కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఐక్యంగా దేవుని మందను కాయుచున్నారు

ఐక్యంగా దేవుని మందను కాయుచున్నారు

ఐక్యంగా దేవుని మందను కాయుచున్నారు

కొందరిలా అడుగుదురు: ‘ప్రపంచ వ్యాప్తంగా వున్న యెహోవాసాక్షుల సంఘమెలా నడిపించబడుతుంది?’ దానికి మా సమాధానమిదే: వారు యీ విషయంలో మొదటి శతాబ్దంలోని క్రైస్తవ సంఘ పద్ధతినే అనుసరిస్తున్నారు.

చార్షెస్‌ టి. రస్సెల్‌ మరియు ఆయన అనుయాయులు 1870వ దశాబ్దంలో తాము చేసిన బైబిలు పఠన ఫలితాలను ప్రసంగాలద్వారా ప్రచురణలద్వారా వ్యాప్తిచేయుట కారంభించారు. దేశమంతట, యీపనిలో పాలు కల్గివుందామని ఎంచుకొనిన వారందరు, యీ రస్సెల్‌ను ఆయన అనుయాయులను ప్రభువు పనిలో అనుభవజ్ఞులుగా పరిగణించారు, మరియు వారి పనుల విషయంలో వీరి సలహాను అనుసరించారు.

పెన్సిల్వేనియా కామన్‌వెల్త్‌ చట్టాల మేరకు జాయెన్స్‌ వాచ్‌టవర్‌ ట్రాక్ట్‌ సొసైటి 1884లో స్థాపించబడింది. రస్సెల్‌ మరియు బాధ్యతగల తన అనుయాయులు యీ సొసైటీని, బైబిలు విద్యార్థుల పనులను కూడ నడిపించుటలో పూర్తి నిమగ్నులయ్యారు. వారి ప్రధాన కార్యాలయాన్ని 1909లో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌కు మార్చారు. సంవత్సరాల తరబడి వాచ్‌టవర్‌ సొసైటి డైరెక్టర్లు మరియు ఇతర సన్నిహిత సహవాసం కల్గిన ఆత్మీయార్హతగల, అభిషక్త పురుషులు యెహోవాసాక్షులకు పరిపాలక సభగా సేవ చేస్తున్నారు.

పరిపాలక సభలో, వాచ్‌టవర్‌ సొసైటి డైరెక్టర్ల బోర్డులోని 7గురు సభ్యులతో సహా అభిషక్త క్రైస్తవులైన పురుషుల గుంపు ఒకటి (1992లో 12 మంది) ఉన్నది. యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త కార్యక్రమాల మీద వీరు అధ్యక్షత వహిస్తున్నారు. వారు దేవుని చేత ప్రేరేపించబడినవారుకారు గనుక తప్పిదస్థులు కాకుండ ఉండరు గానీ భూమిపై అత్యున్నత అధికారముగా లోపంలేని దేవుని వాక్యం మీద ఆధారపడి యుంటారు, మరియు దేవుని చిత్తానికి విధేయులైయుండుటలో వారికి సుదీర్ఘ అనుభవమున్నది. వారిలో ప్రతివారు యెహోవాసాక్షులతో కలిసి దాదాపు 50 లేదా అంతకంటె అధిక సంవత్సరాలు పూర్తి కాల సేవకులుగా పరిచర్యలో పాల్గొంటున్నారు.

సొసైటి ప్రచురించే దానిని పరిపాలక సభ పర్యవేక్షిస్తుంది. వ్రాయబడిన సమాచారం మంద ఆత్మీయావసరతలను పరిశీలించిన దాని మీదను, దేవుని వాక్యాన్ని ప్రార్థనా పూర్వకంగా క్షుణ్ణంగా పఠించుట వలన కల్గిన ఫలితం మీదను ఆధారపడి యున్నది. ఈ పురుషులు బైబిలును పఠిస్తూ, దేవుని సంకల్పాలను క్రమేణి నెరవేర్చ బడుట గమనిస్తూ, లోక సంఘటనలయందు ప్రవచన నెరవేర్పును పరిశీలిస్తూ, లోకంలో దేవుని ప్రజల పరిస్థితిని తెలుసుకుంటున్నప్పుడు వారు కొన్ని బోధలను గ్రహించే విషయంలో బహిర్గతమైన వాటికనుగుణంగా సరిదిద్దుకొనవలసిన అవసరం కొన్నిసార్లు ఏర్పడవచ్చును. ఈ విధంగా సత్యమును గూర్చిన జ్ఞానము అధికంగా లభిస్తుంది.—కీర్తన 97:11; సామెతలు 4:18; దానియేలు 12:4.

పరిపాలక సభ లోకమంతట 200 కంటె ఎక్కువ దేశాల్లో, ద్వీపాల్లో జరుగు పనులను పర్యవేక్షించుటకు ఉన్నటువంటి దాదాపు 100 బ్రాంచీలలో ముగ్గురు లేక అంతకంటె ఎక్కువమంది ఆత్మీయార్హతలుగల పురుషులను నియమించింది. ఇవి వాటి పర్యవేక్షణ క్రింద నున్న సంఘాలతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ ఉంటాయి. పరిపాలక సభతో బ్రాంచి కమిటీ ఉత్తర ప్రత్త్యుత్తరాలు కలిగియుంటుంది, మరియు పరిపాలక సభ సభ్యులు స్వయంగా వాటి పరిస్థితులనుగూర్చి తెలిసికొనుటకుగాను ప్రతి ఏట అనేక బ్రాంచీలను దర్శిస్తూవుంటారు.

వీరు ఇతరుల విశ్వాసానికి ప్రభువులు కారుగానీ ఇతరులనేకమంది దేవుని వాక్యాన్ని నేర్చుకొనునట్లు పనిచేసే సేవకులైయున్నారు. వారు ఆర్థిక లాభం కొరకు ఆ పనిచేయడం లేదు గానీ ఇతర బేతేలు కుటుంబ సభ్యుల భౌతికావసరతలు తీర్చబడినట్లే వీరికి అట్టి అవసరతలు తీర్చబడును. లోకమంతటనున్న యెహోవాసాక్షులు కనబరచే ఆసక్తిని, ఐక్యతను, శ్రేష్ఠమైన నైతిక సూత్రాలకు, బైబిలు బోధలకు యథార్థతను కనబరస్తున్నందు వలన వారు నమ్మకంగా సేవ చేస్తున్నారనే దానికి రుజువును చూస్తాము.—1 కొరింథీయులు 3:5-9; 4:1, 2; 2 కొరింథీయులు 1:24; 3:1-3; 1 పేతురు 5:2, 3.

• ఎటువంటి పరిపాలనా ఏర్పాటు చేయబడింది?

• ఈనాడు పరిపాలక సభలో ఎవరున్నారు, వారి బాధ్యతలేమిటి?

• ఇతర దేశాల్లో పని ఎలా పర్యవేక్షించబడుతోంది?

[26వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

యెహోవాసాక్షులు దేవుని చిత్తాన్ని చేస్తున్న ప్రదేశాలు

[26వ పేజీలోని చిత్రం]

వాచ్‌టవర్‌ సొసైటి మాజీ అధ్యక్షులు

సి. టి. రస్సెల్‌, 1884-1916

జె. యఫ్‌. రూథర్‌ఫర్డ్‌, 1916-1942

యన్‌. హెచ్‌. నార్‌, 1942-1977

యఫ్‌. డబ్ల్యు. ఫ్రాంజ్‌, 1977-1992

[27వ పేజీలోని చిత్రం]

ప్రపంచమంతట యెహోవాసాక్షుల పనితీరును పర్యవేక్షించే దాదాపు 100 బ్రాంచీలలో ఇవి కొన్ని

కెనడా

జాంబియా

జర్మనీ

జపాన్‌

ఆస్ట్రేలియా

బ్రెజిల్‌