కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రక్తము—జీవాధారము

రక్తము—జీవాధారము

రక్తము—జీవాధారము

నీ జీవమును రక్తము ఎట్లు కాపాడగలదు? నిస్సందేహముగా, ఇది నీకు ఆసక్తికరమైయుండును, ఎందుకనగా, నీ జీవమునకు రక్తము సంబంధితమైయున్నది. నీ శరీరములోనికి ప్రాణవాయువును రక్తము చేర్చును, కార్బన్‌ డయాక్సైడ్‌ను (బొగ్గుపులుసు వాయువు) తొలగించును, ఉష్ణోగ్రతా మార్పులకు సరిపుచ్చుకొనుటకు నీకు సహాయపడును, మరియు వ్యాధికి వ్యతిరేకంగా పోరాడుటకు నీకు సహాయపడును.

విలియం హార్వే 1628 లో, రక్తప్రసరణ వ్యవస్థను చిత్రీకరించిన కాలముకంటే ముందు రక్తమునకు జీవమునకుగల సంబంధము పొందుపరచబడినది. రక్తమునుగూర్చియు, జీవమునుగూర్చియు తనకుతానుగా వ్యక్తంచేసిన జీవదాతపై ప్రధాన మతాల ప్రాథమిక నైతిక విషయాలు కేంద్రీకరించినవి. ఆయననుగూర్చి ఒక యూదా-క్రైస్తవ న్యాయవాది ఇలా చెప్పెను: “ఆయన అందరికిని జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు. మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము.” *

ఆ జీవదాతయందు విశ్వాసముంచు ప్రజలు ఆయన మార్గదర్శక సూత్రాలు మన శాశ్వత ప్రయోజనమునకేయని నమ్మికయుంచుదురు. ఆయిననుగూర్చి ఒక హెబ్రీ ప్రవక్త ఇలా వివరించెను: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీకు ఉపదేశము చేయుదును. నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.”

మనందరికి ప్రయోజనము చేకూర్చగల నైతిక విలువల కారణంగా గౌరవించబడుచున్న పుస్తకమగు బైబిలునందు, ఒక భాగమగు యెషయా 48:17 నందు, ఆ అభయము కలదు. రక్తమును మనుష్యుడుపయోగించుటను గురించి అది ఏమని చెప్పుచున్నది? రక్తమువలన జీవితములెట్లు కాపాడబడగలవో అది చూపునా? నిజమునకు, రక్తము, సంక్లిష్ట జీవద్రవముకంటె ఎక్కువ అని బైబిలు స్పష్టముగా చూపుచున్నది. అది రక్తమును 400 కంటె ఎక్కువసార్లు పేర్కొనినది, మరియు వాటిలోకొన్ని జీవమును రక్షించుటను చూపుచున్నవి.

ఒకానొక పురాతన సందర్భములో, సృష్టికర్త: “ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును. . . . అయినను మాంసమును దానిరక్తముతో మీరు తినకూడదు” అని ప్రకటించెను. ఇంకనూ ఆయన, “మీకు ప్రాణమైన మీ రక్తమునుగూర్చి విచారణ చేయుదును,” అని పలికి, హత్యను ఆయన ఖండించెను. (ఆదికాండము 9:3-6, న్యూ ఇంటర్నేషనల్‌ వర్హన్‌) యూదులు, మహమ్మదీయులు మరియు క్రైస్తవులచే ఘనంగా ఎంచబడుచున్న అందరి మూలపురుషుడగు నోవహుతో ఆయన దానిని చెప్పెను. సృష్టికర్త ఉద్దేశ్యములో రక్తము జీవమునకు సాదృశ్యమని, సర్వమానవాళికి వెల్లడి చేయబడినది. ఆహార నియమముకంటెనూ యిది ఎక్కువయినది. స్పష్టముగా, ఒక నైతిక సూత్రము యిమిడియున్నది. మానవ రక్తమునకు గొప్ప ప్రాముఖ్యత కలదు మరియు దుర్వినియోగపరచబడకూడదు. జీవరక్తమునకు ఆయన అనుసంధానపరచిన నైతిక అంశములను కలిగిన వివరమునుండి మనము సులభముగా చూడగలుగునట్లు సృష్టికర్త వాటిని తరువాత జతపరచెను.

పురాతన ఇశ్రాయేలునకు చట్టనియమావళిని ఆయన యిచ్చినప్పుడు మరలా రక్తమును ఆయన సూచించెను. ఆ నియమావళినందలి జ్ఞానమును, నైతికతలను అనేకమంది గౌరవించినప్పటికీ, రక్తమునుగూర్చి దానియొక్క గంభీర నియమాలనుగూర్చి అతి కొద్దిమంది మాత్రమే తెలిసికొనియున్నారు. ఉదాహరణకు: “మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్తమును తినిననూ, రక్తము తినినవానికి నేను విముఖుడనై జనులలోనుండి వాని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము.” (లేవీయకాండము 17:10, 11 టనాక్‌) పిమ్మట, ఒకవేటగాడు, చచ్చిన జంతువును ఏమిచేయవలెనో దేవుడు వివరించెను: “వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను. . . . మీరు ఏ దేహరక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు మరణశిక్షనొందును.”—లేవీయకాండము 17:13, 14, టా.

యూదా ధర్మశాస్త్రము మంచి ఆరోగ్యమును పెంపొందించునని శాస్త్రవేత్తలకిప్పుడు తెలియును. ఉదాహరణకు, పాళెమునకు వెలుపల మలవిసర్జన జరుపబడవలెనని, మంటితో కప్పబడవలెనని, మరియు తీవ్రహానికరమగు రోగమును కల్గించెడి మాంసమును ప్రజలు తినకూడదని అది కోరెను. (లేవీయకాండము 11:4-8, 13; 17:15; ద్వితీయోపదేశకాండము 23:12, 13) రక్తమును గురించిన చట్టము ఆరోగ్య పరిస్థితులను కలిగియుండినప్పుడు ఇంకను ఎక్కువ అంశములు యిమిడియున్నవి. రక్తము సూచనార్థకమగు అర్థమును కలిగియున్నది. సృష్టికర్తచే అనుగ్రహింపబడిన జీవమునకు అది సాదృశ్యము. రక్తమును ప్రత్యేకముగా తలంచుటద్వారా, ప్రజలు జీవము కొరకు ఆయనపై ఆధారపడుటను చూపుదురు. అవును, రక్తమును వారు పుచ్చుకొనకపోవుటకుగల కారణమేమనగా, అది అనారోగ్యదాయకమని కాదుగాని, దేవునికి అది ప్రత్యేకార్థమును కలిగియున్నది.

జీవమును నిలుపుకొనుటకు రక్తమును తీసికొనుటపైగల సృష్టికర్తయొక్క నిషేధమును ధర్మశాస్త్రము పలుమార్లు పేర్కొనినది. “నీవు దాని (రక్తమును) తినక భూమిమీద నీళ్లవలె పారబోయవలెను. నీవు (యెహోవా దృష్టికి) యుక్తమైన దానిని చేసినందున నీకు, నీ తరువాత నీ సంతతివారికి మేలు కలుగునట్లు దాని తినకూడదు.”—ద్వితీయోపదేశకాండము 12:23-25; NIV; 15:23; లేవీయకాండము 7:26, 27; యెహెజ్కేలు 33:25. *

ఈనాడు కొందరు తలంచుదానికి విరుద్ధముగా, కేవలం అత్యవసర పరిస్థితి కారణముగా, రక్తముపైగల దేవుని శాసనము అలక్ష్య పరచబడకూడదు. ఒక యుద్ధవిపత్తునందు, కొందరు ఇశ్రాయేలీ సైనికులు జంతువులను చంపి, “వాటిని రక్తముతోనే భక్షించిరి.” అత్యవసరత దృష్ట్యా , రక్తముతో వారి జీవమును నిలుపుకొనుట వారికి యుక్తమగునా? లేదు, వారి సేనాధిపతి, వారి పద్ధతి ఒక భయంకరమైన తప్పిదమేయని సూచించెను. (1 సమూయేలు 14:31-35) కావున, జీవము విలువైనది, కాని మన జీవదాత అత్యవసరతయందు ఆయన నియమములను నిర్లక్ష్యము చేయవచ్చునని ఎన్నడు చెప్పలేదు.

రక్తము మరియు నిజమైన క్రైస్తవులు

మానవ జీవమును రక్తముతో కాపాడుటయను ప్రశ్నపై క్రైస్తవత్వము ఎచ్చట నిలుచును?

యేసు యథార్ధపరుడైన మనుష్యుడై యుండెను, అందుచే ఆయన మిక్కిలిగా గౌరవింపబడెను. సృష్టికర్త రక్తమును తీసికొనుట తప్పిదమని చెప్పెనని మరియు ఈ చట్టము విధిగా ఉన్నదని ఆయనకు తెలియును. కాబట్టి దాని చేయుటకు తీవ్రమైన వత్తిడిలో ఉన్నప్పటికీ, రక్తమునుగూర్చిన శాసనమును యేసు ఔన్నత్యపరచి యుండునని నమ్ముటకు సరియైన కారణమున్నది. యేసు “పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.” (1 పేతురు 2:22, నోక్స్‌) జీవము మరియు రక్తములయెడల గౌరవముతోపాటు ఆయన తన అనుచరులకు మాదిరి నేర్పించెను. (నీ జీవమునకు సంబంధించిన ఈ విషయమందు యేసుయొక్క స్వరక్తము ఏ విధముగా యిమిడియున్నదనుటను మనము తరువాత పరిశీలింతము.)

యేసు మరణించిన సంవత్సరములనంతరము, ఒకడు క్రైస్తవునిగా మారిన్నప్పుడు, ఇశ్రాయేలీయుల శాసనములన్నిటిని పాటించవలెనా, అను దానిగూర్చి ఒక ప్రశ్న తలెత్తినప్పుడు ఏమి జరిగెనో గమనించుము. అపొస్తలులు చేరియున్న క్రైస్తవ పరిపాలక సభనందు యిది చర్చించబడెను. నోవహునకు, ఇశ్రాయేలు జనాంగమునకు ఇవ్వబడిన రక్తమునుగూర్చిన ఆజ్ఞలుకల రచనలను యేసుయొక్క సహోదరుడైన యాకోబు సూచించెను. అది క్రైస్తవులను అట్లు బాధ్యులనుగా చేయునా?—అపొ.కార్యములు 15:1-21.

ఆ సలహా సభ వారి నిర్ణయమును అన్ని సంఘములకు పంపెను. మోషే కివ్వబడిన చట్టమును క్రైస్తవులు పాటించనవసరము లేదు, కాని “విగ్రహములకు అర్పించినవాటిని, రక్తమును, గొంతుపిసికి చంపిన దానిని జారత్వమును విసర్జించుట” వారికి “ఆవశ్యకము.” (అపొ.కార్యములు 15:22-29) అపొస్తలులు కేవలము ఆచార లేక ఆహారనియమమును పొందుపరచుటలేదు. ఆది క్రైస్తవులు అంగీకృతులైన ముఖ్య నైతిక స్వాభావికతలను ఆ శాసనం ఏర్పరచినది. సుమారు ఒక దశాబ్దము తరువాత “విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, . . . జారత్వమును మానవలసినదని” వారికి తెలియపరచిరి.—అపొ.కార్యములు 21:25.

లక్షలకొలది ప్రజలు చర్చీలకు హాజరగుట నీకు తెలియును. ఒకవేళ వారిలో అనేకులు, ఘోర అవినీతిలో పాలుపంచుకోకుండుట, విగ్రహములకు ఆరాధన చేయకుండుట క్రైస్తవ నైతికతలో ఇమిడి ఉన్నదని ఒప్పుకొనవచ్చును. అయినప్పటికీ, ఆ తప్పిదములను విసర్జించుటయను ఉన్నత నైతిక స్థాయిలోనే రక్తమును విసర్జించుటను అపొస్తలులు ఉంచుట మనకు గమనార్హము. వారి తీర్మానము: “వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా, అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక” అని ముగించబడినది.—అపొ.కార్యములు 15:29.

అపొస్తలులు చేసిన చట్టము, చాలాకాలము విధియని గ్రహించబడినది. సుమారు రెండవ శతాబ్దమందు హింసవలన మరణించకముందు, ఒక యౌవన స్త్రీ గురించి యూసెబియస్‌ చెబుతూ, క్రైస్తవులు “వివేకములేని జంతువుల రక్తమునుకూడా తినుటకు అనుమతించబడుటలేదు.” ఆమె మరణించుటకు హక్కును వినియోగించుకొనుటలేదు. జీవింపవలెనని ఆమె కోరినది, కాని తన సూత్రములతో ఆమె రాజీపడలేక పోవుచున్నది. స్వప్రయోజనముకంటె సూత్రమును ఉన్నతముగా ఉంచిన వారిని నీవు గౌరవించవా?

శాస్త్రవేత్తయగు జోసెఫ్‌ ప్రీస్టిలీ ఇలా చెప్పెను: “నోవహుకు ఇవ్వబడిన, రక్తము తినుటకు నిషేధము, తన సంతతియంతటికి విధిగా కన్పించుచున్నది . . . ఆది క్రైస్తవుల ఆచారమని అపొస్తలులు దాని నిషేధించిరని మనము వివరించినచో, దాని స్వభావమును, విస్తృతను సరిగా అర్థము చేసికొనలేకపోవుట ఎవరు అతికష్టముతో ఊహించుదురో, మనము చెప్పి ముగించలేము, అది సంపూర్ణము, శాశ్వతమని ఉద్దేశించబడినది; ఎందుకనగా శతాబ్దములుగా రక్తము ఏ క్రైస్తవులచే భుజింపబడలేదు.”

రక్తమును ఔషధముగా ఉపయోగించుట విషయమేమి?

నోవహు, మోషే లేక అపొస్తలుల కాలములలో నిశ్చయముగా తెలియబడని రక్తమార్పిడివంటి చికిత్సాపర ఉపయోగములకు రక్తముపైగల బైబిలు నిషేధము వర్తించునా?

రక్తమునుపయోగించు ఆధునిక చికిత్స ఆ కాలములో ఉండలేదు, అయితే ఔషధముగా రక్తముయొక్క ఉపయోగము ఆధునికము కాదు. 2,000 సంవత్సరములనుండి ఐగుప్తులోను, ఇతరచోట్ల, మానవ “రక్తము కుష్ఠవ్యాధికి శ్రేష్ఠమైన నివారణయని ఎంచబడెను.” అష్షూరీయుల సామ్రాజ్యము సాంకేతికముగా రాణించినప్పుడు రాజైన ఎసర్షద్దొను కుమారునికి చికిత్స చేయబడెనని ఒక వైద్యుడు ఇలా తెలిపెను: “(యువరాజు) బాగుగా కోలుకొనుచున్నాడు; రాజు, నా ప్రభువు, సంతోషముగా ఉండగలరు. 22 వ రోజు మొదలుకొని, నేను (అతనికి) త్రాగుటకు రక్తమునిచ్చితిని, అతడు (దానిని) 3 రోజులపాటు త్రాగును. ఇంకను 3 రోజులు, లోపటికి (అతనికి రక్తము) నిత్తును.” ఎసర్షద్దొను ఇశ్రాయేలీయులతో వ్యవహరములను కలిగియున్నాడు. అయినప్పటికీ, ఇశ్రాయేలీయులు దేవుని చట్టమును కలిగియుండుటచే, వారు రక్తమును ఔషధముగా ఎన్నడు త్రాగరు.

రోమా కాలములో రక్తము ఔషధముగా ఉపయోగించబడెనా? ప్రకృతి శాస్త్రవేత్తయగు ప్లినీ (అపొస్తలుల సమకాలికుడు) మరియు రెండవ శతాబ్ద వైద్యుడగు అరేటియస్‌ మూర్ఛ వ్యాధికి మనుష్య రక్తము ఒక చికిత్సయని నివేదించెను. తరువాత, టెర్టులియన్‌ ఇలా వ్రాసెను: “వినోదమునకై పోరాటములు ఏర్పాటుచేయు ప్రదేశమందు (ఎరినా) దుష్టులైన నేరస్థుల తాజా రక్తమును అత్యాశపరమైన దప్పికతో పుచ్చుకొను వారిని గమనించుము . . . మరియు వారి మూర్ఛవ్యాధి నివారణకు దానిని తీసికొనిపోవుచున్నారు.” వారికి భిన్నముగా, “(తమ) భోజనమునందు జంతురక్తమును సహితము తీసికొనరని. . . . విచారణలందు రక్తములో నిండియున్న వంటకములను మీరు వారికి అందించిరి. (అది) వారికి చట్ట విరుద్ధమని మీరు నమ్ముచున్నారని” క్రైస్తవులను గూర్చికూడా ఆయన మాట్లాడెను. కాబట్టి, ఆది క్రైస్తవులు రక్తమును పుచ్చుకొనుటకంటె మరణించుటకు సాహసించుచుండిరి.

“రక్తము దాని అనుదిన రూపము . . . వైద్యమునందు తంత్రమునందు ఒక అంశముగా సాంప్రదాయ రీతినుండి గతించలేదు” అని ఫ్లెష్‌ అండ్‌ బ్లడ్‌ నివేదించుచున్నది. “ఉదాహరణకు, 1483 లో ఫ్రాన్సుకు చెందిన 11 వ లూయి మరణించుచుండెను. ‘ప్రతిదినము అతడు క్షీణించుచుండెను, క్రొత్త గుణములుగల ఔషధములు వాడినప్పటికి ఏ ప్రయోజనము చేకూర్చలేకపోయెను; ఎట్లనగా, కొందరి పిల్లలనుండి అతడు తీసికొని త్రాగిన మనుష్యరక్తమువలన కోలుకొనగలనని అతడు తీవ్రముగా ఆశించెను.’”

రక్తమును మార్పిడి చేయుటగురించి ఏమి? దీని సంబంధముగా 16 వ శతాబ్దములో ప్రయోగములు ఆరంభమాయెను. కోపెన్‌హాగన్‌ విశ్వవిద్యాలయము నందు శరీర నిర్మాణ శాస్త్రాచార్యుడగు థామస్‌ బర్తెలిన్‌ (1616-80) ఇలా విరోధించెను: ‘వ్యాధులకు అంతర్గతమైన నివారణోపాయమని మనుష్య రక్తమును ఉపయోగించుట కొనసాగించుచున్నారు, దాని దుర్వినియోగము చేయుచున్నట్టును, ఘోరపాపము చేయుచున్నట్టును కన్పించుచున్నది. నరమాంస భక్షకులు ఖండించబడిరి. వారి ఆహార నాళమును మనుష్య రక్తముతో కళంకపరచుకొనుచున్న వారిని మనమెందుకు అసహ్యించుకోనుటలేదు? నోటిద్వారా అయినను, మార్పిడిచేయు పరికరములద్వార అయిననూ, రక్తనాళముద్వారా యితర రక్తమును పుచ్చుకొనుటకూడా అటువంటిదే. ఈ పనికి కారకులు, రక్తమును, తినుట నిషేధించబడిన దైవిక శాసనము వలన భయకంపితులగుచున్నారు.’

కావున, గత శతాబ్దములలో ఆలోచనా పరులైన ప్రజలు నోటిద్వారా రక్తమును పుచ్చుకొనుటవలె దానిని రక్తనాళముద్వారా తీసికొనుటకుకూడా బైబిలు చట్టము వర్తించునని గ్రహించిరి. బర్తెలిన్‌ ఇలా ముగించెను: “(రక్తమును) పుచ్చుకొను ఏ పద్ధతియైననూ ఒకే ఉద్దేశ్యము గురించి పొందిక కలదు, అనగా వ్యాధిగ్రస్తమైన శరీరమును పోషించుటకు లేక స్వస్థత పరచుటకు ఆ రక్తమును ఉపయోగించుట.”

ఈ సమయోచన యెహోవా సాక్షులు తీసికొను మార్పుచేయనొల్లని నిర్ణయమును అర్థము చేసికొనుటలో నీకు సహాయపడగలదు. వారు జీవమును అత్యంత విలువైనదిగా ఎంచుచు మరియు వారు మంచి వైద్య సంరక్షణను కోరుదురు. కాని, వారు ఎల్లప్పుడు ఒకేరీతిలోనున్న దేవుని ప్రమాణమును అతిక్రమించకుండుటకు నిర్ణయించుకొనిరి: సృష్టికర్తనుండి జీవమును బహుమానమని గౌరవించువారు రక్తమును పుచ్చుకొనుటద్వారా జీవమును నిలుపుకొనుటకు ప్రయత్నించరు.

ఇంకనూ, రక్తము జీవితములను కాపాడునను వాదనలు సంవత్సరములుగా చేయబడుచున్నవి. ఒకడు తీవ్ర రక్తస్రావము కలిగినప్పుడు, రక్తము ఎక్కించబడినవాడై త్వరితగతిన కోలుకొన్నాడను రోగులనుగూర్చి వైద్యులు సూచించవచ్చును. కావున ‘వైద్యరీత్యా ఇది ఎంతవరకు వివేకము లేక అవివేకమైనదని’ నీవు ఆశ్చర్యపడవచ్చును. రక్తముతో చికిత్సకు మద్దతుగా వైద్యపరమైన నిదర్శనము అందించబడును. ఆ విధముగా, వాస్తవములను తెలిసికొని రక్తమునుగురించి సవివరమైన ఎంపికను చేసికొనుటకు నీకై నీవే బాధ్యుడవు కమ్ము.

[అధస్సూచీలు]

^ పేరా 3 పౌలు, అపొ.కార్యములు 17:25, 28 లో, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆ ఫ్‌ది హోలీ స్క్రిప్చర్స్‌.

^ పేరా 9 అటువంటి నిషేధములే ఆ తరువాత ఖురాన్‌లో వ్రాయబడెను.

[4వ పేజీలోని బాక్సు]

“ఇందు మూలముగా సరియైన క్రమ విధానంలో [అపొ.కార్యములు 15 లో] ఏర్పరచబడిన నియమములు ఆవశ్యకము అనుటకు యోగ్యమైనవి. అపొస్తలుల మనస్సులో ఇది తాత్కాలికమైన ఏర్పాటు లేక తాత్కాలిక ప్రమాణము కాదని బలమైన నిదర్శనమును ఇచ్చుచున్నది.”—ప్రొఫెసర్‌ ఎడ్వర్డ్‌ రూస్‌, స్ట్రాస్‌బోర్గ్‌ విశ్వవిద్యాలయము.

[5వ పేజీలోని బాక్సు]

మార్టిన్‌ లూథర్‌ అపొస్తలుల తీర్మానశాసనము యొక్క అంతరార్థములను సూచించెను: “ఈ సభాశాసనమును అనుసరించు ఒక చర్చిని మనమిప్పుడు కలిగియుండవలెనన్న, . . . ఇకమీదట ఏ రాజుకాని, ప్రభువుకాని, ఊరిపెద్దకాని లేక కాపలాదారుకాని రక్తములో ఉడికించబడిన బాతు, జింక, కణుజు లేక పంది మాంసములను తినకూడదని మనము బోధించి నిర్బంధము చేయవలెను . . . మరియు ఊరిపెద్దలు, కాపలాదారులు ప్రత్యేకముగా ఎర్రని వంటకమును రక్తముయొక్క వంటకమును విసర్జింపవలెను.”

[క్రెడిట్‌ లైను]

Woodcut by Lucas Cranach

[6వ పేజీలోని బాక్సు]

“దేవుడు మరియు మనుష్యులు భిన్నమైన రీతిలో విషయములను దృష్టింతురు. మన దృష్టికి ముఖ్యమైనదిగా కన్పించునది, అనంత జ్ఞానముయొక్క అంచనాలో లెక్కలేనిదిగా ఉండును; మనకు అల్పమైనదిగా కన్పించునది తరచుగా దేవునికి అతి ప్రాముఖ్యమైనదిగా నుండును. అది ఆదినుండి అట్లేవున్నది.”—“ఏన్‌ ఎంక్వయిరీ ఇన్‌టుది లాఫుల్‌నెస్‌ ఆఫ్‌ ఈటింగ్‌ బ్లడ్‌,” అలెగ్జాండర్‌ పిరీ, 1787.

[3వ పేజీలోని చిత్రం]

Medicine and the Artist by Carl Zigrosser/Dover Publications

[4వ పేజీలోని చిత్రం]

పర్యవసానములు ఎట్లున్నను, ఆది క్రైస్తవులు రక్తముపైగల దేవుని శాసనమును మీరుటకు తిరస్కరించిరి

[7వ పేజీలోని చిత్రం]

చారిత్రాత్మక సభయందు, క్రైస్తవ పరిపాలక సభ రక్తముపై దేవుని శాసనము ఇంకను విధిగా ఉన్నదని ధృవీకరించినది

[క్రెడిట్‌ లైను]

Painting by Gérôme, 1883, courtesy of Walters Art Gallery, Baltimore