కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 2

సంతృప్తికరమైన జీవితం గడపడం కోసం సలహాలు

సంతృప్తికరమైన జీవితం గడపడం కోసం సలహాలు

 మీకేదైనా సమస్య ఎదురైనప్పుడు సలహా కోసం మీరెక్కడికి వెళ్తారు? బహుశా మీరు మీ ప్రాణ స్నేహితుడి దగ్గరికో లేదా అనుభవంగల సలహాదారుడి దగ్గరికో వెళ్తుండవచ్చు. కావల్సిన సమాచారం లభించే గ్రంథాలయాల్లాంటి చోట్ల వెదకడం సహాయకరంగా ఉండవచ్చు. లేదా కొందరు ప్రాచ్యదేశ ప్రజలు “బామ్మ జ్ఞానం” అని పిలిచే జ్ఞానం కోసం, మీరు పెద్దవారి దగ్గరికి వెళ్ళి ఏళ్ళ తరబడి వారు గడించిన అనుభవం నుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుండవచ్చు. మీరు ఎలాంటి పద్ధతిని ఇష్టపడినా, సమస్యను పరిష్కరించుకోవడానికి అమూల్యమైన చిట్కాలను అందించే సంక్షిప్త జ్ఞానవాక్కులను పరిశీలించడం మంచిది. మీకు సహాయకరంగా ఉండే మంచి సలహాలు మచ్చుకు కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి.

‘పురుషులు తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు’

2 కుటుంబ జీవితం: అనారోగ్యకరమైన ప్రభావాలతో నిండివున్న లోకంలో తమ పిల్లలను పెంచడం విషయంలో అనేకమంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ సలహాను విచారించడం సహాయకరంగా ఉండగలదు: “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.” 1 పిల్లలు పెరిగి పెద్దవారౌతుండగా వారికి “త్రోవ,” అంటే వారు పాటించాల్సిన ప్రమాణాలు అవసరమవుతాయి. అనేకానేకమంది నిపుణులు పిల్లలకు ప్రయోజనాత్మక నియమాలు పెట్టడంలోని ప్రాముఖ్యతను గ్రహించారు. తల్లిదండ్రుల జ్ఞానయుక్తమైన ప్రమాణాలు పిల్లల్లో భద్రతాభావాన్ని కలిగిస్తాయి. అంతేకాక, “బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.” 2 “బెత్తము” పిల్లలను దారితప్పనీయకుండా వారిపై తల్లిదండ్రులు ప్రేమతో ఉపయోగించాల్సిన అధికారాన్ని సూచిస్తోంది. అధికారం ఉపయోగించడమంటే పిల్లల్ని హింసించడంకాదు. తల్లిదండ్రులకివ్వబడే సలహా ఏమిటంటే: “మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.” 3

“బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము”

3భార్యాభర్తల మధ్య ఉండే గట్టి అనుబంధమే సంతోషభరిత కుటుంబానికి ఆధారం. అలాంటి అనుబంధానికి అవసరమైనదేమిటి? “పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు; భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.” 4 ప్రేమ మరియు గౌరవం కుటుంబం సాఫీగా నడవడానికి సహాయపడతాయి. ఈ సలహా పనిచేయాలంటే, పరస్పర సంభాషణ చాలా ప్రాముఖ్యం ఎందుకంటే “ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును.”5 హృదయపూర్వక సంభాషణను పురికొల్పాలంటే తన జీవితభాగస్వామి భావాలను గ్రహించేంత అంతర్దృష్టి పొందడానికీ, అతని/ఆమె యొక్క నిజమైన భావాలేమిటో తెలుసుకోవడానికీ ప్రయత్నించాలి. ఒక వ్యక్తి మనస్సు లోతుగా ఉన్న బావిలోని నీళ్ళవంటిది, అయితే తెలివైనవాడు [లేదా, తెలివైన స్త్రీ] బయటకు లాక్కుంటాడు” 5 అని గుర్తుంచుకోవడం జ్ఞానయుక్తం. 6

అనుకూల దృక్పథంతో, ఉల్లాసపరిచే సంబంధాలను అభివృద్ధి చేసుకోవడానికి చొరవ తీసుకోవాలి

4ఒకప్పుడు తల్లిదండ్రులను ప్రగాఢ గౌరవంతో చూసుకున్న దేశాల్లో కూడా, తమ పిల్లల చేత ఒంటరిగా వదిలేయబడిన అనేకమంది తమ వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఇప్పటికైనా వారి పిల్లలు ఈ జ్ఞానవాక్కులను విచారించడం మంచిది: “తలిదండ్రులను సన్మానింపుము.” 7 “నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.”8 8 “తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు.”  9మరోవైపు వృద్ధ తల్లిదండ్రులు కూడా అనుకూల దృక్పథాన్ని కలిగివుండాలి, అలాగే ఉల్లాసకరమైన సంబంధాలను పెంచుకునేందుకు చొరవ తీసుకోవాలి. “వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి.” 10

5మద్యపానం: నిజమే “ద్రాక్షారసపానము . . . ప్రాణమునకు సంతోషకరము,” 11 అలాగే మత్తుపానీయాలు ఒకడు ‘తన శ్రమను ఇక తలంచకుండా’ 12 చేస్తుండవచ్చు. కానీ, “ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు” 13 అని గుర్తుంచుకోండి. అధికంగా త్రాగడంవల్ల కలిగే పరిణామాల గురించి ఆలోచించండి: ‘అది [ద్రాక్షారసము] సర్పమువలె కరచును, కట్లపామువలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు. . . . నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరల దాని వెదకుదును అని నీవనుకొందువు.’ 14 మత్తుపానీయాలు తగిన మోతాదులో తీసుకోవడం ప్రయోజనకరంగా ఉండవచ్చు, కానీ వాటిని అతిగా ఎన్నడూ తీసుకోకూడదు.

6డబ్బు నిర్వహణ: ఉన్న డబ్బును జ్ఞానయుక్తంగా ఉపయోగించడం ద్వారా కొన్ని సందర్భాల్లో ఆర్థిక సమస్యలను నివారించుకోవచ్చు. ఈ సలహాను ఆలకించండి: “ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును.” 15 అతిగా త్రాగడాన్ని, మాదక ద్రవ్యాల అలవాటు, జూదమాడటం వంటి దురలవాట్లను విసర్జించడం ద్వారా మన కుటుంబాలను సరైన విధంగా పోషించడానికి మన డబ్బును ఉపయోగించవచ్చు. అయినా చాలామంది తమకున్న దానిలో సర్దుకొని జీవించకపోవడం మూలంగా కేవలం అప్పులు తీర్చడానికే కష్టపడి పనిచేసే పరిస్థితికి చేరుకుంటారు. మరికొందరైతే వడ్డీలు కట్టడానికే మరొకచోట అప్పు చేస్తుంటారు. ఈ క్రింద ఇవ్వబడిన జ్ఞానవాక్కులను మనసులో ఉంచుకోవడం సహాయకరంగా ఉంటుంది: “వ్యర్థమైనవాటిని అనుసరించువారికి కలుగు పేదరికము ఇంతంతకాదు.” 16 కాబట్టి మనల్ని మనం, ‘నేను కొనాలనుకుంటున్న వస్తువులు నిజంగా అవసరమేనా?’ కేవలం కొన్నిసార్లే ఉపయోగించిన తర్వాత అటకమీద పడేసిన వస్తువులు ఎన్ని లేవు?’ అని ప్రశ్నించుకోవచ్చు. ఒక శీర్షికా రచయిత ఇలా వ్రాశాడు: “నరుని అవసరాలు కొన్నే​—⁠కానీ కోరికలు అనంతం.” ఈ జ్ఞానవాక్కులను పరిశీలించండి: “మనమీ లోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము. . . . ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి . . . నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.” 17

7ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి కష్టించి పనిచేయడం ఎంతగానో దోహదపడుతుంది. “సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. . . . ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని, నీవనుచుందువు; అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయొద్దకు వచ్చును.”  18శ్రద్ధతో ప్రణాళిక వేసుకోవడం, ఆచరణాత్మకంగా ఉండే ఆదాయవ్యయాల అంచనాల పట్టిక తయారుచేసుకోవడం కూడా సహాయకరంగా ఉంటుంది. “మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా?” 19

“తన పనిలో నిపుణతగలవానిని చూచితివా?”

8మన తప్పేమీ లేకపోయినప్పటికీ మనం బీదరికం అనుభవిస్తుంటే అప్పుడేమిటి? ఉదాహరణకు, మనం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, ఏదైనా ఆర్థిక సంక్షోభం కారణంగా మనం నిరుద్యోగులం కావచ్చు. లేదా అధికశాతం ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన జీవించే దేశంలో మనం నివసిస్తుండవచ్చు. అప్పుడెలా? “జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందినవారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము.”  20అంతేకాకుండా ఈ సలహా కూడా విచారించండి: “తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.” 21 మరి ఉద్యోగం సంపాదించడానికి సహాయపడే నైపుణ్యతలను మనం నేర్చుకోగలమా?

“ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును”

9ఈ క్రింది సలహా అసంబద్ధంగా ఉన్నట్లనిపించవచ్చు, కానీ అది నిజంగా సమర్థవంతమైనది: ‘ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; . . . మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడును.’  22దీని అర్థం తిరిగి తమకు ఇస్తారన్న ఆశతో ఇవ్వడమని కాదు. బదులుగా, ఉదార స్వభావాన్ని అలవరచుకోవాలన్నదే దీనిలోని సలహా: “ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును.”  23అవసరతగల సమయాల్లో పంచుకోవడం ద్వారా, ఇచ్చే స్ఫూర్తిని మనం పురికొల్పుతాము, అది చివరికి మనకు ప్రయోజనకరంగా ఉంటుంది.

10మానవ సంబంధాలు: “కష్టమంతయు, నేర్పుతో కూడిన పనులన్నియు నరులకు రోషకారణములని నాకు కనబడెను; ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నమువలెనున్నది”  24అని జ్ఞానియైన ఒక రాజు చెప్పాడు. పోటీ స్వభావం అనేకమంది మూర్ఖంగా ప్రవర్తించేలా చేసింది. ఒక వ్యక్తి తన ప్రక్కింటివాళ్ళు 32 అంగుళాల టీవీ కొనడం చూసి, తనదగ్గరున్న 27 అంగుళాల టీవీ బాగానే పనిచేస్తున్నప్పటికీ, 36 అంగుళాల టీవీ కొనడానికి బజారుకు వెళ్తాడు. అలాంటి రోషంతో కూడిన పోటీ స్వభావం గాలిని పట్టుకోవడానికి ప్రయత్నించినట్లు అంటే, పనికిరాని దాని కొరకు పరుగులెత్తినట్లు నిజంగా వ్యర్థం. దీనికి మీరు అంగీకరించరా?

తీవ్రమైన కోపోద్రేకాలను మనమెలా నిగ్రహించుకోగలం?

11ఇతరులు మనల్ని ఏదో అన్నందుకు బహుశా మన మనస్సు నొచ్చుకోవచ్చు. అయితే ఈ సలహాను విచారించండి: “ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.” 25 నిజమే కోపగించడాన్ని సమర్థించగల సందర్భాలు ఉంటాయి. ఒక ప్రాచీన రచయిత “కోపపడుడి” అని సమ్మతిస్తూనే, “గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు”  26అని వ్రాశాడు. అయినా తీవ్రమైన కోపోద్రేకాలను మనమెలా నిగ్రహించుకోగలము? ‘ఒకని సుబుద్ధి [అంతర్దృష్టి, NW] వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.’ 27 ఇక్కడ కావల్సింది అంతర్దృష్టి. మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘అతనలా ఎందుకు ప్రవర్తించాడు? అలాంటి ప్రవర్తనను సమర్థించే పరిస్థితులేమైనా ఉన్నాయా?’ కోపాన్ని అధిగమించడానికి అంతర్దృష్టితోపాటు, మనం ఇతర లక్షణాలు కూడా పెంపొందించుకోవాలి. “జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, . . . వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.”  28అవును, మానవ సంబంధాల్లోని అనేక సమస్యల్ని ప్రేమ పరిష్కరిస్తుంది.

12అయినా శాంతియుతమైన మానవ సంబంధాలను కొనసాగించే మార్గంలో ఒక “చిన్న అవయవం” అడ్డు తగులుతుంది​—⁠అదే నాలుక. ఈ మాటలు ఎంత నిజమోకదా: “యే నరుడును నాలుకను సాధుచేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది.” 29 ఈ సలహా నిజంగా గమనార్హమైనది: “ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను.” 30అయితే నాలుకను ఉపయోగించేటప్పుడు శాంతిని పైపైన మాత్రమే కాపాడేందుకు అర్ధసత్యాలు చెప్పకుండా మనం జాగ్రత్తపడాలి. “మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది.”3 31

13మరలాంటప్పుడు ఇతరులతో ఆరోగ్యదాయకమైన సంబంధాలను మనమెలా కాపాడుకోగలము? ఈ నిర్దేశక సూత్రాన్ని గమనించండి: “మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.” 32 అలా చేసినప్పుడు మనం బంగారు సూత్రం అని అనేకులు పిలిచే దీనికి అనుగుణంగా జీవిస్తాము: “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” 33

14మానసిక ఒత్తిడి: మానసిక ఒత్తిడి అధికంగా ఉన్న ఈ లోకంలో మానసిక సమతుల్యతను మనమెలా కాపాడుకోగలము? “సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.”3 34మన దృష్టిలో సరైనదనిపించే నియమాన్ని ఇతరులు అతిక్రమించినప్పుడు మనం సులభంగా “సంతోషహృదయము”ను పోగొట్టుకోవచ్చు. అయినప్పటికీ మనమీ మాటలు గుర్తుంచుకోవడం మంచిది: “అధికముగా నీతిమంతుడవై యుండకుము; అధికముగా జ్ఞానివికాకుము; నిన్ను నీవేల నాశనము చేసికొందువు?” 35 మరోవైపున జీవిత చింతలు ఎడతెగక మనల్ని బాధిస్తుండవచ్చు. అప్పుడెలా? మనమిది గుర్తుంచుకుందాము: “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును, దయగల మాట దాని సంతోషపెట్టును.” 36 మనకు ప్రోత్సాహాన్నిచ్చే “దయగల మాట”ను, స్నేహపూర్వకమైన మాటను ధ్యానించవచ్చు. క్రుంగదీసే పరిస్థితులెదురైనప్పటికీ అనుకూల దృక్పథం కలిగివుండడం ఆరోగ్యకరమైన ప్రభావాన్ని కూడా చూపిస్తుంది: “సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము.” 37 ఇతరులు మనల్ని పట్టించుకోవడంలేదనిపించి మన మనస్సు క్రుంగిపోయినప్పుడు ఈ సూత్రాన్ని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” 38 అనుకూల దృక్పథాన్ని కలిగివుండడం మూలంగా ప్రతిరోజూ మనమెదుర్కొనే మానసిక ఒత్తిడిని తాళుకోగలం.

15 పైన తెలియజేయబడిన జ్ఞానవాక్కులు 21వ శతాబ్దంలో జీవిస్తున్న నాకు ఉపయోగకరమేనా అని మీరు అనుకుంటున్నారా? వాస్తవానికి, అవి ఒక ప్రాచీన గ్రంథమైన బైబిల్లో ఉన్నాయి. జ్ఞానానికి మూలమైన ఇతర గ్రంథాలకు బదులుగా బైబిలువైపే ఎందుకు చూడాలి? ఎందుకంటే ఇతర అనేక కారణాలతో పాటు బైబిల్లోని సూత్రాలు కాలపరీక్షలో నెగ్గాయన్నది ఒక కారణం. ఉదాహరణకు, స్త్రీ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న కాయోకో, యాసూహీరో అనే ఇద్దరి విషయమే తీసుకోండి. యాసూహీరో వల్ల కాయోకో గర్భవతి అయ్యింది. కేవలం ఆ కారణం చేతనే వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే, ఆర్థిక సమస్యల మూలంగా, తమకు పొసగదని భావించడం మూలంగా వారిద్దరూ కొంతకాలానికే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఒకరికొకరికి తెలియకుండానే వారిద్దరూ యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం ప్రారంభించారు. ఒకరి జీవితంలో కలిగిన విశేషమైన మార్పులను మరొకరు గమనించారు. యాసూహీరో కాయోకో పునర్వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి జీవితం సమస్యారహితమైనది కాకపోయినా జీవితంలో అన్వయించుకోవడానికి వారికిప్పుడు బైబిలు సూత్రాలున్నాయి, అంతేకాదు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వారిద్దరు ఒకరి విషయంలో మరొకరు పట్టువిడుపులు ఉండేలా చూసుకుంటున్నారు. జీవితంలో బైబిలు సూత్రాలను అన్వయించుకోవడంవల్ల వచ్చే సత్ఫలితాలు యెహోవాసాక్షుల మధ్య మీకు కనబడతాయి. బైబిలు ప్రకారం జీవించేందుకు ప్రయత్నిస్తున్న ప్రజలతో పరిచయం పెంచుకునేందుకు వారి కూటాల్లో ఒకదానికి హాజరుకాకూడదూ?

16 పైన పేర్కొనబడిన సలహాలు, జ్ఞానోదయాన్ని కలిగించే బంగారు ఖనియైన బైబిల్లో మీరు కనుగొనే అపారమైన ఆచరణాత్మక జ్ఞానసంపత్తికి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. యెహోవాసాక్షులు తమ జీవితాల్లో బైబిలు సూత్రాలను ఇష్టపూర్వకంగా అన్వయించుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. వారి ఇష్టతకు వెనుకగల కారణాలనూ, బైబిలు గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలనూ ఎందుకు తెలుసుకోకూడదు?