దేవుని మహిమార్థమై బైబిలు సాహిత్యాలను తయారు చేస్తున్నారు
దేవుని మహిమార్థమై బైబిలు సాహిత్యాలను తయారు చేస్తున్నారు
యెహోవాసాక్షులు అచ్చువేయబడిన సమాచారముద్వారా దేవుని రాజ్యాన్ని ప్రకటించుటలో ప్రసిద్ధులయ్యారు. వాచ్‌టవర్ సొసైటి 1920 నుండి సేవ నిమిత్తం పత్రికలను, పుస్తకాలను తయారుచేసి ఇతరులకు అందించుటకు సాక్షులలో నుండే స్వచ్ఛంద సేవకుల్ని వాడుకున్నది. వీలున్నంత తక్కువ ధరకే మంచి సాహిత్యాలను తయారుచేయుటకు ఇది దోహదపడింది.
షుమారు 70 సంవత్సరాలుగా సొసైటీ, మొదట బ్రూక్లిన్‌లోను తదుపరి ఇతర దేశాల్లోను బైబిల్ సాహిత్యాల తయారీని వృద్ధిపరచి విస్తరింపజేసింది. ఈ పనంతా పెరుగుతున్న స్వచ్ఛంద సేవకుల సిబ్బంది చేసినదే.
అక్షరాలను కూర్చి అచ్చువేసే దీర్ఘకాల ముద్రణా పద్ధతికి 1970వ దశాబ్దపు చివరికల్లా స్వస్తిచెప్పి, బదులుగా కంప్యూటర్‌లో సమకూర్చి, ఫోటో టైప్ సెట్టింగ్‌చేసి, ఆఫ్‌సెట్‌లో ముద్రించే విధానాన్ని అనుసరించవలసిన అవసరం ఏర్పడింది. ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే లభ్యమగు వాణిజ్య పరికరాలు కొన్ని భాషల్లో మాత్రమే ముద్రించగలవు. అయినను, అప్పటికే సొసైటీ 160 భాషల్లో సాహిత్యాలను తయారుచేస్తుంది, యింకా ఎక్కువ అవసరమై యుండెను.
గనుక ఒక మల్టీలాంగ్వేజ్ ఎలక్ట్రానిక్ ఫోటోటైప్ సెట్టింగ్ సిస్టమ్‌ను తయారుచేయడానికి స్వచ్ఛంద సేవకులను ఆహ్వానించారు. ఫలితాలు అమోఘంగా వుండెను. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించి, సమాచారాన్ని ఎక్కించి, సమకూర్చి, ఫొటోటైప్‌సెట్టింగ్ చేసే ఒక విధానాన్నిఅంటే మెప్స్ అనేదాన్ని తయారుచేశారు. ఇది 210 కంటె ఎక్కువ భాషలతో పనిచేయగలదు. దీనికి ఇంకా అధికభాషలు చేర్చవచ్చును.
ఈనాడు 100 కంటె ఎక్కువదేశాలలో అనువదించబడిన సమాచారాన్ని యీ మెప్స్ పద్ధతిద్వారా ముద్రణకు సిద్ధంచేస్తున్నారు, వాటిని ఇంకను ఎక్కువ చేయాలనుకుంటున్నారు. ఈ దేశాలనుండి స్వచ్ఛంద సేవకులు యీ యంత్రాలను నడిపించి భద్రపరచగల్గునట్లు వారికి తర్ఫీదివ్వబడుతోంది. సొసైటీ యిప్పుడు 33 దేశాల్లో 112 కంటె ఎక్కువ భాషల్లో పత్రికలను ముద్రిస్తుంది, మరియు వీటిలోని 8 దేశాల్లో బైబిల్లు, బౌండ్ పుస్తకాలు కూడ తయారౌతున్నవి.
ఈ పనిచేయడానికి ప్రజలు కావాలి, అంటే రచయితలు, అనువాదకులు, ప్రూఫ్‌రీడర్లు, ముద్రించేవారు, బుక్‌బైండింగ్ చేసేవారు మరియు రవాణా చేసేపనివారు అవసరం. ఇతరులు సంఘాలతో ఉత్తర
ప్రత్యుత్తరాలు నడపవలసివుంటుంది. మరికొందరు ఆహారోత్పత్తిచేయుట, భోజనం తయారుచేయుట, శుభ్రం చేయుట, బట్టలుతుకుట వంటి పనులను చేయాలి. వివిధ దేశాల్లో అందుబాటులోవున్న స్వచ్ఛంద సేవకులే యీ పనియంతా చేస్తున్నారు. మరియు 1992లో ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫార్మ్‌లు, హోమ్‌లు, ఫ్యాక్టరీలలో మరియు కార్యాలయాలలో 13,000 మంది స్వచ్ఛంద సేవకులు పనిచేస్తూ ఉండిరి.ఎవరీ ప్రజలు? వారంతా యెహోవాకు సమర్పించుకున్న స్త్రీ పురుషులు, వివాహ, అవివాహితులు, యౌవ్వనులు, వృద్ధులు. వారిలో కొందరు 40, 50, ఇంకా 60 సంవత్సరాల నుండి కూడ యీ పనిచేస్తున్నారు. వారు వారానికి సగటున 44 గంటలు పనిచేస్తారు, అవసరమైనప్పుడు అదనపు సమయము పనిచేస్తారు. సాయంకాలములోను, వారాంతములోను ఇంటింటి సువార్త ప్రకటించుటకును సంఘంలోని ఇతర కార్యక్రమాలను చూచుకొనుటకు కేటాయించుకుంటారు.
ప్రపంచమంతటవున్న యీ సేవకులకు బేతేలు హోమ్‌లు అని పిలువబడే సొసైటి వసతిగృహాలలో మంచి భోజన వసతి సదుపాయాలు ఏర్పాటు చేయబడుచున్నవి. అదియునుగాక వారి పరిచర్యలో ప్రయాణ ఖర్చుల నిమిత్తం కొంత అలవెన్సు వ్యక్తిగత అవసరాలకొరకు కొంచెం డబ్బు వారికి యివ్వబడుతుంది.
ఈ స్వచ్ఛంద సేవకులు 1920 నుండి ప్రపంచ వ్యాప్తంగా పంచిపెట్టుటకై 200 కంటె ఎక్కువ భాషలలో తొమ్మిది వందల కోట్ల కంటె అధికంగా బైబిల్లు, పుస్తకాలు, పత్రికలు, కరపత్రాలను తయారుచేశారు. ప్రతి జనము, ప్రజ, జాతి, భాషలవారికి నిత్య సువార్తను సంతోషకరమైన సువార్తగా ప్రకటించ బడుచున్నట్లు వారి వంతును వారు చేస్తున్నారు.—ప్రకటన 14:6, 7.
• వాచ్‌టవర్ సొసైటికి ఎటువంటి ముద్రణా ఏర్పాట్లున్నవి, ఎందుకు?
• ఈ పనినంతటిని ఎవరు చేస్తున్నారు, మరి వారెలా జీవిస్తున్నారు?
[24వ పేజీలోని చిత్రం]
అమెరికాలోని బ్రూక్లిన్ వాల్‌కిల్ నందున్న హోమ్, కార్యాలయం మరియు ఫ్యాక్టరీలలో బైబిలు సాహిత్యాన్ని తయారు చేస్తున్నవారు, ఫాంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవకులు
[25వ పేజీలోని చిత్రం]
బైబిలును, బైబిలు సాహిత్యాలను తయారు చేయుటలో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో పాల్గొంటూ వివిధ పనులు చేస్తున్న స్వచ్ఛంద సేవకులు
స్పెయిన్
జర్మనీ
ఫిన్‌లాండ్
కెనడా
డెన్మార్క్
స్వీడన్
దక్షిణాఫ్రికా
బ్రెజిల్
నెదర్లాండ్స్
ఆస్ట్రేలియా