ఆహ్వానితులకు సమాచారం
అటెండెంట్లు అటెండెంట్లు ఉన్నది మీకు సహాయం చేయడానికే. పార్కింగ్, సీట్లు పెట్టుకోవడం, హాలు లోపలికి వెళ్లడం-బయటికి రావడం వంటివాటి గురించి వాళ్లు నిర్దేశాలిస్తారు. దయచేసి వాళ్లకు పూర్తిగా సహకరించండి.
బాప్తిస్మం ప్రత్యేకంగా సూచిస్తే తప్ప, బాప్తిస్మ అభ్యర్థుల కోసం మెయిన్ ఫ్లోర్‌లో స్టేజీకి ముందు భాగంలో ఉన్న సీట్లు కేటాయించబడతాయి. శనివారం ఉదయం బాప్తిస్మ ప్రసంగం మొదలవ్వకముందే బాప్తిస్మ అభ్యర్థులు అక్కడ కూర్చోవాలి. ప్రతీ ఒక్కరు టవల్, అలాగే బాప్తిస్మం తీసుకునేటప్పుడు వేసుకోవడానికి మర్యాదకరమైన బట్టలు తెచ్చుకోవాలి.
విరాళాలు ఈ సమావేశంలో అందరికీ సరిపడా సీట్లు, సౌండ్ సిస్టమ్, వీడియో, మరితర సదుపాయాలు ఏర్పాటు చేశారు. మనం ఈ సమావేశాన్ని చక్కగా ఆనందించి, యెహోవాకు మరింత దగ్గరవ్వడానికి అవి సహాయం చేస్తాయి. ఆ ఏర్పాట్లన్నిటికి ఎంతో డబ్బు ఖర్చయింది. మీరు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలు ఈ ఖర్చులకే కాక, ప్రపంచవ్యాప్త పనికి మద్దతివ్వడానికి కూడా ఉపయోగపడతాయి. సులభంగా గుర్తుపట్టగలిగే విరాళాల పెట్టెలు హాలులో అక్కడక్కడ ఉంచబడ్డాయి. మీరు ఆన్‌లైన్‌లో కూడా విరాళం ఇవ్వవచ్చు, దానికోసం donate.pr418.com చూడండి. మీ విరాళాలకు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. రాజ్య సంబంధ పనులకు ఉదారంగా మద్దతిస్తున్నందుకు పరిపాలక సభ మీకు కృతజ్ఞతలు చెప్తుంది.
ప్రథమ చికిత్స ఇది అత్యవసర పరిస్థితుల కోసం మాత్రమేనని దయచేసి గుర్తుంచుకోండి.
పోగొట్టుకున్న-దొరికిన వస్తువులు ఇతరుల వస్తువులేమైనా మీకు దొరికితే, వాటిని ఈ విభాగానికి అప్పగించండి. ఒకవేళ మీరేదైనా పోగొట్టుకుంటే, ఈ విభాగానికి వెళ్లి చూసుకోండి. తల్లిదండ్రుల నుండి తప్పిపోయిన పిల్లల్ని ఈ విభాగానికి తీసుకెళ్లాలి. అయితే ఇలాంటి ఆందోళనకరమైన పరిస్థితి రాకుండా దయచేసి మీ పిల్లల్ని మీ దగ్గరే ఉంచుకొని, జాగ్రత్తగా చూసుకోండి.
సీట్లు దయచేసి ఇతరుల గురించి ఆలోచించండి. మీ కుటుంబ సభ్యుల కోసం, మీతోపాటు మీ వాహనంలో వచ్చేవాళ్ల కోసం, మీ ఇంట్లో ఉంటున్నవాళ్ల కోసం, లేదా మీ బైబిలు విద్యార్థుల కోసం సీట్లు ఆపుకోవచ్చు. దయచేసి మీకు అవసరంలేని సీట్లలో ఏమీ పెట్టకండి.
స్వచ్ఛంద సేవ సమావేశ ఏర్పాట్లకు సంబంధించిన పనుల్లో సహాయం చేయాలని ఇష్టపడుతుంటే, దయచేసి సమాచార-స్వచ్ఛంద సేవా విభాగానికి తెలియజేయండి.
ప్రత్యేక కూటం
రాజ్య సువార్తికుల కోసం పాఠశాల 23 నుండి 65 సంవత్సరాల మధ్య వయసు ఉండి, ఇంకా ఎక్కువగా పరిచర్య చేయాలని కోరుకుంటున్న పయినీర్లు, ఆదివారం మధ్యాహ్నం రాజ్య సువార్తికుల కోసం పాఠశాల అభ్యర్థులకు జరిగే కూటానికి హాజరవ్వవచ్చు. ఆ కూటం జరిగే సమయం, స్థలం గురించి సమావేశంలో తెలియజేస్తారు.
యెహోవాసాక్షుల పరిపాలక సభ ఏర్పాటు చేసింది
© 2020 Watch Tower Bible and Tract Society of Pennsylvania