కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మేము సహాయం చేయగోరుచున్నాము

మేము సహాయం చేయగోరుచున్నాము

మేము సహాయం చేయగోరుచున్నాము

ఈ బ్రోషూరు, యెహోవాసాక్షుల పనులను గూర్చి నీవు క్షుణ్ణంగా తెలిసికొనుటకు, బైబిలు జ్ఞానాన్ని అభివృద్ధి చేసికొనుటకై నీకు సహాయపడు వారి ఏర్పాట్లనుగూర్చి నీవు పరిచయం కలిగియుండుటకు తయారు చేయబడింది. యెహోవాసాక్షులు నిన్ను సందర్శించి యుండవచ్చును, లేదా నీవు వీధిలోగాని యితర స్థలాల్లోగాని వారితో మాట్లాడియుంటావు. ఆ సాక్షులలో ఎవరో ఒకరు ఇప్పుడు నీతో పఠిస్తూ వుండవచ్చును.

దేవుని రాజ్యాన్ని గూర్చి వారందించే సమాచారం ప్రపంచమంతట ప్రకటింపబడుతుందని నీకు తెలుసా? ఎందుచేత? ఎందుకంటె మన సృష్టికర్తయైన దేవుడు అన్ని జనాంగముల ప్రజలు ఆయనను ఆరాధించవలెనని కోరుచున్నాడు. ఆయన మన కాలమును గూర్చి యిలా ప్రవచించాడు: “జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు వెళ్లుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.”—యెషయా 2:2, 3.

దేవుని మార్గాలను గూర్చి నీకు తెలియజేయుటకు యెహోవాసాక్షులు చేపట్టిన చర్య యీ ప్రవచనములోని ఒక నెరవేర్పే. ఈ చర్య ఇప్పుడెందుకు ప్రాముఖ్యమై యున్నదో, నీవెలా దానివల్ల ప్రయోజనం పొందగలవో తదుపరి పుటలు వివరిస్తాయి.

ప్రత్యేకముగా సూచించబడని లేఖనములు బైబిలు సొసైటి ఆఫ్‌ ఇండియా బెంగుళూరు వారి తెలుగు బైబిలు నుండి వ్రాయబడినవి.