కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రేమ, సత్కార్యములను పురికొల్పజేసే కూటములు

ప్రేమ, సత్కార్యములను పురికొల్పజేసే కూటములు

ప్రేమ, సత్కార్యములను పురికొల్పజేసే కూటములు

తొలి క్రైస్తవులు ఉపదేశాన్ని, క్షేమాభివృద్ధి కలిగించే సహవాసాన్ని పొందుటకుగాను సాధారణంగా ఇండ్లలో కూడుకొనేవారు. ఈనాడు, యెహోవాసాక్షుల సంఘాలు వారానికి మూడుసార్లు కూడుకొంటారు. ఈ కూటములలో దేనికైనను హాజరగుటకు నీవు ఆహ్వానించబడు చున్నావు. వారి కూటములు ఆచారముల వంటివికావు గానీ అవి దైవవిద్య మీద కేంద్రీకరించబడుచున్నవి. సంఘ కూటములు పాట, ప్రార్థనతో ప్రారంభమై ముగించబడును. ప్రవేశము ఉచితము, చందాలు సేకరించబడవు.—అపొ. కార్యములు 4:23-31; 14:22; 15:32, 35; రోమీయులు 16:5; కొలొస్సయులు 4:15.

బహుశా నీవు హాజరుకాబోయేది 45 నిమిషాలుండే బహిరంగ ప్రసంగమైయుండును, అది బైబిలు బోధలు, ప్రవచనం లేదా క్రైస్తవ జీవితం మీద యివ్వబడే సలహాయైయుండును. ఈ బహిరంగ ప్రసంగం తర్వాత బైబిలు పఠనం ఉంటుంది, సంఘపఠనం కొరకే ప్రత్యేకంగా తయారు చేయబడిన కావలికోట అను పత్రికలోని శీర్షికను ఇందుకు ఉపయోగిస్తారు. కావలికోట నుండి ఒక పేరా చదివి, ప్రేక్షకులు వారిచేతులెత్తి స్వచ్ఛందంగా సమాధానమిచ్చునట్లు ఆ సమాచారమును గూర్చి నిర్వాహకుడు ప్రశ్నలు వేస్తాడు. సర్వసాధారణంగా ప్రతి పేరా నుండి చాలా వ్యాఖ్యానములు చేస్తారు. ఆ కూటం ఓ గంటసేపు ఉంటుంది.

ఆ తర్వాత, వారంలో యింకా 45 నిమిషాల పాటు వుండే రెండు కూటములు నడుపబడతాయి. ఒకటి, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల. బైబిలు అంశాలపై సమాచారాన్ని ఎలా సేకరించి దాన్ని ప్రభావశీలంగా బోధించాలో అది తర్ఫీదునిస్తుంది. మొదట 21 నిమిషాల ప్రత్యేక ఉపదేశం పొందిన తర్వాత ముందే నియమించబడిన విద్యార్థులు చిన్న ప్రసంగాలిస్తారు. ప్రతి చిన్న ప్రసంగం తర్వాత పాఠశాల ఉపదేశకుడు, విద్యార్థి ఎలా అభివృద్ధిచేసికొనవలెనో సలహా ఇస్తాడు. ఈ పాఠశాలలో వుపయోగించుటకొరకు అనేక పాఠ్యపుస్తకములు తయారుచేయబడి యున్నవి. కూటములకు క్రమముగా హాజరగువారు క్రైస్తవ సూత్రములకు అనుగుణంగా జీవిస్తుంటే ఇందులో చేరవచ్చును.

దాని తర్వాత జరిగే దాన్ని సేవా కూటమని పిలుస్తారు. అందులో ఇంటింట సువార్తనందించుటకు, పరిచర్యకు సంబంధించిన ఇతర అంశాలనుగూర్చి మూడు నాలుగు భాగాలుంటాయి. ఈ భాగాలు, కొంతవరకు ప్రేక్షకులు పాల్గొనునట్లు ప్రసంగాలు, చర్చలు లేదా ప్రదర్శనల రూపంలో వుంటాయి. అందులోని కార్యక్రమంలో అధికభాగం వాచ్‌టవర్‌ సొసైటి నెలకొకసారి ప్రచురించే మన రాజ్య పరిచర్యలోని నాలుగు పేజీల ఉపదేశం మీద ఆధారపడివుంటుంది.

మరొక కూటం సంఘ ప్రాంతమంతటిలో సాధారణంగా ఇండ్లలో వారానికొకసారి చిన్న గుంపులుగా పఠనం కొరకు కూడుకొనేది. ఆ పఠనము బైబిలు మీద ఆధారపడి ఉంటుంది. గుంపు చిన్నగా వుంటుంది గనుక అందరు చర్చలో పాల్గొనే సదవకాశం పొందుతారు మరియు హాజరైన వారు ఒకరినొకరు బాగుగా అర్థం చేసుకొనుటకు శ్రేష్ఠమైన అవకాశం దొరుకుతుంది.

అనేక సంఘాలు యెహోవాసాక్షులు నిర్మించిన రాజ్యమందిరాలలోనే తమ కూటములను జరుపుకుంటారు. అందుకయ్యే ఖర్చులు సాక్షులిచ్చే స్వచ్ఛంద విరాళముల ద్వారా భరిస్తారు మరియు అనేక సందర్భాల్లో స్వచ్ఛంద సేవకులు ఉచితంగా అలాంటి పని చేస్తున్నారు. చందాలు వేయదలచిన వారి కొరకు అన్ని కూటములలోను చందా పెట్టెలు పెడతారు.

యెహోవాసాక్షులు హెబ్రీయులు 10:24, 25 నందలి సలహాను పాటించుటకు సంఘ కూటములు సహాయపడుచున్నవి: “కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకని నొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.”

• తొలి క్రైస్తవుల కూటములలోని ఎటువంటి భాగాలు యెహోవాసాక్షుల కూటములలో కనబడగలవు?

• యెహోవాసాక్షులు క్రమంగా నడిపే ఐదు కూటములలో అందించబడువాటిని సంక్షిప్తంగా తెలుపుము.

• కూటములకొరకు రాజ్యమందిరాలను ఎలా సంపాదించగల్గుతున్నారు?

[14వ పేజీలోని చిత్రం]

కావలికోట పఠనాన్ని నిర్వహిస్తున్న ఒక పెద్ద, అమెరికా

దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలోని దృశ్యం, ఫెయిరో దీవులు

ఓ ఇంట్లో పుస్తక పఠనగుంపు, యాప్‌

రాజ్యమందిరం, న్యూ బ్రాన్‌ఫెల్స్‌, టెక్సాస్‌, అమెరికా., దీన్ని యెహోవాసాక్షులు రెండు రోజులలో నిర్మించారు

[15వ పేజీలోని చిత్రం]

వివిధ దేశాలలోని రాజ్యమందిరాలు

జపాన్‌

ఆస్ట్రేలియా

ఆస్ట్రియా

స్పెయిన్‌