కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

1వ భాగం

తన మహా దినం కోసం మనం సిద్ధపడడానికి దేవుడు సహాయం చేస్తాడు

తన మహా దినం కోసం మనం సిద్ధపడడానికి దేవుడు సహాయం చేస్తాడు

“యెహోవా మహా దినము సమీపమాయెను” అని దేవుని ప్రవక్త రాశాడు. (జెఫన్యా 1:14) ఆ దినం శరవేగంతో దూసుకొస్తోంది కాబట్టి, మనం దాన్ని మనసులో ఉంచుకొని జీవించాలి. ఆ మహా దినం గురించిన ప్రాముఖ్యమైన సమాచారం హోషేయ నుండి మలాకీ వరకున్న చిన్న పుస్తకాల్లో ఉందని మీకు తెలుసా? ఆ పుస్తకాలను రాసిన 12 మంది ప్రవక్తల గురించి, ఆ పుస్తకాల్లోని ముఖ్యాంశాల గురించి 1 నుండి 3 అధ్యాయాల్లో మనం తెలుసుకుంటాం. వాళ్లు రాసిన వాటి నుండి జీవితానికి ఉపయోగపడే పాఠాలు నేర్చుకుంటాం, ఎంతో ప్రయోజనం పొందుతాం.