కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యాన్ని ప్రకటించుటకు సంఘాలు సంస్థీకరించబడినవి

దేవుని రాజ్యాన్ని ప్రకటించుటకు సంఘాలు సంస్థీకరించబడినవి

దేవుని రాజ్యాన్ని ప్రకటించుటకు సంఘాలు సంస్థీకరించబడినవి

యేసు క్రీస్తు భూమిమీద వున్నపుడు ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి వెళ్లి దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. ఆయన తన శిష్యులకు కూడ తర్ఫీదు నిచ్చి అదే పని చేయుటకు పంపించాడు. ఆయన పరలోకానికి ఆరోహణం కాకముందు సమస్త జనులను శిష్యులనుగా చేయవలెనని తన అనుచరుల కాజ్ఞాపించాడు. స్థాపించబడినప్పటినుండే క్రైస్తవసంఘం సువార్త ప్రకటించుటకు సంస్థీకరించబడింది. శిష్యులు వెళ్లిన ప్రతిచోట దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూనేవుండిరి.—మత్తయి 4:17, 23; 10:1-16; 28:19, 20; లూకా 4:43, 44; 8:1; 10:1-9; అపొ. కార్యములు 1:8; 4:31; 5:42; 8:12; 19:8; 28:23, 30, 31; రోమీయులు 10:9, 10, 14.

ఈ విధానాంతాన్ని గూర్చి యేసు చెప్పిన ప్రవచనంలో ఆయన ఇలా అన్నాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతర్వాత అంతము వచ్చును.” ఈ ప్రకటించుపని ఈనాటి క్రైస్తవ సంఘము యొక్క ప్రథమ బాధ్యతై యున్నది.—మత్తయి 24:14; మార్కు 13:10.

లోకమంతట, యెహోవాసాక్షుల సంఘాలన్ని, దేవుని రాజ్య సువార్తను వాటి స్థానిక ప్రాంతంలో క్రమబద్ధంగా ప్రకటించుటకు సంస్థీకరించబడియున్నవి. ఓ క్రమమైన పద్ధతిలో ప్రకటించు పని జరుగులాగున, ప్రతి దేశములోవున్న వాచ్‌టవర్‌ సొసైటీ బ్రాంచి కార్యాలయం, ప్రతి సంఘానికి ప్రకటించుట కొరకు ఓ ప్రాంతాన్ని నిర్దేశించి యిస్తుంది. సంఘం తన కివ్వబడిన ప్రాంతాన్ని చిన్న చిన్న భాగాలుచేసి అక్కడి ప్రజలను కలుసుకొని ప్రకటించే బాధ్యతను తీసుకొను వ్యక్తులకు వాటిని అప్పగిస్తుంది.—1 కొరింథీయులు 14:33, 40.

సాక్షులు సాధారణంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటారు. యెహోవాసాక్షులు, వారి కూటములలో బైబిలునుపయోగించి రాజ్య సువార్తను ఇంటింట ఎలా క్లుప్త ప్రసంగాల ద్వారా తెలియజేయవలెనో తర్ఫీదును పొందుచున్నారు. దేవుని వాక్యములో అధిక జ్ఞానము పొందగోరు వారికి అందించుట కొరకు యెహోవాసాక్షులు బైబిలు సాహిత్యములను వారితోపాటు తీసుకెళ్తారు.

ఆ ప్రాంతములోనున్న ప్రతివారు యీ ప్రాముఖ్యమైన రాజ్య సువార్తను వినే అవకాశమిచ్చుటకుగాను, ఎవరు యింటి వద్దలేరో లేక ఎవరికి సరిగ్గా సాక్ష్యము వినడానికి వీల్లేక పోయినదో అట్టివారిని గూర్చిన వివరములు తెలియజేయు, ఒక రికార్డును వ్రాసుకొని సాక్షులు దగ్గరవుంచుకుంటారు. వారిని మరోసారి దర్శిస్తారు. ఆసక్తివుందని గమనించబడిన వారి దగ్గరికి సాక్షులు తిరిగివెళ్లి, వారికి ఆత్మీయ విషయాలను గూర్చి యింకా అధిక లేఖనాధారమైన సమాచారమును అందిస్తారు. ఇష్టమైతే క్రమంగా బైబిలు పఠనం చేస్తారు, ఇదంతా ఉచితంగానే చేయబడుతుంది.

యెహోవాసాక్షులు వీధుల్లో వెళ్లేవారికి కూడ పత్రికలందిస్తారు. ఈ విధంగా వారు ఇండ్ల దగ్గర కనుగొనని వారిని కలుసుకోగలుగుతారు. వినే ప్రతివారిని కలుసు కొనుటకు నిజమైన ప్రయత్నం జరుగుతుంది.—అపొ. కార్యములు 17:17; ప్రకటన 14:6, 7; 22:17.

అనేకులు ఎటువంటి ఆసక్తిని చూపక పోయినప్పటికి సాక్షులెందుకు యింకా వారిని కలుసుకుంటునేవుంటారు? వ్యక్తుల పరిస్థితి మారవచ్చు మరియు మరోసారి దర్శించినపుడు వారు చక్కగా స్పందించవచ్చు, లేదా ఆ ఇంట్లో ఆసక్తి కనబరచే మరోవ్యక్తిని కలుసుకోవచ్చుననే విషయాన్ని కనుగొన్నారు.

యేసు తన శిష్యులకు యిలా చెప్పాడు: “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి.” మనం రాజ్యాన్ని మొదట వెదకుటలో దేవుని రాజ్యాన్నిగూర్చి ప్రకటించుటనేది ప్రముఖ స్థానాన్ని వహిస్తుంది. మరి యెహోవాసాక్షులు వారి జీవితాల్లో దీనిని చాలా ప్రాముఖ్యమైనదిగా పరిగణిస్తారు.—మత్తయి 6:33; 2 తిమోతి 4:2.

• యేసు మరియు తొలిక్రైస్తవులు చేసిన ఏపని మన కాలములో కూడ జరుగవలెనని ప్రవచింపబడింది?

• యెహోవాసాక్షుల ప్రకటించే పని ఎట్లు సంస్థీకరించ బడియున్నది?

• అనేకులు ఆసక్తి కనబరచకపోయినను సాక్షులెందుకు ప్రజలను కలుసుకుంటూనే వుంటారు?

[16, 17వ పేజీలోని చిత్రం]

యెహోవాసాక్షులు వివిధ దేశములలో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటిస్తున్నారు

థాయ్‌లాండ్‌

మెక్సికో

నెదర్లాండ్స్‌

కొరియా

కురసోవ్‌

ఘానా

బ్రిటన్‌

ఆస్ట్రేలియా