F3 బబులోను

F4 కల్దీయ

F4 ఎరెకు

F4 ఊరు

G3 షూషను

G4 ఏలాము

[ఇతర ప్రదేశాలు]

G2 మాద్య

ముఖ్య దారులు (ప్రచురణ చూడండి)

[సముద్రాలు]

B3 మధ్యధరా సముద్రం (మహా సముద్రం)

C5 ఎర్ర సముద్రం

H1 కాస్పియన్‌ సముద్రం

H5 పర్షియా సింధుశాఖ

[నదులు]

B5 నైలు

E2 యూఫ్రటీసు

F3 టైగ్రీస్‌

[22వ పేజీలోని చిత్రం]

లాకీషు మట్టిదిబ్బ

[22వ పేజీలోని చిత్రం]

ప్రాచీనకాల మెగిద్దో నమూనా

[23వ పేజీలోని చిత్రం]

బబులోనులోని వ్రేలాడే ఉద్యానవనాల ఊహాచిత్రం