కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘము

మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘము

మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘము

సా.శ. 33 పెంతెకొస్తునాడు 120 మంది యేసు శిష్యుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. మరి వారు దేవుని మహిమగల సంగతులనుగూర్చి అనేక భాషలలో మాట్లాడుట కారంభించారు. అదే క్రైస్తవ సంఘ స్థాపన. ఆ రోజు షుమారు 3,000 మంది క్రొత్త శిష్యులు బాప్తిస్మం పొందారు.—అపొ. కార్యములు 2 అధ్యాయం.

అపొస్తలులును ఇతరులును ధైర్యంతో దేవుని వాక్యాన్ని గూర్చి మాట్లాడుచున్నందువల్ల వివిధ ప్రాంతాల్లో సంఘాల సంఖ్య పెరిగింది. అపొస్తలుల కార్యములలో వ్రాయబడినట్లు ప్రకటించు పని సత్వరంగా మధ్యధరా ప్రాంతమంతటికి, బబులోను, ఉత్తరాఫ్రికా నుండి రోము, బహుశా స్పెయిన్‌ వరకు వ్యాపించింది.—రోమీయులు 15:18-29; కొలొస్సయులు 1:23; 1 పేతురు 5:13.

ప్రజలెక్కడ శిష్యులయ్యారో అక్కడెల్లా వారు సంఘాలను స్థాపించారు. సంఘంలో సరియైన బోధనను, ప్రవర్తనా స్థాయిని కాపాడుటకుగాను అర్హులైన, పరిణతిగల పురుషులు పెద్దలుగా లేక అధ్యక్షులుగా నియమించబడ్డారు. గానీ వారు మతగురువుల గుంపుగా ఏర్పడలేదు; వారు దేవుని రాజ్యం నిమిత్తం తయారైన పరిచారకులు, తోటిపనివారైయుండిరి.—అపొ. కార్యములు 14:23; 20:28; 1 కొరింథీయులు 3:5; 5:13; కొలొస్సయులు 4:11; 1 తిమోతి 3:1-15; హెబ్రీయులు 13:17; 1 పేతురు 5:1-4.

అపొస్తలులును మరియు ఇతర సన్నిహిత జత పనివారును పరిపాలక సభగా పనిచేశారు. వారు ప్రకటించే పనిలో నాయకత్వం వహించారు. వారు యెరూషలేము సంఘమునందున్న సమస్యలను పరిష్కరించారు. సమరయ అంతియొకయలోనున్న క్రొత్త విశ్వాసులను బలపరచుటకు అర్హులైన సహోదరులను అక్కడికి పంపించారు. వారు సున్నతిని గూర్చిన వివాదాన్ని తీర్చి, తమ నిర్ణయాన్ని అనుసరించాలని సంఘాలన్నింటికి తెలియజేశారు. అయినను, యీ పురుషులు ఇతరుల మీద అధికారులు కాదుగానీ సంఘము నందున్న వారందరికి సేవకులును జతపనివారునై యుండిరి.—అపొ. కార్యములు 4:33; 6:1-7; 8:14-25; 11:22-24; 15:1-32; 16:4, 5; 1 కొరింథీయులు 3:5-9; 4:1, 2; 2 కొరింథీయులు 1:24.

తొలిశిష్యులు క్రైస్తవులుగా గుర్తించబడ్డారు, దైవ ఏర్పాటునుబట్టి వారలా పిలువబడ్డారు. వారిని విశేష వ్యక్తులుగా గుర్తించే బోధలను వారు కల్గియుండిరి; అవి అపొస్తలుల బోధలని, లేక హితవాక్యములని పిలువబడినవి. ఈ లేఖనానుసారమైన బోధ సత్యమని కూడ గుర్తించబడింది.—యోహాను 17:17; అపొస్తలుల కార్యములు 2:42; 11:26; రోమీయులు 6:17; 1 తిమోతి 4:6; 6:1, 3; 2 తిమోతి 1:13; 2 పేతురు 2:2; 2 యోహాను 1, 4, 9.

వారు ప్రేమయందు ఐక్యపరచబడిన ప్రపంచవ్యాప్త సహవాసముతో కూడిన సహోదరులైయుండిరి. ఇతర దేశాలలో వున్న తమ జతపనివారి యెడల వారు శ్రద్ధచూపారు. విదేశాలకు వెళ్లినపుడు తోటివిశ్వాసులు వారిని తమ గృహములలోనికి ఆహ్వానించారు. వారు లోకానికి వేరైన పరిశుద్ధ ప్రజలుగా ఉత్కృష్టమైన నైతిక ప్రవర్తనా స్థాయిని కలిగియుండిరి. వారు యెహోవా యొక్క ప్రత్యక్షతా దినముకొరకు ఎంతో ఆశతో కనిపెట్టారు, వారి విశ్వాసాన్ని బహిరంగముగా ప్రకటించారు.—యోహాను 13:34, 35; 15:17-19; అపొ. కార్యములు 5:42; 11:28, 29; రోమీయులు 10:9, 10, 13-15; తీతు 2:11-14; హెబ్రీయులు 10:23; 13:15; 1 పేతురు 1:14-16; 2:9-12; 5:9; 2 పేతురు 3:11-14; 3 యోహాను 5-8.

అయిననూ, ముందు ప్రవచింపబడినట్లే రెండు, మూడు శతాబ్దములలో గొప్ప మతభ్రష్టత్వం సంభవించింది. ఇందు మూలంగా పెద్ద పెద్ద చర్చి విధానాలేర్పడి బోధన, ప్రవర్తన, సంస్థ, లోకం ఎడల తీసుకోవలసిన స్థానము విషయాలలో ఆది క్రైస్తవ సంఘం అనుసరించిన పవిత్ర పద్ధతిని అనుసరించలేదు.—మత్తయి 13:24-30, 37-43; 2 థెస్సలొనీకయులు, 2వ అధ్యాయం.

అయితే, యీ విధానాంతమందు సత్యారాధన పునరుద్ధరించబడుతుందని, యేసు ప్రవచించాడు. యేసు ప్రవచించిన షుమారు 1900 సంవత్సరాలకు, మన కాలములో ప్రపంచవ్యాప్తంగా తాము చేసే పనులలో యీ పునరుద్ధరణను గమనించవచ్చునని, యెహోవాసాక్షులు నమ్ముచున్నారు. అలా ఎందుకు నమ్ముచున్నారో తదుపరి పుటలు వివరిస్తాయి.

• క్రైస్తవ సంఘమెట్లు స్థాపించబడింది, అదెట్లు వృద్ధిచెందింది?

• ఆ సంఘమెట్లు పర్యవేక్షించబడింది?

• మొదటి శతాబ్దపు క్రైస్తవులను ఏవి స్పష్టంగా వేరుపరచినవి?

[7వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

నల్ల సముద్రం

కాస్పియన్‌ సముద్రం

మహా సముద్రం

ఎర్ర సముద్రం

పర్షియా గల్ఫ్‌

మొదటి శతాబ్దములో సువార్త వ్యాపించిన ప్రాంతాలు

ఇటలీ

రోము

గ్రీసు

మెలితే

క్రేతు

కుప్ర

బెతెనియ

గలతీయ

ఆసియ

కప్పదొకియ

కిలికియ

సిరియ

ఇశ్రాయేలు

యెరూషలేము

మెసొపొతమియ

బబులోను

ఈ ప్రాంతముల నుండి కొందరు విశ్వాసులైరి

యిల్‌రికం

మాదియ

పార్తీయ

ఏలాము

అరేబియా

లిబియా

ఐగుప్తు

ఐతియోపియా

[7వ పేజీలోని చిత్రం]

తొలి క్రైస్తవులు దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించారు

వారు వెళ్లిన ప్రతిచోట తోటి విశ్వాసులు ఆ క్రైస్తవులను తమ ఇండ్లలో చేర్చుకున్నారు