కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రయాణ కాపరులు—సత్యమందు జతపనివారు

ప్రయాణ కాపరులు—సత్యమందు జతపనివారు

ప్రయాణ కాపరులు—సత్యమందు జతపనివారు

మొదటి శతాబ్దంలోని క్రైస్తవ సంఘంలో, సంఘములను దర్శించి బలపరచు ప్రయాణ కాపరులుండేవారు. వారు స్వలాభాన్ని అపేక్షించక సంఘస్థులు దేవునికి యోగ్యులైనవారిగా నడుచుకొనుచునే వుండునట్లు వారికి సహాయం చేసే సంకల్పముతోనే తమనుతాము ఆ పని కొరకు అప్పగించుకొనిరి.—అపొ. కార్యములు 11:23, 24; 14: 21, 22; 15:32; 20:2, 31-35; ఫిలిప్పీయులు 2:20-22, 29; 1 థెస్సలొనీకయులు 2:5-12.

ఈనాడు యెహోవాసాక్షుల సంఘస్థులు కూడ ప్రయాణ కాపరుల వల్ల ప్రయోజనం పొందుచున్నారు. యెహోవాసాక్షుల ప్రకటన పనులలోను, అధ్యక్షులుగాను ఈ పురుషులకు అనేక సంవత్సరాల అనుభవమున్నది. వారు ఇంటి బాధ్యతలు, ఉద్యోగ పనులేవి లేకుండా తమను తాముగా స్వతంత్రులుగా చేసుకొని పూర్తికాల సేవ కొరకు సమర్పించుకున్నారు. వివాహమైన వారి విషయంలోనైతే వారి భర్తలతోపాటు భార్యలుకూడ పరిచర్యలో సాధారణంగా పాల్గొంటునేవున్నారు.

ఓ ప్రాంతీయ కాపరికి 18 నుండి 25 సంఘాల వరకు ఇవ్వబడతాయి. ఆ ప్రాంతంలోని సంఘాలను సంవత్సరానికి రెండుసార్లు ఆయన సందర్శిస్తాడు, ఆ పిదప రెండు లేక మూడు సంవత్సరాలకు మరో ప్రాంతానికి నియమించబడతాడు. ఈ విధంగా సంఘాలు వివిధ ప్రాంతీయ కాపరుల విభిన్న అనుభవాలు సామర్థ్యముల మూలంగా ప్రయోజనం పొందగలవు.

ప్రాంతీయ కాపరి సంఘ ఆత్మీయ స్థితిని దాని పరిచర్యను పరిశీలిస్తాడు. ఆయన సంఘాన్ని ఉద్దేశించి అనేక ప్రసంగాలిస్తాడు. పెద్దలు, పరిచారకులు సంఘానికి చేసే సేవనెలా మెరుగు పరచుకొనవలెనో పరిశీలించుటకు వారితో కూడ కలుసుకొని మాట్లాడతాడు.

వివాహమైన వ్యక్తియైతే, తన భార్యతో కలిసి ఆయన స్థానిక సాక్షులతో సేవకు వెళ్లి, ఇంటింటి సేవలోను అభివృద్ధి చేసికొనునట్లు వారికి సహాయపడతాడు. ఆయన తన భార్యతోపాటు, ఆసక్తిగల క్రొత్తవారిని విశ్వాసమందు బలపరచుటకు వారిని సందర్శిస్తాడు. అలా నిన్నూ సందర్శించవలెనని నీవు కోరవచ్చును.

జిల్లాకాపరి కూడ అటువంటి ఆత్మీయ అర్హతలు, అనుభవం కల్గియున్నవాడే. ఆయన ఒక సర్క్యూట్‌ నుండి మరొక సర్క్యూట్‌కు ప్రయాణిస్తాడు. ప్రాంతీయ సమావేశాలకు సంబంధించి ప్రతివారం సహాయం చేస్తూంటాడు. ఆ సర్క్యూట్‌లో వున్న ఒకానొక సంఘములోని సాక్షులతోపాటు ఆయన తన భార్యతో కలిసి ప్రాంతీయసేవలో పాల్గొంటాడు. ప్రాంతీయ సమావేశ కార్యక్రమపు తుదిమెరుగులను పర్యవేక్షిస్తాడు, ఆ సమావేశంలో బహిరంగ ప్రసంగంతో పాటు అనేక ఇతర ప్రసంగాలిస్తాడు.

ఈ ప్రయాణ కాపరులు ఒక సంఘంలో లేక సర్క్యూట్‌లో వారి సందర్శనాన్ని ముగించిన తర్వాత మరో సంఘాన్ని దర్శిస్తూ అలా అన్ని సంఘాలను లేక సర్క్యూట్లను షుమారు ఆరు నెలల్లో పూర్తి చేసిన తర్వాత, మరల అదే పద్ధతి పాటిస్తారు.

ఈ ప్రయాణ కాపరులు కారులో ప్రయాణిస్తారు లేదా ప్రజా రవాణానుపయోగిస్తారు. మరికొన్ని దేశాలలో వారు సైకిల్‌ను వాడవచ్చు లేదా నడిచే వెళ్తారు. సొసైటీ, ప్రయాణ కాపరుల ప్రయాణ ఖర్చులను భరిస్తుంది, వారి వ్యక్తిగత అవసరాల నిమిత్తం భార్యాభర్తలిద్దరికి కొంచెం అలవెన్సుకూడ ఇస్తుంది. సర్వసాధారణంగా సంఘస్థులు యీ ప్రయాణ కాపరికి ఆయన భార్యకు భోజన వసతులు ఏర్పాటు చేస్తారు.

ఇటువంటి సేవకు స్వయం త్యాగ బుద్ధి అవసరం. ప్రయాణ కాపరులు వారి భార్యలు, సంఘాలమీద అధిక భారం మోపకుండ వారికి సేవ చేయుటకు నిశ్చయించుకున్నారు.—1 థెస్సలొనీకయులు 2:9.

• మొదటి శతాబ్ద క్రైస్తవ సంఘంలో ప్రయాణ కాపరుల ఉద్దేశమేమై యుండెను?

• ప్రయాణ కాపరులీనాడు యీ పరిచర్య కొరకు ఎలా అర్హులై అందుబాటులో వున్నారు?

• ప్రాంతీయ, జిల్లా కాపరుల సేవను, వారి జీవన విధానాన్ని వివరించండి.

[20వ పేజీలోని చిత్రం]

జిల్లాకాపరి ప్రాంతీయ సమావేశంలో ప్రసంగిస్తున్నాడు

[21వ పేజీలోని చిత్రం]

ఇంటింటి సేవలో ప్రకటించుటను గూర్చి ప్రాంతీయ కాపరి ఉపదేశమిస్తాడు, సంఘ పెద్దలతో మాట్లాడతాడు, ఆసక్తిగల క్రొత్తవారితో చేసే బైబిలు పఠనములను సందర్శిస్తాడు, సంఘాన్ని ఉద్దేశించి ప్రసంగాలిస్తాడు