2
ఆందోళన—ఎటుచూసినా ఇబ్బందులే
“పెళ్లైన 25 ఏళ్లకు నేను, నా భర్త విడాకులు తీసుకున్నాం. మా పిల్లలు సత్యం వదిలి వెళ్లిపోయారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడ్డాను. బాగా కృంగిపోయాను. ప్రపంచం మొత్తం తల్లకిందులైనట్లు అనిపించింది, ఇక దేన్నీ భరించలేకపోయాను. మీటింగ్స్‌కు వెళ్లడం, సంఘంతో కలిసి యెహోవాను ఆరాధించడం మానేశాను.”—జూన్
ప్రతి ఒక్కరికీ ఆందోళనలు ఉంటాయి, దేవుని ప్రజలకు కూడా. “నా అంతరంగమందు విచారములు” పెరిగిపోయాయి అని కీర్తనకర్త అన్నాడు. (కీర్తన 94:19) అంతానికి ముందు రోజుల్లో, జీవిత చింతల వల్ల యెహోవాను ఆరాధించడం మరింత కష్టమవుతుందని యేసు చెప్పాడు. (లూకా 21:34) మీ పరిస్థితి ఏంటి? ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలతో విసిగిపోయారా? అయితే వాటిని తట్టుకోవడానికి యెహోవా మీకెలా సహాయం చేస్తాడు?
దేవుని “బలాధిక్యము”
ఆందోళనలను మనం ఒంటరిగా జయించలేం. ‘ఎటుబోయినను శ్రమపడుచున్నాము, అపాయములో ఉన్నాము, పడిపోయాము’ అని పౌలు అన్నాడు. అయినా, మనం “ఇరికింపబడువారము కాము . . . ఉపాయము లేనివారము కాము . . . నశించువారము కాము” అని కూడా ఆయన అన్నాడు. సహించడానికి ఏది మనకు సహాయం చేస్తుంది? సర్వశక్తిమంతుడైన మన దేవుడు ఇచ్చే “బలాధిక్యము” మనకు సహాయం చేస్తుంది.—2 కొరింథీయులు 4:7-9.
దేవుని “బలాధిక్యము” గతంలో మీకెలా సహాయం చేసిందో గుర్తుచేసుకోండి. ప్రోత్సాహాన్నిచ్చే ఒక ప్రసంగం, యెహోవా చూపిస్తున్న యథార్థమైన ప్రేమ పట్ల మీ గౌరవాన్ని పెంచిందా? పరదైసు భూమ్మీద జీవితం గురించి వేరేవాళ్లకు నేర్పిస్తున్నప్పుడు యెహోవా వాగ్దానాల మీద మీ నమ్మకం మరింత పెరిగిందా? మీటింగ్స్‌కు వెళ్తూ, మన నమ్మకాల్ని ఇతరులకు చెప్తున్నప్పుడు జీవన చింతలను తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని, మనశ్శాంతిని పొందుతాం. అప్పుడు మనం యెహోవాను ఆనందంగా సేవిస్తాం.
“యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి”
అవును, సమస్యలు అన్నివైపుల నుండి మిమ్మల్ని ఊపిరాడకుండా చేస్తున్నట్లు మీకు అనిపించవచ్చు. ఉదాహరణకు రాజ్యాన్ని మొదట వెదకమని, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో క్రమంగా పాల్గొనమని యెహోవా చెప్తున్నాడు. (మత్తయి 6:33; లూకా 13:24) మరి వ్యతిరేకత, అనారోగ్యం, కుటుంబ సమస్యలు మిమ్మల్ని కృంగదీస్తే అప్పుడేంటి? లేదా మీరు సంఘం కోసం గడపాల్సిన సమయాన్ని మీ ఉద్యోగం మింగేస్తుంటే అప్పుడేంటి? చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నా మీకు కేవలం కొంత సమయం, శక్తే మిగిలి ఉండవచ్చు, దానివల్ల మీరు ఉక్కిరిబిక్కిరి అవుతుండవచ్చు. బహుశా యెహోవా మీ నుండి మరీ ఎక్కువ కోరుకుంటున్నాడని మీకనిపించవచ్చు.
యెహోవా మనల్ని అర్థం చేసుకుంటాడు. మనం ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఎప్పుడూ అడగడు. శారీరక, మానసిక ఒత్తిళ్ల నుండి కోలుకోవడానికి మనకు సమయం పడుతుందని యెహోవాకు తెలుసు.—కీర్తన 103:13, 14.
ఏలీయా ప్రవక్త మీద యెహోవా ఎలా శ్రద్ధ చూపించాడో ఆలోచించండి. నిరుత్సాహం, భయం వెంటాడినప్పుడు ఏలీయా అరణ్యానికి పారిపోయాడు. యెహోవా ఏలీయాను కోప్పడి, తిరిగి వెళ్లి ఆయనకిచ్చిన పనిని చేయమన్నాడా? లేదు. యెహోవా ఒక దేవదూతను రెండుసార్లు పంపి ఆయన్ని ప్రేమగా నిద్రలేపి, ఆహారం ఇప్పించాడు. అయినప్పటికీ 40 రోజుల తర్వాత కూడా ఏలీయాలో ఆందోళన, భయం అలానే ఉన్నాయి. ఆయనకు సహాయం చేయడానికి యెహోవా ఇంకా ఏమి చేశాడు? ముందు, ఆయన్ని కాపాడగలనని యెహోవా చూపించాడు. తర్వాత, ‘మిక్కిలి నిమ్మళంగా మాట్లాడు 1 రాజులు 19:1-19) దీన్నుండి మనమేం నేర్చుకోవచ్చు? ఏలీయా ఆందోళనలో మునిగిపోయినప్పుడు, యెహోవా ఆయన పట్ల కనికరం, ఓర్పు చూపించాడు. యెహోవా మారలేదు, ఇప్పుడు కూడా మనపై ఆయన అలానే శ్రద్ధ చూపిస్తాడు.
స్వరంతో’ ఆయనను ఓదార్చాడు. చివరిగా, తనను నమ్మకంగా ఆరాధిస్తున్నవాళ్లు ఇంకా వేలమంది మిగిలి ఉన్నారని యెహోవా చెప్పాడు. ఏలీయా కొంతకాలానికే ప్రవక్తగా మళ్లీ ఉత్సాహంగా పనిచేశాడు. (యెహోవాకు ఏమైనా ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఎంత ఇవ్వగలరో అంతే ఇవ్వండి. మీరు ఇప్పుడు చేస్తున్న దాన్ని ఒకప్పుడు చేసిన దానితో పోల్చుకోకండి. ఉదాహరణకు చాలా నెలలు లేదా సంవత్సరాలు ప్రాక్టీస్ మానేసిన తర్వాత, ఒక క్రీడాకారుడు మళ్లీ ఒక్కసారిగా ఒకప్పటి వేగంతో పరుగెత్తలేడు. చిన్నచిన్న లక్ష్యాలు పెట్టుకుని మళ్లీ తన బలాన్ని, ఓపికను పెంచుకుంటాడు. క్రైస్తవులు కూడా పరుగుపందెంలో పరుగెత్తే క్రీడాకారులే. వాళ్లు మనసులో స్పష్టంగా ఒక లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించడానికి కృషిచేస్తారు. (1 కొరింథీయులు 9:24-27) మీరు వెంటనే చేరుకోగల ఒక ఆధ్యాత్మిక లక్ష్యం పెట్టుకోండి. ఉదాహరణకు, సంఘ కూటాలకు హాజరవ్వాలనే లక్ష్యం పెట్టుకోండి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయం చేయమని యెహోవాను అడగండి. మీరు ఆధ్యాత్మిక బలాన్ని తిరిగి పొందుతున్నప్పుడు “యెహోవా ఉత్తముడని రుచి చూచి” తెలుసుకుంటారు. (కీర్తన 34:8) యెహోవా మీద మీకున్న ప్రేమను చూపించే ఏ చిన్న పని చేసినా ఆయన దాన్ని చాలా విలువైనదిగా చూస్తాడని గుర్తుంచుకోండి.—లూకా 21:1-4.
“నేనెంతో కాలంగా ఎదురుచూస్తున్న శక్తి”
తిరిగి తన దగ్గరకు రావడానికి యెహోవా జూన్‌కు ఎలా సహాయం చేశాడు? “సహాయం చేయమని నేను యెహోవాకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అప్పుడు మా కోడలు మా పట్టణంలో జరుగుతున్న సమావేశం గురించి నాకు చెప్పింది. సమావేశంలో ఒకరోజు కార్యక్రమానికి మాత్రం వెళ్లాలనుకున్నాను. యెహోవా ప్రజలతో మళ్లీ కలవడం నిజంగా ఎంతో గొప్ప ఆనందాన్నిచ్చింది! నేనెంతో కాలంగా ఎదురుచూస్తున్న శక్తిని ఆ సమావేశం నాకు ఇచ్చింది. నేను మళ్లీ యెహోవాను సంతోషంగా సేవిస్తున్నాను. ఇప్పుడు నా జీవితం చాలా అర్థవంతంగా ఉంది. నా సహోదరసహోదరీలు నాకు ముఖ్యమని, వాళ్ల సహాయం నాకు చాలా అవసరమని ముందుకన్నా ఇప్పుడు బాగా అర్థమైంది. తిరిగివచ్చే అవకాశం దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.”