స్వచ్ఛంద విరాళముల ద్వారా ఆర్థికమద్దతు పొందుచున్నారు
స్వచ్ఛంద విరాళముల ద్వారా ఆర్థికమద్దతు పొందుచున్నారు
ముందు వివరించబడిన పని యావత్తు స్వచ్ఛంద సేవకుల మద్దతు ద్వారా జరుగుతోంది గనుకనే ఖర్చులు తగ్గుతున్నాయి. యెహోవాసాక్షులు స్వచ్ఛందంగానే ఇంటింటి పరిచర్య చేస్తున్నారు. సాహిత్యాలందిస్తున్నారు. వారి ఖర్చులు వారే భరిస్తారు. పరిచారకుల సహాయంతో సంఘాన్ని పర్యవేక్షించే పెద్దలు వారు చేసే సేవకొరకు జీతం పుచ్చుకోరు. వారి ఖర్చులన్ని వారే భరిస్తారు.
బైబిళ్లను, బైబిలు సాహిత్యాలను సిద్ధపరచి తయారుచేసేవారందరూ, పరిపాలక సభ సభ్యులూ భోజన వసతులతోపాటు ఖర్చులనిమిత్తం కొంచెం డబ్బును కూడా పొందుతారు. ప్రయాణ కాపరుల విషయంలోకూడ యింతే.
బైబిలు నందు నిజమైన ఆసక్తి చూపేవారి సహాయార్థం మన సాహిత్యాలు ప్రచురించబడుచున్నవి. వీటికి అవసరమయ్యే ముడి సరుకు, ఉత్పత్తి, రవాణా మొదలగునవి, ఆసక్తిగలవారిచ్చే విరాళములు, యెహోవా సాక్షులు స్వయంగాయిచ్చే విరాళములు, వారసత్వపు ఆస్తిపాస్తుల మూలంగా వచ్చే ధనం ద్వారా వాటి ఖర్చులు భరించబడుచున్నవి.
స్థానికంగా కానివ్వండి, సమావేశాలలో కానివ్వండి యెహోవాసాక్షుల కూటములన్నిటిలోను, చందాలివ్వదలచిన వారందరి కొరకు అక్కడ చందా పెట్టెలు అందుబాటులో ఉంటాయి. ఎటువంటి చందాలు పట్టేది ఉండదు. పదియవవంతు లేదా ఇతరత్రా చందాలు చెల్లించనవసరంలేదు. లేఖనమందున్నట్లు తన హృదయములో నిశ్చయించుకున్న దానిని కానుకగా ఇవ్వవచ్చును.—2 కొరింథీయులు 8:12; 9:7.
• యెహోవాసాక్షుల పనియంతటికి ఆర్థిక మద్దతు ఎలా లభిస్తుంది?
[28వ పేజీలోని చిత్రం]
లోకమంతా సొసైటి చేసే పని నిమిత్తం చందాలు—మత్తయి 24:14