కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు?

సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు?

అసంబద్ధంగా కనిపిస్తున్న ఈరెండు పరిస్థితుల గురించి ఆలోచించండి: ఒకానొక పారిశ్రామిక దేశంలోని ప్రజల్లో 90 శాతంకంటే ఎక్కువమంది తాము చాలా సంతోషంగా ఉన్నట్లు లేదా కొంతమటుకు సంతోషంగానే ఉన్నట్లు భావిస్తున్నారు. కానీ, ఆ దేశంలో అత్యధికంగా ఉపయోగించబడుతున్న 10 రకాల మందుల్లో 3 రకాల మందులు మాత్రం డిప్రెషన్‌ను తగ్గించడానికి ఇవ్వబడుతున్నాయి. అదే దేశంలో, 91 శాతం ప్రజలు తమ కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉన్నట్లు భావిస్తున్నారు. అయినా, అక్కడి వివాహాల్లో దాదాపు సగం విడాకులకు గురవుతున్నాయి!

వాస్తవానికి, ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి సమానంగా ఉండే 18 దేశాల ప్రజలపై జరిపిన ఒక సర్వే, “ప్రపంచంలోని అత్యధిక జనాభా భవిష్యత్తును గురించి నిరాశా దృక్పథంతో ఉన్నట్లు” సూచించింది. దీన్ని బట్టి స్పష్టమౌతున్నదేమంటే చాలామంది పూర్తి సంతృప్తితో జీవించడంలేదు. మరి మీ విషయమేమిటి? నిజంగా సంతృప్తికరమైన జీవితం జీవించడానికి మీకు సహాయం చేసే ఉద్దేశంతోనే ఈ బ్రోషూరు తయారుచేయబడింది.