కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పూర్తికాల సేవకులు ప్రకటించు పనిలో ముందున్నారు

పూర్తికాల సేవకులు ప్రకటించు పనిలో ముందున్నారు

పూర్తికాల సేవకులు ప్రకటించు పనిలో ముందున్నారు

బహుశా నిన్ను కలిసిన యెహోవా సాక్షులలో మొదటి వ్యక్తి ఒక పయినీరైనా లేక మిషనరీయైనా అయివుంటాడు. యెహోవాసాక్షులలో జీతం కొరకు సేవచేసే వారెవరూ లేరు కాబట్టి వీరెలా పూర్తికాల సేవకులుగా పనిచేయగల్గుతున్నారని నీవు ఆశ్చర్యపడియుందువేమో.

సమర్పించుకొని బాప్తిస్మము పొందిన యెహోవాసాక్షులంతా సేవకులే గానీ వారిలో ఎక్కువమందికి కుటుంబ సంబంధమైన లేదా ఇతరత్రా బాధ్యతలున్నందువల్ల సేవకొరకు వారంలో అధిక సమయాన్ని వారు వ్యయపరచ లేకపోతున్నారు. అయినను, ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది సాక్షులు వారి జీవన స్థాయిని తగ్గించుకొని, పనులు చేసుకుంటూ, తద్వారా ఖర్చులు భరిస్తూ సేవ నిమిత్తం సంవత్సరానికి 1,000 గంటలు గడుపుతారు.

నిజమే, పూర్తికాల సేవకులు వారికొరకు ఖర్చు పెట్టుకోవడానికి ఎక్కువ డబ్బేమి లేదు గానీ దేవుని రాజ్యాన్ని మొదట వెదకుటకు వారికిదొక మార్గమైయున్నది. వారు అనేక ఆశీర్వాదములు కూడ పొందుచున్నారు. దేవుని వాక్యాన్ని గూర్చి ఇతరులతో నెలకు ఒక 90 గంటల సేపు మాట్లాడగల్గుటలోనే ఒక శ్రేష్ఠమైన అనుభూతి ఉన్నది. పూర్తికాల సేవకుడు సేవలో తన నైపుణ్యాన్ని పెంచుకుంటాడు, మరి ఆసక్తిచూపిన వారిని వెంటనే కలిసికొనే సమయం కూడ అతనికి దొరుకుతుంది. ఇది ఎంతో ప్రోత్సాహకరమగు ఫలితాలిస్తుంది. వస్తురూపకంగా వారికేమికావాలో అది వారికున్నది, మరి తాము కలిగియున్నవాటి నెంతగానో అభినందిస్తారు.—మత్తయి 6:33.

వాచ్‌టవర్‌ సొసైటీ ఫిబ్రవరి, 1943లో వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ అనేదాన్ని స్థాపించింది. విదేశాలలో సేవచేయుటకుగాను అనుభవజ్ఞులైన పూర్తికాల పయినీర్‌ సేవకులకు తర్ఫీదునిచ్చుటే దాన్ని స్థాపించుటలో గల ఉద్దేశం. అందులోవున్న ఐదు నెలల కోర్సులో బైబిలును, బైబిలుచరిత్రను, యెహోవా సంస్థను, మరియు విదేశ సేవకొరకు సిద్ధపడుటను గూర్చిన సంబంధింత అంశాలను సంగ్రహముగా పఠించుట యిమిడివుంది.

మిషనరీ సేవకు నియమించబడిన స్థలానికి వెళ్లుటకు సొసైటి వారికి ప్రయాణ ఖర్చులిస్తుంది. ఆరోగ్యకరమగు భోజనాలను, హోమ్‌లో తగినంత వసతి సౌకర్యాలను ఏర్పాటుచేస్తుంది. ప్రతి మిషనరీకి స్వంత ఖర్చు నిమిత్తం కొంత అలవెన్సుకూడ ఇస్తుంది. హోమ్‌ను నడుపుటకు మిషనరీలు వంతులవారిగా వంటపని, శుభ్రం చేసేపని, కొనుగోలు పని చేస్తుంటారు. యుక్తమైన యీ పనులను చేస్తూ వారు ఇంటింటి సేవలోను, ఆసక్తిగల ప్రజలకు బైబిలు పఠనాలు చేయుటలోను నెలకు 140 గంటలు గడుపుతారు.

అనేకమంది మిషనరీలు వారి ఇంటికి, కుటుంబానికి వేల మైళ్ల దూరమున్న ప్రాంతాలకు నియమించబడుచున్నారు. వారు, తమ జీవనానికి, సంస్కృతులకు భిన్నంగా వున్నవాటికి, అక్కడి తిండికి, వాతావరణానికి, మరోభాష మాట్లాడటానికి అలవాటు పడవలసి వస్తుంది. వారీ పని ఎందుకు చేస్తున్నారంటే వారు ప్రజలను ప్రేమిస్తున్నారు, మరియు దేవుని రాజ్యాన్ని గూర్చి వారు నేర్చుకొనుటకు సహాయపడాలని వీరి అభీష్టమైయున్నది.

వాచ్‌టవర్‌ సొసైటి ఆఫ్‌ గిలియడ్‌ 1943 నుండి 1992 మధ్యలో 93 క్లాసులను నిర్వహించి 6,500 మిషనరీలను విదేశాలకు పంపింది. వీరు సొసైటీ ఆధ్వర్యం క్రింద ఆఫ్రికా, మధ్య మరియు దక్షిణమెరికా, తూర్పుదేశాల్లో, దక్షిణ పసిఫిక్‌ ప్రాంతాల్లో బైబిల్‌ విద్యాకార్యక్రమ విస్తరణకు ముందునడిచారు మరియు ఐరోపాలో వారెంతో అభివృద్ధి సాధించారు.

యెహోవాసాక్షులు పయినీర్‌లుగా కానీ, మిషనరీలుగా కానీ, స్వల్పవ్యవధి సేవకులుగా కానీ సేవలో పాల్గొంటే వారు ఆర్థిక లాభాన్ని ఆశించకుండానే సేవచేస్తున్నారు. తమ సమయాన్ని డబ్బును వ్యయపరచి స్వయంగా వారే నిత్యజీవానికి నడుపు జ్ఞానాన్ని యితరులు పొందులాగున వారికి సహాయం చేస్తున్నారు.—యోహాను 17:3.

• యెహోవాసాక్షులలో కొందరెట్లు పూర్తికాలసేవకులుగా సేవచేయగల్గుచున్నారు, మరి వారెందుకాపని చేస్తున్నారు?

• సేవకులెట్లు మిషనరీ పని కొరకు తర్ఫీదు పొందుచున్నారు?

• మిషనరీలకు వారి విదేశీ సేవ నియామకము విషయంలో ఎలా మద్దతు ఇవ్వబడుతుంది?

[22వ పేజీలోని చిత్రం]

ఎడమ: గిలియడ్‌ స్కూల్‌ క్లాస్‌రూమ్‌, బ్రూక్లిన్‌, న్యూయార్క్‌, అమెరికా

కుడి: పాపువా న్యూగినిలో ఓ మిషనరీ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు

[23వ పేజీలోని చిత్రం]

పయినీరు సేవకులు, మిషనరీలు వివిధ దేశాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు

బ్రెజిల్‌

డొమినికన్‌ రిపబ్లిక్‌

స్పెయిన్‌

సీయార్రాలియోన్‌, ఆఫ్రికా