కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 1

దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు?

దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు?

బైబిలు ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. 2 తిమోతి 3:16

నిజమైన దేవుడు తన ఆలోచనల్ని ఒక పవిత్ర పుస్తకంలో రాయించాడు, ఆ పుస్తకమే బైబిలు. ఆయన దాన్ని మనుషులతో రాయించాడు. దేవుడు మీకు చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయాలు అందులో ఉన్నాయి.

మనకు ఏది మంచిదో దేవునికి తెలుసు. ఆయనే నిజమైన తెలివికి ఆధారం. ఆయన చెప్పేది వింటే మీరు తెలివిగలవాళ్లు అవుతారు.—సామెతలు 1:5.

భూమ్మీద ఉన్న ప్రతీ ఒక్కరు బైబిలు చదవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఇప్పుడు చాలా భాషల్లో ఉంది.

దేవుడు చెప్పేది వినాలంటే మీరు బైబిలు చదవాలి, అర్థం చేసుకోవాలి.

అన్ని దేశాల ప్రజలు దేవుని గురించి నేర్చుకుంటున్నారు. మత్తయి 28:19

బైబిల్ని అర్థం చేసుకోవడానికి యెహోవాసాక్షులు మీకు సహాయం చేస్తారు.

వాళ్లు అన్ని దేశాల్లో దేవుని గురించిన సత్యం నేర్పిస్తున్నారు.

అలా నేర్చుకోవడానికి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. దగ్గర్లో ఉన్న యెహోవాసాక్షుల రాజ్యమందిరానికి వెళ్లి కూడా మీరు దేవుని గురించి నేర్చుకోవచ్చు.