కంటెంట్‌కు వెళ్లు

మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు?

మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు?

మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు?

చాలాకాలం క్రితం యోబు అనే ఒక మనుష్యుడు “మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?” అని ప్రశ్నించాడు. (యోబు 14:14, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌) బహుశా మీరు కూడా ఈ విషయంలో ఆశ్చర్యపడియుండ వచ్చును. శ్రేష్టమైన పరిస్థితులలో ఇదే భూమిపై మీ ప్రియమైన వారిని మీరు తిరిగి కలుసుకోవటం సాధ్యమేనని మీకు తెలిస్తే, మీరు ఎలా భావిస్తారు?

అవును, బైబిలు ఇట్టి వాగ్దానాన్ని చేస్తుంది: ‘మృతులైన నీవారు బ్రదుకుదురు . . . వారు సజీవులగుదురు.’ ఇంకా బైబిలు ఇలా అంటుంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు.”—యెషయా 26:19; కీర్తన 37:29.

అలాంటి వాగ్దానములందు నిజమైన నమ్మకాన్ని కలిగి ఉండాలంటే, మనము కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానము పొందాలి. అవేమంటే: ప్రజలు ఎందుకు మరణిస్తారు? మరణించిన వారు ఎక్కడున్నారు? వారు మరలా తిరిగి జీవిస్తారని మనమెట్లు నిశ్చయత కలిగివుండగలము?

మరణము, మరియు మనము మరణించినప్పుడు సంభవించేది

మానవులు చనిపోవడాన్ని, దేవుడు మొదట సంకల్పించలేదని బైబిలు స్పష్టము చేస్తుంది. మొదటి మానవ జతయైన ఆదాము, హవ్వలను ఆయన సృష్టించిన తదుపరి వారిని ఏదెను అని పిలువబడే భూపరదైసులో ఉంచి, పిల్లలను కని తమ పరదైసు గృహమును భూవ్యాప్తముగా విస్తరింపజేయమని వారికి ఉపదేశించాడు. ఆయన ఉపదేశాలకు అవిధేయులైనప్పుడు మాత్రమే వారు మరణిస్తారు.—ఆదికాండము 1:28; 2:15-17.

దేవుని దయయెడల మెప్పులేనివారై, ఆదాము హవ్వలు అవిధేయులయ్యారు. తద్వారా వారికి విధించబడిన శిక్షకు వారు గురికావలసి వచ్చింది. ఎట్లనగా ఆదాముతో దేవుడు: “నీవు నేలకు తిరిగి చేరు”దువని సూచిస్తూ, “నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.” (ఆదికాండము 3:19) ఆదాము సృష్టించబడక మునుపు అసలు ఉనికిలోనే లేడు. ఆయన మన్నైయుండెను. తన అవిధేయత లేక పాపము మూలంగా ఆదాము తిరిగి మంటికి వెళ్లునట్లు అనగా ఉనికిలో లేకుండునట్లు శిక్షించబడెను.

ఆవిధంగా మరణమంటే జీవములేని స్థితియే. బైబిలు ఈ తారతమ్యాన్ని చూపుతుంది: “పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము . . . నిత్యజీవము.” (రోమీయులు 6:23) మరణమనేది సంపూర్ణమైన అపస్మారక స్థితియేనని చూపుతూ బైబిలు ఇలా చెబుతుంది: “బ్రతికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు.” (ప్రసంగి 9:5) ఒకవ్యక్తి మరణించినప్పుడు బైబిలు వివరించేదేమనగా: “వారి ప్రాణము వెడలిపోవును వారు మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును.”—కీర్తన 146:3, 4.

అయినను, ఏదెనులోని ఆ ఆజ్ఞకు కేవలం ఆదాము హవ్వలే అవిధేయులైనప్పుడు, మనమందరము ఎందుకు మరణించాలి? ఎందుకనగా మనమందరము ఆదాము అవిధేయుడైన తర్వాతనే జన్మించాము, కావున మనమంతా ఆయననుండి పాపమును, మరణమును స్వతంత్రించుకొన్నాము. బైబిలు వివరించునట్లు: “ఒక మనుష్యునిద్వారా [ఆదాము] పాపమును పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.”—రోమీయులు 5:12; యోబు 14:4.

అయినా, ఒకరు ఇట్లడగవచ్చును: ‘మరణము తర్వాత ఇంకనూ బ్రతికియుండే అమర్త్యమైన ఆత్మ మానవులలో లేదా?’ అనేకులు దీనినే బోధించారు. మరణము కేవలము మరో జీవితానికి ద్వారమని కూడా చెబుతుంటారు. అయితే బైబిలు అభిప్రాయము అది కాదు. బదులుగా దేవునివాక్యము నీవు ఆత్మయై ఉన్నావని, నీ ఆత్మ అంటే నిజంగా సమస్త భౌతిక మానసిక లక్షణములతోనున్న నీవే అని బోధిస్తుంది. (ఆదికాండము 2:7; యిర్మీయా 2:34; సామెతలు 2:10) ఇంకా బైబిలు ఇలా చెబుతుంది: “ఏ ఆత్మ పాపముచేయునో—ఆ ఆత్మే మరణించును.” (యెహెజ్కేలు 18:4 NW) మనుష్యుడు తన శరీర మరణము తర్వాత ఇంకను బ్రతికియుండే అమర్త్యమైన ఆత్మను కలిగియున్నాడని బైబిలు ఎక్కడనూ బోధించుటలేదు.

మానవులు తిరిగి ఎలా జీవించగలరు

పాపము మరియు మరణము లోకములో ప్రవేశించిన తరువాత, మృతులను పునరుత్థానముద్వారా తిరిగి జీవమునకు తెచ్చుట తన సంకల్పమని దేవుడు బయలుపరచాడు. అందువలన బైబిలు ఇలా వివరిస్తుంది: “అబ్రాహాము, మృతులను [తన కుమారుడైన ఇసాకును] సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచెను.” (హెబ్రీయులు 11:17-19) అబ్రాహాము నమ్మకము వృథాకాదు. ఎందుకనగా సర్వశక్తిగల దేవునిగూర్చి బైబిలు ఇలా చెబుతుంది: “ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారు.”—లూకా 20:37, 38.

అవును సర్వశక్తిగల దేవునికి శక్తేగాక, తాను ఎన్నుకొనే ప్రజలను పునరుత్థానముచేసే యిష్టత కూడా ఉంది. యేసుక్రీస్తే స్వయంగా ఇలా చెప్పాడు: “దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.”—యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:15.

ఈ మాటలు చెప్పిన కొద్దికాలానికి ఇశ్రాయేలు పట్టణమైన నాయీను నుండి చనిపోయి వెలుపలికి మోసికొనిపోబడుచున్న వ్యక్తిని యేసు ఎదుర్కొనెను. చనిపోయిన ఆ యౌవనుడు విధవరాలైన తన తల్లికి ఒక్కడే కుమారుడు. ఆమె అత్యధిక దుఃఖాన్ని చూసి యేసు జాలిపడ్డాడు. అప్పుడాయన పాడెను ముట్టి, “చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా” అతను లేచి కూర్చుండెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను.—లూకా 7:11-17.

ఆ విధవరాలి విషయంలో జరిగినట్లే, యూదా సమాజ మందిరపు అధికారియైన యాయీరు గృహమును యేసు సందర్శించినప్పుడు అత్యానందము కలిగెను. ఆయన 12-సంవత్సరాల బిడ్డ చనిపోయింది. కానీ యేసు యాయీరు గృహమునకు వచ్చి చనిపోయిన ఆ చిన్నదానియొద్దకు వెళ్లి: “చిన్నదానా లెమ్మని చెప్పగా” ఆమె లేచెను!—లూకా 8:40-56.

తదుపరి యేసు స్నేహితుడైన లాజరు మరణించాడు. యేసు ఆయన గృహమునకు వచ్చేసరికి, అప్పటికే లాజరు చనిపోయి నాలుగు దినములయ్యింది. అప్పుడు ఆయన సహోదరి మార్త బహు దుఃఖములో మునిగివున్నను, “అంత్యదినమున పునరుత్థానమందు (అతను) లేచునని యెరుగుదునని” చెబుతూ తన నిరీక్షణను వ్యక్తపరచింది. అయితే యేసు సమాధియొద్దకు వెళ్లి, రాయితీసి వేయుడని చెప్పి “లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా” అతడు బయటికి వచ్చెను!—యోహాను 11:11-44.

ఇప్పుడు దీనిని గూర్చి ఆలోచించండి: చనిపోయివున్న ఆ నాలుగు దినముల కాలంలో లాజరు పరిస్థితి ఏమిటి? పరమానందకరమైన పరలోకములో ఉండటాన్ని గూర్చియైనా, లేక బాధాకరమైన నరకములో ఉండటాన్ని గూర్చియైనా లాజరు ఏమీ చెప్పలేదు. ఆయన అక్కడే ఉండి వుంటే దాన్నిగూర్చి కచ్చితంగా చెప్పియుండేవాడే. లాజరు మరణమందు పూర్తిగా స్మారకములేని స్థితిలో ఉన్నాడు. ఒకవేళ యేసేగాని అప్పుడాయనను జీవమునకు తిరిగి తేకుంటే “అంత్యదినమున పునరుత్థాన” మయ్యేంత వరకు లాజరు అదే స్థితిలో ఉండేవాడు.

యేసు చేసిన ఈ అద్భుతములు కేవలము తాత్కాలిక ప్రయోజనమిచ్చేవేననుట సత్యమే. ఎందుకనగా, ఆయన పునరుత్థానము చేసినవారు తిరిగి మరణించారు. ఏమైనను, దేవుని శక్తిమూలంగా మృతులు తిరిగి జీవించగలరనే దాన్ని, ఆయన 1,900 సంవత్సరముల క్రితము రుజువుపరచాడు. కాబట్టి దేవుని రాజ్య ఆధ్వర్యములో భూమిపై ఏమి జరుగుతుందో యేసు తన అద్భుతములద్వారా స్వల్ప పరిమాణములో చూపించాడు.

ప్రియమైన వారు మరణించినప్పుడు

శత్రువైన మరణము సంభవించినప్పుడు, పునరుత్థానమందు మీకు నిరీక్షణ ఉన్నను మీకు దుఃఖము బహుగా కల్గుతుంది. అబ్రాహాముకు తన భార్యయైన శారా తిరిగి బ్రతుకుతుందని తెలుసు, అయినా ఆయనను గూర్చి మనము చదివేదేమనగా: “అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెనుగూర్చి యేడ్చుటకును వచ్చెను.” (ఆదికాండము 23:2) మరి యేసు విషయమేమి? లాజరు మరణించినప్పుడు ‘ఆయన కలవరపడి, ఆత్మలో మూలిగెను.’ తరువాత వెనువెంటనే ఆయన “కన్నీళ్లు విడిచెను.” (యోహాను 11:33, 35) అందువలన మీరు ప్రేమించే ఒకరు మరణించినప్పుడు ఏడవటమంటే అది బలహీనతకాదు.

ఒక బిడ్డ మరణించినప్పుడు, తల్లికి ప్రత్యేకంగా అది ఎంతో భారమైనది. బైబిలు కూడా తల్లిలో కలిగే వేదనను తెలియజేస్తుంది. (2 రాజులు 4:27) పోగొట్టుకొన్న తండ్రి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. రాజైన దావీదు తన కుమారుడైన అబ్షాలోము మరణించినప్పుడు “నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును” అని విలపించెను.—2 సమూయేలు 18:33.

అయినప్పటికి, పునరుత్థానమందు నీవు నమ్మకాన్ని కలిగియున్నందున, నీ దుఃఖము అణచుకొనలేనంతటి కర్కషమైనది కాదు. బైబిలు చెప్పునట్లు, “నిరీక్షణలేని ఇతరులవలె మీరు దుఃఖపడ”రు. (1 థెస్సలొనీకయులు 4:13) బదులుగా మీరు ప్రార్థనలో దేవునికి సన్నిహితులవుతారు. బైబిలు “ఆయన మిమ్ములను ఆదుకొనునని” ప్రమాణం చేస్తుంది.—కీర్తన 55:22.

ప్రత్యేకముగా సూచించబడని లేఖనములు బైబిలు సొసైటి ఆఫ్‌ ఇండియా బెంగుళూరు వారి తెలుగు బైబిలు నుండి వ్రాయబడినవి.