కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ కొరకైన గ్రంథమా?

మీ కొరకైన గ్రంథమా?

మీ కొరకైన గ్రంథమా?

“పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు” అని సొలొమోను దాదాపు 3,000 సంవత్సరాల క్రిందటే తెలియజేశాడు. (ప్రసంగి 12:12) ఆ వ్యాఖ్యానం మునుపటిలానే ఈరోజూ తగినదైవుంది. ప్రామాణిక పుస్తకాలతోపాటూ ప్రతీ సంవత్సరమూ వేలాది క్రొత్త పుస్తకాలు ముద్రించబడుతున్నాయి. ఎంపికచేసుకోవడానికి ఎన్నో పుస్తకాలు ఉండగా మీరు బైబిల్నే ఎందుకు చదవాలి?

అనేకమంది పుస్తకాల్ని ఆహ్లాదం కొరకో, సమాచారాన్ని తెల్సుకోవడానికో లేక బహుశా ఆ రెండు కారణాల్నిబట్టీ చదువుతారు. బైబిలు చదవడం విషయంలోనూ అది నిజమే కావొచ్చు. దాన్ని చదవడం, ప్రోత్సాహకరమైనదిగా, ఆహ్లాదకరమైనదిగా కూడా ఉండవచ్చు. అయితే, బైబిల్లో అంతకన్నా ఎక్కువే ఉంది. అది జ్ఞానానికి అసమానమైన మూలం.—ప్రసంగి 12:9, 10.

మానవులు ఎంతో కాలంనుండి యోచించిన ప్రశ్నలకు అంటే మన గతాన్ని గూర్చిన, మన వర్తమానాన్ని గూర్చిన, మన భవిష్యత్తును గూర్చిన ప్రశ్నలకు బైబిలు జవాబుల్ని ఇస్తోంది. మనం ఎక్కడి నుండి వచ్చాము? జీవిత సంకల్పమేమిటి? జీవితంలో సంతోషాన్ని మనమెలా కనుగొనగలం? భూమిపై జీవం ఎల్లప్పుడూ ఉంటుందా? భవిష్యత్తులో మనకొరకు ఏమి వేచివుంది? అని అనేకమంది ఆలోచిస్తారు.

బైబిలు కచ్చితమైనదనీ, ప్రామాణికమైనదనీ ఇక్కడ ఇవ్వబడిన రుజువుల సంఘటితశక్తి స్పష్టంగా నిరూపిస్తోంది. నేడు అర్థవంతమైన సంతోషకరమైన జీవితాల్ని గడిపేందుకు దాని ఆచరణాత్మకమైన సలహా ఎలా తోడ్పడగలదో మనమిప్పటికే పరిశీలించాం. వర్తమానాన్ని గూర్చిన దాని జవాబులు సంతృప్తిదాయకంగా ఉన్నాయి గనుక గతకాలాన్ని గూర్చిన దాని జవాబులూ, భవిష్యత్తును గూర్చిన దాని ప్రవచనాలూ జాగ్రత్తతో కూడిన అవధానానికి అర్హమైనవే.

మరింత ప్రయోజనాన్ని ఎలా పొందడం

అనేకమంది ప్రజలు బైబిల్ని చదవనారంభించినా, వాటిలోని కొన్ని భాగాల్ని అర్థంచేసుకోవడం కష్టమైనప్పుడు చదవడం ఆపుచేసేశారు. మీ అనుభవం కూడా అదే అయితే, బహుశా మీకు సహాయపడే కొన్ని విషయాలు ఉన్నాయి.

ఒక విశ్వసనీయమైన ఆధునిక భాషా అనువాదాన్ని ఎంపికచేసుకోండి. యేసు జీవితాన్ని గూర్చిన సువార్త వృత్తాంతాల్ని చదవడంద్వారా కొంతమంది బైబిల్ని చదవడం ప్రారంభిస్తారు. కొండమీది ప్రసంగంలోని ఆయన జ్ఞానయుక్తమైన బోధలు మానవ నైజాన్ని గూర్చిన మంచి అవగాహనను చూపిస్తాయి. అవి మన జీవన విధానాన్ని ఎలా మెరుగుపర్చుకోవాలో తెలియజేస్తాయి.—మత్తయి 5 నుండి 7 అధ్యాయాల్ని చూడండి.

బైబిల్ని చదవడంతోపాటూ విషయానుసారంగా పఠనం చేయడం మరింత సమాచారాన్ని అందజేసేదిగా ఉండగలదు. ఇందులో ఫలానా విషయంపై బైబిలు ఏమి చెబుతుందన్నదాన్ని విశ్లేషించడం చేరివుంది. ప్రాణాన్ని గూర్చీ, పరలోకాన్ని గూర్చీ, భూమిని గూర్చీ, జీవాన్ని గూర్చీ, మరణాన్ని గూర్చీ, అలాగే దేవుని రాజ్యం అంటే ఏమిటి, అది ఏమి నెరవేరుస్తుంది వంటి విషయాల్ని గూర్చీ బైబిలు నిజంగా ఏమి చెబుతుందన్న దాన్ని తెలుసుకొని మీరు బహుశా ఆశ్చర్యపోవొచ్చు. * యెహోవాసాక్షులు, విషాయానుసారంగా చేసే బైబిలు పఠనం కొరకైన కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తారు. రెండవ పేజీలోవున్న చిరునామాల్లో తగిన చిరునామాను ఉపయోగించి ప్రకాశకులకు రాసి మీరు ఆ పఠన కార్యక్రమాన్ని గూర్చిన వివరాల్ని తెలుసుకోవచ్చు.

రుజువుల్ని పరిశీలించిన తర్వాత, బైబిలు దేవుని నుండి వచ్చిందని అనేకులు అంగీకరించారు. లేఖనాలు ఆయనను “యెహోవా” అని గుర్తిస్తున్నాయి. (కీర్తన 83:18) బైబిలు దైవిక మూలం నుండి వచ్చిందని మీరు బహుశా ఒప్పించబడకపోవొచ్చు. కానీ మీకై మీరు దాన్నెందుకు పరిశీలించకూడదు? కాల పరిమితిలేని బైబిలు జ్ఞానం యొక్క ఆచరణాత్మకమైన విలువను నేర్చుకోవడం, ధ్యానించడం, బహుశా అనుభవించడం అనే ప్రక్రియల తర్వాత, బైబిలు నిజంగా సర్వమానవాళి కొరకైన గ్రంథమనీ మరి విశేషంగా మీ కొరకైన గ్రంథమనీ మీరు భావిస్తారని మేము విశ్వసిస్తున్నాం.

[అధస్సూచి]

^ పేరా 9 వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం, విషయానుసారంగా బైబిల్ని పఠించడానికి అనేకమందికి తోడ్పడింది.