కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రేమ, ఐక్యతలలో పెంపొందజేయుటకు సంఘాలు

ప్రేమ, ఐక్యతలలో పెంపొందజేయుటకు సంఘాలు

ప్రేమ, ఐక్యతలలో పెంపొందజేయుటకు సంఘాలు

నీవు నివసిస్తున్న ప్రాంతానికి దగ్గర్లోగల యెహోవాసాక్షుల సంఘకూటములకు నీవు హాజరైయుండ వచ్చును. అన్నిరకాల ప్రజలు—కుటుంబాలు, ఒంటరి వారు, వృద్ధులు యౌవనులు—అందరూ అక్కడ వుండిరి. ఆరాధనలో వారంతా ఏకమైయుండిరి మరియు ఇతరులకు సహాయం చేయుటకు ఆసక్తి కలిగి యుండిరి.

ఎక్కడైనా సరే, అనేకమంది ప్రజలు ఐక్యతతో పనిచేయాలనుకుంటే అక్కడ ఏదో కొంత పర్యవేక్షణ అవసరమైవుంటుంది. దేవుడు ఓ క్రమ పద్ధతిగల దేవుడు; గనుక తన ప్రజలున్న సంఘంలో అట్టి క్రమపద్ధతి ప్రతిబింబించాలి. మొదటి శతాబ్దంలోవలె యీనాడు అర్హతగల, పరిణతిచెందిన, అనుభవజ్ఞులైన క్రైస్తవ పురుషులు పెద్దలుగా లేక అధ్యక్షులుగా నియమించబడుతున్నారు. వీరు సంఘాన్ని పర్యవేక్షించి, దాని ఆత్మీయావసరతలను తీర్చుతూ వుంటారు. పరిచారకులనబడే నమ్మకస్థులైన పురుషులు వారికి సహాయము చేస్తారు. వీరు జీతభత్యాలేమి పుచ్చుకోరుగానీ స్వచ్ఛందంగా సేవచేస్తూ, వారి ఉద్యోగాల నుండి వచ్చే డబ్బుతోనే తమ స్వంత ఖర్చులు భరించుకొంటారు.—1 కొరింథీయులు 14:33, 40; ఫిలిప్పీయులు 1:1; 1 తిమోతి 3:8, 9.

వీరెలా ఎన్నుకోబడుచున్నారు? వారు లేఖనానుసారమైన కొన్ని అర్హతలను కనబరచే దేవుని నమ్మకమైన సేవకులైవుండవలసిన అవసరమున్నది. వీటిలో కొన్ని యిలా వున్నవి: ‘మితానుభవుడు, స్వస్థబుద్ధిగలవాడు, మర్యాదస్థుడు, అతిథిప్రియుడు, బోధింపతగినవాడు, సాత్వికుడు, ధనాపేక్షలేనివాడు, తన యింటిని బాగుగా ఏలువాడునై యుండవలెను; క్రొత్తగా చేరినవాడై యుండకూడదు; వెలుపటి వారిచేత మంచి సాక్ష్యము పొందినవాడు’; ‘నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొను వాడునై యుండవలెను.’—1 తిమోతి 3:1-15; తీతు 1:7-9.

తరచు ఎక్కువ మంది క్రొత్తగా చేరిన క్రైస్తవులే బహుశా సంఘంలో వుంటారు గనుక సంఘం వారిని ఎన్నుకోదు. అయితే పరిణతి నొందిన అనుభవజ్ఞులైన పురుషులు అనగా, ఎన్నుకోబడనైయున్న వారెంతవరకు లేఖనానుసారమైన అర్హతలు కల్గియున్నారని గ్రహించగలిగే వివేచనగల పెద్దలు వీరినిగూర్చి సిఫారసు చేస్తారు. ఆ పిదప యెహోవాసాక్షులయొక్క పరిపాలక సభ పర్యవేక్షణ క్రింద యీ పెద్దల మరియు పరిచారకుల నియామకం జరుగుతుంది. ఇది మొదటి శతాబ్దంలోని క్రైస్తవ సంఘపు మాదిరిని అనుసరించి జరుగుతుంది.

ఈ పెద్దలు లేక కాపరులు మతగురువుల తరగతికి చెందరు; వారు ఇతరులకు అధికారులు కారు. యేసు చెప్పినట్లు, నాయకత్వము వహించేవారు ఇతరులకు దాసులైవుండాలి. యెహోవాసాక్షుల సంఘంలో పెద్దలు నిజంగా దేవుని రాజ్యముకొరకు తోటిపనివారైయున్నారు.—మత్తయి 20:26, 27; 23:8-11; రోమీయులు 12:8; 1 కొరింథీయులు 3:5; 4:1, 2; కొలొస్సయులు 4:11; 1 థెస్సలొనీకయులు 5:12-14.

అధ్యక్షులుగా వారు కూటములందు ఇవ్వబడుచున్న ఉపదేశమును పర్యవేక్షిస్తూ, ప్రకటించు కార్యక్రమంలో నాయకత్వం వహిస్తారు. కేటాయించబడిన ప్రాంతమంతటిలో రాజ్యసువార్తను ప్రకటించుట సంఘము యొక్క ప్రథమ కర్తవ్యమైయున్నది. అధ్యక్షులు కాపరులుగా కూడ పనిచేస్తు, అవసరమైనపుడెల్ల ప్రోత్సహించుటకుగాను సంఘ సభ్యులను సందర్శిస్తుంటారు.—మత్తయి 24:14; అపొ. కార్యములు 1:8; 1 థెస్సలొనీకయులు 2:11, 12; 5:14, 15; 2 తిమోతి 2:24-26; హెబ్రీయులు 13:17; యాకోబు 5:13-16; 1 పేతురు 5:1-4.

తప్పుడు మార్గాన్ని అనుసరించేవారిని సంఘ ఐక్యతకు ఆత్మీయ నైతిక విలువలను దెబ్బతీసేలావుండే వారిని గద్దించి, శిక్షించే బాధ్యతకూడ పెద్దలకున్నది.—1 కొరింథీయులు 5:4, 5, 7, 11-13; తీతు 1:9; 2:15; 3:10, 11.

నీవు సంఘంతో క్రమంగా కూడుకుంటూ వుంటే నీకు ఉత్తమమైన సహవాసం మరియు అనేక ఆత్మీయ ప్రయోజనాలు లభిస్తాయి.—కీర్తన 35:18; 84:10.

• సంఘములోని పనుల నెవరు పర్యవేక్షిస్తారు?

• అధ్యక్షులు దేనిమీద ఆధారపడి ఎన్నుకొనబడతారు?

• వారి బాధ్యతలేమిటి?

[13వ పేజీలోని చిత్రం]

అధ్యక్షులు సంఘానికి ఉపదేశిస్తారు, ఇంటింట ప్రకటించుపనిలో నాయకత్వం వహిస్తారు, కాపరి సందర్శనముల ద్వారా ప్రోత్సహిస్తారు, అవసరమైతే గద్దించి, సలహా ఇస్తారు