కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు వినాలని వారు కోరుకుంటున్న సువార్త

మీరు వినాలని వారు కోరుకుంటున్న సువార్త

మీరు వినాలని వారు కోరుకుంటున్న సువార్త

యేసు భూమిపైనున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఇలా అడిగారు: “నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” అందుకాయన అనేక దేశాలు యుద్ధాల్లో పాల్గొంటాయి, కరవులు, ప్రాణాంతక రోగాలు, భూకంపాలు వస్తాయి, అవినీతి పెరిగిపోతుంది, అబద్ధమత బోధకులు అనేకమందిని తప్పుదారి పట్టిస్తారు, నిజమైన అనుచరులను ద్వేషించడం, హింసించడం జరుగుతుంది, అనేకమందిలో నీతిపై ప్రేమ లేకుండా పోతుందని జవాబిచ్చాడు. ఎప్పుడైతే ఈ సంగతులు జరగడం మొదలవుతాయో అది అదృశ్యమైన రీతిలో క్రీస్తు ప్రత్యక్షత ప్రారంభమైందనీ పరలోక రాజ్యం సమీపించిందనీ సూచిస్తుంది. ఇది గొప్ప వార్తే​—⁠సువార్త! అందుకే యేసు ఈ మాటలు కూడా సూచనలో చేర్చాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”​—⁠మత్తయి 24:​3-14.

లోకంలో జరుగుతున్న ఇటీవలి సంఘటనలు వాటంతటవి చెడు విషయాలే అయినా అవి సూచించేది మాత్రం ఒక మంచి విషయం, అదేమిటంటే క్రీస్తు ప్రత్యక్షత. పైన పేర్కొన్న పరిస్థితులు, క్రీస్తు ప్రత్యక్షత గురించి ఎంతో విస్తృతంగా ప్రచారం జరిగిన సంవత్సరంలోనే అంటే 1914లోనే కనబడడం ప్రారంభించాయి. అది అన్యజనముల కాలముల ముగింపునూ మానవ పరిపాలన నుండి వెయ్యేండ్ల క్రీస్తు పరిపాలనకు అధికార మార్పిడి కాలం ప్రారంభాన్నీ సూచించింది.

ఆ మార్పిడి కాలం గురించి 110వ కీర్తనలోని 1, 2 వచనాల్లో, ప్రకటన 12:​7-12 వచనాల్లో సూచించబడింది. క్రీస్తు తాను రాజయ్యేంతవరకు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటాడని అక్కడ చెబుతుంది. ఆ తర్వాత పరలోకంలో జరిగిన యుద్ధం ఫలితంగా సాతాను భూమిపైకి పడద్రోయబడడం, తత్ఫలితంగా భూమికి శ్రమ రావడం, క్రీస్తు తన శత్రువుల మధ్యనే పరిపాలన చేయడం జరుగుతుంది. ‘మహాశ్రమ’ ద్వారా దుష్టత్వం ఏ మాత్రం లేకుండా పోతుంది, అది హార్‌మెగిద్దోను యుద్ధంలో పరాకాష్ఠకు చేరుకొంటుంది, దాని తర్వాత క్రీస్తు వెయ్యేండ్ల శాంతి పరిపాలన ప్రారంభమవుతుంది.​—⁠మత్తయి 24:​21, 33, 34; ప్రకటన 16:​14-16.

అయితే బైబిలు, “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము” అని చెబుతోంది. “ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.”​—⁠2 తిమోతి 3:​1-5.

మానవ చరిత్రలో ఇవి ఇంతకు ముందు కూడా జరిగాయని కొందరు వాదిస్తుండవచ్చు, కానీ వాస్తవానికి ఇంత విస్తృత స్థాయిలో ఎన్నడూ జరగలేదు. చరిత్రకారులు, వ్యాఖ్యాతలు అంటున్నట్లుగా, భూమ్మీద 1914 నుండి ఎదుర్కొన్నటువంటి కాలం ఇంతవరకూ ఎన్నడూ రాలేదు. (7వ పేజీ చూడండి.) ఇంతకు ముందెన్నడూ జరగనటువంటి స్థాయిలో బాధలు ఉన్నాయి. అంతేకాదు అంత్యదినముల గురించి క్రీస్తు ఇచ్చిన సూచనలోని ఇతర లక్షణాలలాగే, ఈ వాస్తవాలను కూడా పరిశీలించాలి: చరిత్రలో సాటిలేని రీతిలో క్రీస్తు ప్రత్యక్షత మరియు రాజ్యం గురించి భూవ్యాప్తంగా ప్రకటించబడుతోంది. ప్రకటిస్తున్నందుకు యెహోవాసాక్షులు అసమానమైన హింసను అనుభవించారు. వారిలో అనేక వందలమంది నాజీ కాన్సంట్రేషన్‌ క్యాంపుల్లో మరణశిక్షకు గురయ్యారు. కొన్ని స్థలాల్లో నేటి వరకు యెహోవాసాక్షులు నిషేధంలో ఉన్నారు, మరికొన్ని ప్రాంతాల్లో అరెస్టు చేయబడుతున్నారు, జైల్లో వేయబడుతున్నారు, హింసించబడుతున్నారు చివరికి చంపబడుతున్నారు. ఇవన్నీ యేసు ఇచ్చిన సూచనలోని భాగమే.

ప్రకటన 11:18 లో ముందే తెలియజేసినట్లుగా యెహోవా యథార్థ సాక్షులకు వ్యతిరేకంగా ‘జనములు కోపగించుకుంటాయి,’ తర్వాత ఆ జనములకు వ్యతిరేకంగా యెహోవా ‘తన కోపాన్ని’ వ్యక్తం చేస్తాడని అది సూచిస్తుంది. అదే వచనం దేవుడు, ‘భూమిని నశింపజేయువారిని నశింపజేయును’ అని చెబుతోంది. భూమి తనలోని జీవకోటిని పోషించలేనటువంటి ప్రమాదకరమైన స్థితి చరిత్రలో ఇంతకు ముందెన్నడూ రాలేదు. అయితే, ఇప్పటి పరిస్థితి భిన్నంగా ఉంది! మానవుడు భూమిని ఇలాగే కలుషితం చేస్తున్నట్లయితే అది నివసించడానికి పనికిరాకుండా పోతుందని అనేకమంది శాస్త్రజ్ఞులు హెచ్చరించారు. కానీ యెహోవా “నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను,” వారు భూమిని పూర్తిగా నాశనం చేయకముందే ఆయన వారిని నాశనం చేస్తాడు.​—⁠యెషయా 45:​18.

రాజ్య పాలనలో భూసంబంధమైన ఆశీర్వాదాలు

రక్షణ పొందేవాళ్ళంతా పరలోకానికి వెళ్తారని భావించే అనేకమంది బైబిలు విశ్వాసులకు, దేవుని రాజ్య పౌరులుగా భూమిపై జీవించడమనే ఆలోచన వింతగా ఉంటుండవచ్చు. కేవలం పరిమితమైన సంఖ్య మాత్రమే పరలోకానికి వెళ్తుందనీ భూమిపై నిరంతరం జీవించేవారు అసంఖ్యాకమైన గొప్ప సమూహమనీ బైబిలు తెలియజేస్తోంది. (కీర్తన 37:​11, 29; ప్రకటన 7:⁠9; 14:​1-5) బైబిలు పుస్తకమైన దానియేలులోని ఒక ప్రవచనం ప్రకారం, ఆ దేవుని రాజ్యమే క్రీస్తు పరిపాలన క్రింద భూమిని ప్రజలతో నింపి వారిని ఏలుతుంది.

ఆ వృత్తాంతంలో క్రీస్తు రాజ్యం, పర్వతం లాంటి యెహోవా సర్వోన్నతాధిపత్యం నుండి తీయబడే ఒక రాయిగా సూచించబడింది. ఆ రాయి శక్తివంతమైన భూరాజ్యాలను సూచించే ఒక ప్రతిమ మీదపడి దాన్ని తుత్తునియలు చేస్తుంది, ఆ తర్వాత ‘ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమవుతుంది.’ ఆ ప్రవచనం ఇంకా ఇలా కొనసాగుతుంది: “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”​—⁠దానియేలు 2:​34, 35, 44.

ఈ రాజ్యం గురించీ, పరిశుభ్రపరచబడి అందంగా తయారుచేయబడిన భూమిపై నిత్యజీవాన్ని పొందుతామన్న లేఖనాధారిత నిరీక్షణ గురించీ యెహోవాసాక్షులు మీకు చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమందికీ ప్రస్తుతం సమాధుల్లో ఉన్న ఇంకా అనేకానేక లక్షలాదిమందికీ ఆ భూమిపై నిరంతరం జీవించే సదవకాశం ఉంది. అప్పుడు యేసుక్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో, యెహోవా మొట్ట మొదటి సంకల్పం అంటే భూమిని సృష్టించి మొదటి మానవ జంటను దానిపై పెట్టడంలోనున్న సంకల్పం నిజమవుతుంది. భూపరదైసు ఎన్నడూ విసుగు కలిగించదు. ఆదాము ఏదెను తోటలో పనిచేయడానికి ఎలా నియమించబడ్డాడో అలాగే భూమిని, దానిపైనున్న మొక్కలను, జంతువులను సంరక్షించే పనిలో మానవాళికి సవాలుదాయకమైన పథకాలు ఉంటాయి. వారు “తమ కృషి ఫలము తామనుభవింతురు.”​—⁠యెషయా 65:​22, పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము; ఆదికాండము 2:​15.

యేసు మనకు నేర్పించిన ప్రార్థనకు జవాబివ్వబడినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో చూపించడానికి అనేక లేఖనాలు ఉన్నాయి: “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (మత్తయి 6:​9, 10) అయితే ఇప్పటికి దీనితో తృప్తిపడదాం: “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు​—⁠ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను.” అంతేకాదు ‘ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుము’ అని కూడా ఆయన చెప్పుచున్నాడు.​—⁠ప్రకటన 21:​3-5.

[15వ పేజీలోని బ్లర్బ్‌]

“అపాయకరమైన కాలములు”

కానీ “అటుతరువాత అంతము వచ్చును”

[18వ పేజీలోని చిత్రం]

నెదర్లాండ్స్‌

[18వ పేజీలోని చిత్రం]

నైజీరియా