కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 5

దేవుణ్ణి తెలుసుకోవడం

దేవుణ్ణి తెలుసుకోవడం

 మీకు సలహా అవసరమైనప్పుడు నమ్మకస్థుడైన వ్యక్తి దగ్గరకే వెళ్తారు కదా? మీరు నమ్మదగ్గ చోటినుండే సలహా వస్తే దానివల్ల మీకు తక్షణమే ప్రయోజనాలు కలిగినా కలగకపోయినా, ఆ సలహాను అనుసరించేందుకే మీరు మొగ్గుచూపుతారు. బైబిల్లో కనబడే ఆచరణాత్మక సలహానుండి మీరు నిజంగా ప్రయోజనం పొందాలంటే, దాని గ్రంథకర్తతో పరిచయం పెంచుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, మీరాయనకు ‘స్నేహితునిగా’ కూడ పరిగణింపబడవచ్చు!​— యెషయా 41: 8.

యెషయా గ్రంథపు హీబ్రూ మూలపాఠంలో కనబడే దేవుని నామం

2 మీరు ఎవరితోనైనా స్నేహం చేయాలనుకుంటే, ఆ వ్యక్తి పేరు తెలుసుకోవాలని తప్పకుండా అనుకుంటారు. మరి, బైబిలులోని దేవునికి ఒక పేరుందా? ఆయనిలా ప్రకటించాడు: “యెహోవాను నేనే; ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను.” (యెషయా 42:8) యెహోవా అనేదే ఆయన పేరు, అది హీబ్రూ భాషలో יהוה (కుడి నుండి ఎడమకు చదువబడుతుంది) అని వ్రాయబడుతుంది. బైబిలులోని హీబ్రూ లేఖనాల్లో ఆ పేరు దాదాపు 7,000 సార్లు కనబడుతుంది. “తానే కర్త అవుతాడు” అని అర్థమున్న దైవనామం, యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడానికి, తాను ఎలా కావాలనుకుంటే అలా అవ్వగలడు లేదా తన సృష్టిని ఎలా కావాలనుకుంటే అలా అయ్యేలా చేయగలడు అని సూచిస్తోంది. అంతేకాదు, ఆయన నామము నెర​వేరబోతున్న ఒక చర్యను సూచించే హీబ్రూ వ్యాకరణరూపంలో ఉంది. అందులో అంత గమనార్హమైనదేమిటి? యెహోవా తన సంకల్పాలను నెరవేర్చాడని, ఇప్పటికీ నెరవేరుస్తున్నాడని అది మనకు తెలియజేస్తుంది. ఆయన సజీవుడైన దేవుడు, అంతేగాని వ్యక్తిత్వంలేని ఒక శక్తి కాదు!

3 యెహోవా సృష్టికర్త అయ్యాడు. (ఆదికాండము 1: 1) ఆయన “ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవముగల” దేవుడు. (అపొస్తలుల కార్యములు 14:15) యెహోవా, మొదటి మానవ దంపతులైన ఆదాము హవ్వలతో సహా సమస్తాన్ని సృష్టించాడు. ఆ విధంగా, దేవుడు ‘జీవపు ఊటగా’ ఉన్నాడు. (కీర్తనలు 36: 9) ఆయన జీవ పోషకుడు కూడా అయ్యాడు. కాబట్టే, “ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్ను గూర్చి సాక్ష్యములేకుండ చేయలేదు.” (అపొస్తలుల కార్యములు 14:17) ఆఫ్రికా, ఆసియాల్లో అనేకులు, తమ జన్మకారకులని పూర్వికులను ఆరాధిస్తుంటారు. అలాంటప్పుడు మొదటి మానవ దంపతుల్ని సృష్టించి, వారికి సంతానోత్పత్తి సామర్థ్యం ఇచ్చిన సృష్టికర్తకు, జీవపోషకునికి తాము మరింత రుణపడియున్నామని వారు భావించవద్దా? ఆ వాస్తవాన్ని గురించి ధ్యానించడం మూలంగా మీరు ఆనందాశ్చర్యాలతో ఇలా ఎలుగెత్తి చెప్పేలా పురికొల్పబడుతుండవచ్చు: ‘ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు.’​— ప్రకటన 4:10, 11.

4 బైబిలు పుటలనుండి మీ సృష్టికర్తయైన యెహోవాను గురించి తెలుసుకొని, ఆయనెలాంటి దేవుడో మీరు నేర్చుకోగలరు. అది, “దేవుడు ప్రేమాస్వరూపి” అని వెల్లడి చేస్తోంది. (1 యోహాను 4:16; నిర్గమకాండము 34:6, 7) మీరు బైబిలును ఆదికాండము నుండి ప్రకటన వరకు చదువుతుండగా, ఆయన నిజంగానే ఎంతో ప్రేమగల దేవుడని చూపించే అనేక వృత్తాంతాలను చూస్తారు. మీ సృష్టికర్తను తెలుసుకొనేందుకు దేవుని వాక్యాన్ని రోజూ చదివే అలవాటు ఎందుకు చేసుకోకూడదు? బైబిలులోని అంశాలతో పరిచయమున్న వారి సహాయంతో మీరు బైబిలును జాగ్రత్తగా అధ్యయనం చెయ్యండి. (అపొస్తలుల కార్యములు 8:26-35) అలా చేయడం ద్వారా, ఆయన న్యాయమైన దేవుడని, దుష్టత్వాన్ని ఎల్లకాలం అనుమతించడనీ చూస్తారు. (ద్వితీయోపదేశకాండము 32: 4) ప్రేమను న్యాయాన్ని సమతూకంగా ఉంచగలగడం మానవులకు సాధ్యం కాదు, అయితే తన జ్ఞానాన్నిబట్టి యెహోవా వాటిని పరిపూర్ణమైన సమతూకంలో ఉంచగలడు. (రోమీయులు 11:33; 16:25-27) ఆయన సర్వశక్తిగల దేవుడు కాబట్టి, తన సంకల్పాలను నెరవేర్చడానికి తానేం చేయాలనుకున్నా అది చేసే శక్తి ఆయనకుంది. (ఆదికాండము 17: 1) బైబిల్లో మీరు కనుగొనే జ్ఞానయుక్త సలహాను అన్వయించుకొనేందుకు ప్రయత్నించండి, అప్పుడు ఆయన సలహా అన్ని సందర్భాల్లో మన మేలుకొరకే పనిచేస్తుందని మీరు గ్రహించి మీ సృష్టికర్తపట్ల మరింత కృతజ్ఞతను కలిగివుంటారు.

ప్రార్థన ద్వారా యెహోవాను ఎందుకు సమీపించకూడదు?

5 దేవుణ్ణి సమీపించేందుకు మరో మార్గం కూడా ఉంది. అది ప్రార్థన. యెహోవా “ప్రార్థన ఆలకించువాడు.” (కీర్తన 65: 2) ఆయన “మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ”గలడు. (ఎఫెసీయులు 3:20) మీతో అవసరం పడ్డప్పుడు మాత్రమే మీ దగ్గరకు వచ్చే “స్నేహితుణ్ణి” గురించి మీరేమనుకుంటారు? బహుశ అతని గురించి మీరు ఉన్నతంగా భావించరు. అదే ప్రకారంగా, ప్రార్థనాధిక్యతను కేవలం మీకు అవసరమైన వాటిని అడగడానికి మాత్రమే కాకుండా, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేందుకు, ఆయనను స్తుతించేందుకు ఉపయోగించుకుంటారనడంలో ఎటువంటి సందేహమూ లేదు.​— ఫిలిప్పీయులు 4:6, 7; 1 థెస్సలొనీకయులు 5:17, 18.