కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నీతి నిమిత్తం హింసింపబడుచున్నారు

నీతి నిమిత్తం హింసింపబడుచున్నారు

నీతి నిమిత్తం హింసింపబడుచున్నారు

యెహోవాసాక్షులు చట్టం వలన కష్టాల్లో చిక్కుకున్నారని, కొన్ని ప్రభుత్వాలు వారిని నిషేధించాయని, లేదా మరోవిధంగానైనా వారు చెడ్డ ప్రజలేనని నీ బంధువులు, స్నేహితులద్వారా నీవు వింటూవుండవచ్చు. వారికి విరుద్ధంగా ఎందుకిలా మాట్లాడుచున్నారు?

సాక్షులు చట్టాన్ని అగౌరవపర్చుచున్నందుకు కాదుగానీ వారు యేసు అడుగు జాడల్లో నడుచుకుంటున్నందువల్లనే వారిని గూర్చి అలా మాట్లాడుచున్నారు. యేసు తన శిష్యులతో, మనుష్యులు వారిని నిందించి, హింసించి, వారిని గూర్చి అబద్ధాలతో కూడిన చెడ్డ మాటలు పలుకుతారని చెప్పాడు. దీనికి కారణం దేవుని ముఖ్య విరోధియైన సాతాను యీ లోకానికి దేవుడైయున్నాడు, ప్రజలు దేవున్ని సేవించకుండ మరల్చవలెనని అతడు కోరుతున్నాడు.—మత్తయి 5:10-12; 10:16-22; 34-39; 24:9, 10; యోహాను 15:17–16:3; 2 తిమోతి 3:12; 1 పేతురు 5:8; ప్రకటన 12:17.

అపొస్తలులు నేరస్థులలో, హింసాప్రవృత్తి గలవారో లేక దేశ ద్రోహులో అయినందువల్ల నిర్భంధించబడి న్యాయస్థానానికి తీసికొనిపోబడలేదు. సువార్త ప్రకటించినందుకే వారలా తీసికొనిపోబడిరి. సువార్త ప్రకటించుటకు క్రైస్తవుని హక్కును పరిరక్షించుకొని చట్టబద్ధంగా స్థిరపరచుటకే అపొస్తలుడైన పౌలు తన కేసును ఉన్నత న్యాయస్థానాలకు అప్పీలు చేసుకున్నాడు.—అపొ. కార్యములు 4:18-20; 5:28-32; ఫిలిప్పీయులు 1:7.

ఈనాడు, యెహోవాసాక్షులు చట్టాన్ని పాటించే క్రైస్తవులై యుండి పన్నులు చెల్లిస్తూ, అధికారుల యెడల గౌరవం చూపిస్తున్నారు. వారు దేవునివి దేవునికి, కైసరువి కైసరుకు చెల్లిస్తున్నారు. వారి ప్రచారపు పనిని ప్రభుత్వం ఆమోదించక పోయినందువల్ల లేక దేశాల మధ్యగల వైషమ్యాల విషయంలో వారు తటస్థంగా వున్నందువల్లనే వారు ప్రభుత్వాధికారంతో విభేదం కల్గివుంటారు. అయితే యీ విషయంలో వారు అపొస్తలులవంటి స్థానమే తీసుకుంటారు, వారిలా అన్నారు: “మేము మనుష్యులకు కాదు దేవునికే లోబడవలెనుగదా.”—అపొ. కార్యములు 5:29; మార్కు 12:17; యోహాను 18:36; తీతు 3:1, 2.

యెహోవాసాక్షులు హింసింపబడాలని కోరుకోవడం లేదుగానీ నెమ్మది, ప్రశాంతతగల జీవితాన్ని గడపాలని ఆశిస్తారు. అయినను దేవుని చట్టాన్ని యేసుక్రీస్తు మాదిరిని అనుసరిస్తూవున్నందున వారు హింసింపబడినట్లయితే అప్పుడు దాన్ని వారు సంతోషంగా సహిస్తారు.—మత్తయి 5:10-12; అపొ. కార్యములు 5:40, 41; 1 కొరింథీయులు 4:12; 1 తిమోతి 2:2; 1 పేతురు 3:14, 15; 4:12-16.

• యెహోవా సేవకులెందుకు నిందింపబడి హింసింపబడుచున్నారు?

• క్రైస్తవ అపొస్తలులవలె యెహోవాసాక్షులెందుకు కొన్నిసార్లు ప్రభుత్వాధికారములతో విభేదం కల్గివుంటారు?

• యెహోవా సేవకులు హింస నెట్లు పరిగణిస్తారు?

[29వ పేజీలోని చిత్రం]

దేవుని రాజ్యసువార్త ప్రకటించినందుకే యేసు పిలాతునొద్దకు తీసుకొనిపోబడెను, అపొస్తలుడైన పౌలు జైల్లో వేయబడెను