కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 3

ఏదెను తోటలో జీవితం ఎలా ఉండేది?

ఏదెను తోటలో జీవితం ఎలా ఉండేది?

యెహోవా ఆదాముహవ్వలకు కావాల్సినవన్నీ ఇచ్చాడు. ఆదికాండం 1:28

దేవుడు మొదటి స్త్రీని చేసి ఆదాముకు భార్యగా ఇచ్చాడు, ఆమె పేరు హవ్వ.—ఆదికాండం 2:21, 22.

వాళ్ల మనసుల్లో, శరీరాల్లో ఏ లోపం లేదు.

వాళ్లు ఏదెను తోట అనే అందమైన పరదైసులో ఉండేవాళ్లు. అందులో ఒక నది, రకరకాల పండ్ల చెట్లు, జంతువులు ఉండేవి.

యెహోవా వాళ్లతో మాట్లాడేవాడు, వాళ్లకు నేర్పించేవాడు. ఆయన చెప్పింది వింటే వాళ్లు పరదైసు భూమ్మీద నిరంతరం జీవించేవాళ్లు.

ఒక చెట్టు పండ్లు తినొద్దని దేవుడు చెప్పాడు. ఆదికాండం 2:16, 17

యెహోవా ఆదాముహవ్వలకు ఆ తోటలో ఉన్న ఒక చెట్టును చూపించి, దాని పండ్లు తింటే చనిపోతారని చెప్పాడు.

ఒక దేవదూత దేవునికి ఎదురుతిరిగాడు, అతనే సాతాను.

ఆదాముహవ్వలు యెహోవా మాట వినడం సాతానుకు ఇష్టం లేదు. అతను ఒక పామును ఉపయోగించుకొని హవ్వతో మాట్లాడాడు. ఆ చెట్టు పండ్లు తింటే ఆమె చనిపోదు కానీ దేవునిలా అవుతుందని చెప్పాడు. అది అబద్ధం.—ఆదికాండం 3:1-5.