కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

16వ పాఠం

సంఘ పరిచారకులు ఏమేం చేస్తారు?

సంఘ పరిచారకులు ఏమేం చేస్తారు?

మ్యాన్‌మార్‌

కూటంలో ఒక భాగం

క్షేత్రసేవా గుంపు

రాజ్యమందిరాన్ని మంచిస్థితిలో ఉంచడం

సంఘ బాధ్యతల్ని రెండు గుంపుల క్రైస్తవ పురుషులు అంటే ‘పర్యవేక్షకులు, సంఘ పరిచారకులు’ చూసుకుంటారని బైబిలు చెప్తుంది. (ఫిలిప్పీయులు 1:1) సాధారణంగా ప్రతీ సంఘంలో కొంతమంది సహోదరులు పెద్దలుగా, సంఘ పరిచారకులుగా సేవచేస్తారు. సంఘ పరిచారకులు మా కోసం ఏమేం చేస్తారు?

వాళ్లు పెద్దల సభకు సహాయం చేస్తారు. సంఘ పరిచారకులకు యెహోవాతో దగ్గరి సంబంధం ఉంటుంది. వాళ్లు నమ్మదగినవాళ్లు, ఇచ్చిన పనిని జాగ్రత్తగా చేస్తారు. వాళ్లలో యువకులు, వృద్ధులు ఉంటారు. వాళ్లు సంఘానికి, రాజ్యమందిరానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేస్తుంటారు. దానివల్ల పెద్దలు బోధించడం మీద, సంఘాన్ని కాయడం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టగలుగుతారు.

వాళ్లు అవసరమైన సేవలు అందిస్తారు. కూటాలకు వచ్చేవాళ్లను ఆహ్వానించడానికి కొంతమంది సంఘ పరిచారకుల్ని అటెండెంట్లుగా నియమిస్తారు. ఇంకొంతమంది సౌండ్‌ సిస్టమ్‌, ప్రచురణలు, అకౌంట్స్‌, క్షేత్రం (టెరిటరీ) నియమించడం వంటివి చూసుకుంటారు. అలాగే, రాజ్యమందిరాన్ని మంచిస్థితిలో ఉంచడానికి వాళ్లు సహాయం చేస్తారు. కొన్నిసార్లు, వృద్ధులకు సహాయం చేయమని సంఘ పెద్దలు వాళ్లకు చెప్పవచ్చు. వాళ్లకు ఏ పని అప్పగించినా సంతోషంగా చేస్తారు కాబట్టి సంఘంలోని వాళ్లంతా వాళ్లను గౌరవిస్తారు.—1 తిమోతి 3:13.

వాళ్లు క్రైస్తవులుగా మంచి ఆదర్శం ఉంచుతారు. చక్కని క్రైస్తవ లక్షణాలు ఉన్న సహోదరుల్నే సంఘ పరిచారకులుగా నియమిస్తారు. వాళ్లు కూటాల్లో భాగాలు నిర్వహిస్తూ మా విశ్వాసాన్ని బలపరుస్తారు, ప్రకటనా పనిలో ఆదర్శంగా ఉంటూ మాలో ఉత్సాహాన్ని నింపుతారు. వాళ్లు పెద్దల సభకు చక్కగా సహకరిస్తూ సంఘ సంతోషానికి, ఐక్యతకు తోడ్పడతారు. (ఎఫెసీయులు 4:16) కొంతకాలానికి, వాళ్లు కూడా పెద్దలుగా సేవచేయడానికి అర్హులు కావచ్చు.

  • ఎలాంటివాళ్లు సంఘ పరిచారకులుగా సేవచేస్తారు?

  • సంఘంలో పనులు సాఫీగా జరగడానికి సంఘ పరిచారకులు ఎలా సహాయం చేస్తారు?