కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి సంస్థ అది చేసే పని

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి సంస్థ అది చేసే పని

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి సంస్థ అది చేసే పని

235 దేశాల్లో జరుగుతున్న సాక్ష్యపు పనిని నడిపించడానికి అనేక పద్ధతులు ఉపయోగించబడ్డాయి. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోనున్న ప్రపంచ ప్రధాన కార్యాలయంలోని పరిపాలక సభ నుండి మొత్తం నిర్దేశాలు వస్తాయి. పరిపాలక సభ ప్రతీ జోన్‌లోనున్న బ్రాంచి ప్రతినిధులతో చర్చలు జరపడానికి ప్రపంచవ్యాప్తంగానున్న ఆయా జోన్‌లకు ప్రతీ సంవత్సరం ప్రతినిధులను పంపుతుంది. బ్రాంచి కార్యాలయాల్లో, తమ అధికార పరిధిలోనున్న ప్రాంతాలను పర్యవేక్షించడానికి ముగ్గురి నుండి ఏడుగురు సభ్యులున్న బ్రాంచ్‌ కమిటీలు ఉంటాయి. కొన్ని బ్రాంచీల్లో ముద్రణా సదుపాయాలు ఉన్నాయి, కొన్ని ఎంతో వేగంగా పనిచేసే రోటరీ ముద్రణా యంత్రాలను ఉపయోగిస్తున్నాయి. ప్రతీ బ్రాంచి క్రిందనున్న దేశం జిల్లాలుగా, జిల్లాలు ప్రాంతాలుగా (సర్క్యూట్‌లుగా) విభజించబడ్డాయి. ప్రతీ సర్క్యూట్‌లో దాదాపు 20 సంఘాలుంటాయి. ఒక జిల్లా పైవిచారణకర్త తన జిల్లాలోని సర్క్యూట్‌లను సందర్శిస్తుంటాడు. ప్రతీ సర్క్యూట్‌లో సంవత్సరానికి రెండు సమావేశాలు జరుగుతాయి. ప్రతీ సర్క్యూట్‌కి ప్రాంతీయ పైవిచారణకర్త కూడా ఉంటాడు, ఆయన తన సర్క్యూట్‌లోని ప్రతీ సంఘాన్ని సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు సందర్శిస్తాడు, ఆయా సంఘాలకు నియమించబడిన సేవాప్రాంతాల్లో సంస్థీకరించడంలోనూ ప్రకటనా పని చేయడంలోనూ సహాయంచేస్తాడు.

రాజ్యమందిరం ఉన్న స్థానిక సంఘం మీ ప్రాంతంలో సువార్త చెప్పడానికి కేంద్రం. ప్రతీ సంఘం ఆధ్వర్యంలోనున్న ప్రాంతం, చిన్న చిన్న క్షేత్రాలుగా మ్యాప్‌లు వేయబడతాయి. అక్కడున్న ప్రతీ ఇంటివారిని సందర్శించి, వారితో మాట్లాడడానికి ప్రయత్నించే సాక్షులకు ఈ క్షేత్రాలు నియమించబడతాయి. కొద్దిమంది నుండి దాదాపు 200 మంది సాక్షులున్న ప్రతీ సంఘంలోనూ వివిధ సేవలను నిర్వహించడానికి నియమిత పెద్దలుంటారు. యెహోవాసాక్షుల సంస్థలో సువార్తికుడు కీలకమైన వ్యక్తి. సాక్షులలో ప్రతి ఒక్కరూ, ఆయన ప్రపంచ ప్రధానకార్యాలయాల్లో సేవచేస్తున్నా బ్రాంచి కార్యాలయాల్లో సేవచేస్తున్నా సంఘాల్లో సేవచేస్తున్నా దేవుని రాజ్యం గురించి ఇతరులకు స్వయంగా చెప్పే ఈ క్షేత్ర సేవను చేస్తాడు.

ఈ సేవకు సంబంధించిన నివేదికలు ప్రపంచ ప్రధాన కార్యాలయాలకు చేరుతుంటాయి, అలా సమకూర్చబడిన సమాచారం ప్రతి సంవత్సరం వార్షికపుస్తకము (ఆంగ్లం)లో ముద్రించబడుతుంది. అంతేకాకుండా, కావలికోట జనవరి 1వ సంచికలో ప్రతి సంవత్సరం ఒక పట్టిక కూడా ముద్రించబడుతుంది. ఈ రెండు ప్రచురణలూ యెహోవా గురించీ క్రీస్తు యేసు పరిపాలించే ఆయన రాజ్యం గురించీ సాక్ష్యమివ్వడంలో ఆ సంవత్సరం పొందిన విజయాల గురించిన వివరణాత్మక నివేదికలను అందిస్తాయి. ఇటీవలి సంవత్సరాల్లో యేసు వార్షిక మరణ జ్ఞాపకార్థ దినానికి సంవత్సరానికి దాదాపు 1,50,00,000 మంది సాక్షులు, ఆసక్తిగల ఇతరులు హాజరయ్యారు. యెహోవాసాక్షులు ఒక సంవత్సరంలో, 110,00,00,000 గంటలకు పైగా సువార్త ప్రకటించడంలో గడుపుతున్నారు, దాంతోపాటు 2,50,000 కంటే ఎక్కువమంది క్రొత్తవారు బాప్తిస్మం పొందుతున్నారు. కోట్లాది కాపీల ప్రచురణలు అందించబడుతున్నాయి.